Popular Anchor and Host Shivani Sen Passed Away - Sakshi
Sakshi News home page

Anchor Shivani Sen: యాంకర్ మృతి.. ట్వీట్ చేసిన కాసేపటికే!

Published Mon, Jul 10 2023 8:49 PM | Last Updated on Mon, Jul 10 2023 9:03 PM

Anchor Shivani Sen Passed Away - Sakshi

చావు ఎప్పుడు ఎలా వస్తుందో అస్సలు ఊహించలేం. గత కొన్నాళ్లలో పలువురు నటీనటులు ఇలానే గుండెపోటు, అనారోగ్య సమస్యలతో చనిపోయారు. ఇప్పుడు ఓ ప్రముఖ యాంకర్ కూడా అలానే మరణించింది. దేశంలోని పలు ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించిన యాంకర్ కమ్ హోస్ట్ శివానీ సేన్ సడన్‌గా చనిపోయింది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ శతాబ్ది ఉత్సవాలకు ఆమె హోస్టింగ్ చేసింది.

ఆదివారం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న శివానీ సేన్.. ఓ వీడియోని రీట్వీట్ చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే అంటే సోమవారం.. ఈమెకు ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత సమస్య వచ్చింది. దీంతో ప్రాణాలు విడిచింది. ఈమె ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈమెకు ఇప్పటికే పెళ్లి అయి, ఓ బాబు కూడా ఉన్నాడు.

2005లో తొలిసారి ఓ ఈవెంట్ కు హోస్టింగ్ చేసిన శివానీ.. ఆ తర్వాత మన దేశంతోపాటు ఇతర దేశాల్లోనూ పలు కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించింది. కార్పొరేట్ ఈవెంట్స్, కాన్ఫరెన్స్ లు, గవర్నమెంట్ ఈవెంట్స్, మీడియా లాంచ్‌లు, కోటీశ్వరుల కుటుంబాల్లోని పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలు.. ఇలా కార్యక్రమం ఏదైనా తన యాంకరింగ్ తో అదరగొట్టేసేది. ఇప్పుడు ఇలా ఆమె సడన్ గా చనిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.

(ఇదీ చదవండి: అన్నతో గొడవ? తమ్ముడి సినిమాకి అనసూయ విషెస్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement