Senior Actor And Filmmaker Pratap Pothen Died At Age 70 In Chennai - Sakshi
Sakshi News home page

Actor Pratap Pothen Death: ‘ఆకలి రాజ్యం’ నటుడు ప్రతాప్‌ పోతెన్‌ మృతి

Published Fri, Jul 15 2022 10:21 AM | Last Updated on Tue, Jul 19 2022 9:56 AM

Senior Actor and Filmmaker Pratap Pothen Died At 70 in Chennai - Sakshi

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్‌, సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్‌ పోతెన్‌(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ‘ఆకలి రాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్‌ పోతెన్‌ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్‌గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఆయన సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త కావడం గమనార్హం. 1985లో రాధికతో వివాహం జరుగగా 1986లోనే వీరిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement