ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్‌.. తెలుగు టీజర్ వచ్చేసింది! | Kollywood Hero Arya Latest SPy Thriller Teaser Out Now | Sakshi
Sakshi News home page

Mr X Movie Teaser: ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్‌.. తెలుగు టీజర్ వచ్చేసింది!

Feb 24 2025 7:48 PM | Updated on Feb 24 2025 8:09 PM

Kollywood Hero Arya Latest SPy Thriller Teaser Out Now

కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్‌ డివైజ్‌ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్‌లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement