aadivasi
-
ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజమైన అభివృద్ధి : మంత్రి సీతక్క
బంజారాహిల్స్: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజ మైన అభివృద్ధి అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజనీతిశాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధ తులు: సాధికారత సాధనలో సమస్యలు– వ్యూహాలు’అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి ధనసరి సీతక్క హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆదివాసీ బిడ్డగా ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉం దన్నారు. గత కొన్నేళ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీ పోరాటాలు ఇపμటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభివృద్ధి నమూనాలోనైనా వెనుకంజలో ఆదివాసీలు: హరగోపాల్ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనుకంజలోనే ఉన్నారని ప్రొఫెసర్ హర సదస్సులో మంత్రి సీతక్క,ప్రొఫెసర్ హరగోపాలæ తదితరులు గోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఆదివా సీల ప్రయోజనాల మధ్య ఎప్పుడూ వైరు ధ్యముంటుందని, ఇక్కడ నష్టపోయేది గిరిజ నులేనని ఆయన వివరించారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్ సుధారాణి, అకడమిక్ డైరెక్టర్ పుషμచక్రపాణి, సదస్సు డైరెక్టర్ గుంటి రవీందర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి వడ్డా ణం శ్రీనివాస్, కో–డైరెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు. -
‘ఏ’ అంటే ఆదివాసీలు
అహ్మదాబాద్: ‘‘నాకు ‘ఏ’ అంటే ఆదివాసీలు. వారి ఆశీస్సులతో గుజరాత్లో ఎన్నికల ప్రచారం ప్రారంభించడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా. ఆదివాసీలు నివసించే ప్రాంతాల్లో గతంలో డాక్టర్ల కోసం వెతుక్కోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వల్సాద్ జిల్లా కప్రాడా తాలూకా నానా పోంధా గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన ప్రచారంలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఆ గుజరాత్, మై బనావ్యూ చే(ఈ గుజరాత్‌ను నేను తయారు చేశా) అనే కొత్త నినాదానికి మోదీ శ్రీకారం చుట్టారు. ప్రసంగం మధ్యలో ప్రజలతో పలుమార్లు ఈ నినాదాన్ని పలికించారు. రెక్కల కష్టంతో గుజరాత్‌ను తాము తయారు చేశామని ప్రజలంతా భావిస్తున్నారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి హృదయం నుంచి వస్తున్న ప్రతి శబ్దం ‘ఆ గుజరాత్, మై బనావ్యూ చే’ అని చెబుతోందన్నారు. రాష్ట్రంలో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు మెజార్టీతో నెగ్గబోతున్నట్లు తనకు సమాచారం అందిందని, పాత రికార్డులను బద్దలు కొట్టడానికే తాను ఇక్కడికి వచ్చానని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ సాధించిన రికార్డుల కంటే భూపేంద్ర పటేల్(గుజరాత్ సీఎం) రికార్డులు బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. రాష్ట్ర ప్రజల కోసం చాలినంత సమయం కేటాయిస్తానన్నారు. రాష్ట్ర ప్రగతి స్ఫూర్తిదాయకం ప్రజాసేవ అనేది గుజరాత్ సంప్రదాయం, సంస్కృతిలో ఒక భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆదివాసీలు, ఇతర వర్గాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గుజరాత్ ప్రగతిని స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతి కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. తాను ఢిల్లీలో ఉన్నప్పటికీ గుజరాత్ నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని తెలిపారు. తన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రులు పనిచేసిన వారంతా అభివృద్ధి కోసం శ్రమించారని ప్రశంసించారు. దుష్టశక్తులకు పరాజయమే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేవారికి ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని మోదీ అన్నారు. గుజరాత్‌ను అప్రతిష్టపాలు చేస్తున్న దుష్టశక్తులకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదని చెప్పారు. అలాంటి శక్తులు రాష్ట్రం నుంచి తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని స్పష్టం చేశారు. -
గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు దేశవ్యాప్తంగా సమాన హోదా దక్కాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో గిరిజనులు ఎస్టీలుగా, బీసీలుగా, ఓసీలుగా ఉంటున్నారని.. అలా కాకుండా వారందరికీ సమాన హోదా దక్కే దిశగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన సేవాలాల్ బంజారా భవన్, కుమురంభీం ఆదివాసీ భవన్లను సీఎం శనివారం ప్రారంభించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు అత్యంత ఖరీదైన ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఎస్టీలకు గజంజాగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరిజనులు, ఆదివాసీలు తలెత్తుకునేలా ఆధునిక హంగులతో రెండు భవనాలను నిర్మించాం. ఈ రెండు భవనాలు దేశంలోని గిరిజన సమాజానికి స్పూర్తిగా నిలవాలి. ఇక్కడ పెళ్లుళ్లు, పేరంటాలు వంటివి కాకుండా గిరిజనులను ఉన్నతీకరించే ఆలోచనలకు కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించాలి’’ అని కేసీఆర్ సూచించారు. ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా కుమురం భీం విగ్రహానికి నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పోడు భూముల సమస్యను అతి త్వరలో పరిష్కరిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. పోడు సమస్యల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, అవన్నీ సమర్థంగా పనిచేసేలా గిరిజన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు. గిరిజన భవన్, ఆదివాసీ భవన్లను చక్కటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వినియోగించుకోవాలన్నారు. ‘ఏ తండాలో ఏ సమస్యలున్నాయి? వాటిని ఎలా రూపుమాపాలి? ఏ విధంగా ప్రభుత్వ సేవలు అందిపుచ్చుకోవాలి? అనే కోణంలో సదస్సుల నిర్వహణకు ఈ భవనాలు వేదిక కావాలి. ఏ బంజారా బిడ్డకు అవస్థ వచ్చినా వెళ్లి రక్షణగా నిలవాలి. అప్పుడే ఈ భవనాలకు సార్థకత లభిస్తుంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు. గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. కాగా సీఎం కార్యక్రమ సమయంలో.. ఎస్టీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 12 శాతానికి పెంచాలంటూ బంజారా, ఆదివాసీ భవన్ల వద్ద కొందరు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
ఆదివాసీ అస్తిత్వాలకు గొడ్డలిపెట్టు
జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం జరుగుతోంది. జనగణనలో ఆదివాసీలను హిందువులుగా నమోదుచేస్తూ... వారి చారిత్రక అస్తిత్వాన్ని మాయం చేస్తున్న వైనం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కుల వ్యవస్థ పునాదిగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద ‘బహుళ అస్తిత్వాల’ భారతీయ సమాజం నలిగిపోతోంది. ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతి పెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. అనేక జాతులు, కులాలు, మతాలుగా ఉన్న భారతీయులు తమ తమ సాముదాయక అస్తిత్వాలను కాపాడుకోవడానికి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో కోట్లమంది మూలవాసులు కేవలం తమ అస్తిత్వం కోసమే పోరాడాల్సిన పరిస్థితి దాపురించింది. కులం, మతం, ప్రాంతం, జాతి, భాష, జెండర్ తదితర బహుళ అస్తిత్వాలు అంశీభూతాలుగా ఉన్న భార తీయ సమాజం... నేడు అస్తిత్వ వైషమ్యాల సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. పాలక, ఆధిపత్య అస్తిత్వాలూ; అణగారిన అస్తిత్వాల మధ్య ఒక విధమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దళిత, బహుజన సామాజిక సమూహాలూ; ముస్లిం తదితర మైనారిటీ సమూహాలూ నేడు మెజారిటీ మత, కుల అస్తిత్వ దాష్టీకానికీ, విద్వేషకాండకూ గురవుతున్నాయి. కుల వ్యవస్థ పునాదిగా ఉన్న ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే నినాదంతో సాగుతున్న సాంఘిక పునర్నిర్మాణ జగన్నాథ రథ చక్రాల కింద బహుళ అస్తిత్వాల భారతీయ సమాజం బీటలు వారుతోంది. 2024 నాటికి దేశ జనగణన డిజిటైజేషన్ పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగుతున్న సర్వే వివాదాస్పదంగా మారింది. కుల గణన జరగాలని ఓబీసీలు ఉద్యమిస్తున్నారు. లింగాయత్ తదితర అస్తిత్వ సమూహాలు తమను హిందూ మతంలో భాగంగా కాక, ప్రత్యేక మైనారిటీ మతస్థులుగా గుర్తించాలని 20వ శతాబ్దం ప్రారంభం నుంచీ డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాలు నిర్వహించాయి. ఇప్పుడు అత్యంత నిశ్శబ్దంగా దేశ జనాభాలో 8.6 శాతంగా ఉన్న ఆదివాసీ సమూహాల అస్తిత్వ ఆకాంక్షలను ధ్వంసం చేస్తూ జనగణన సాగిస్తు న్నారు. ఆదివాసీ ప్రజానీకాన్ని హిందువులుగా చిత్రించడానికి వారి దేవతలను సైతం హైందవీకరిస్తున్నారు. అందుకు ఇటీవలి ఉదాహ రణ కోయల కులదేవత సమ్మక్కను హిందూ దేవతను చేస్తున్న వైనం! జనగణన సమయంలో ఆదివాసులు తమను హిందువులుగా నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’లో ఈ దేశ బహుళత్వాన్ని అంతర్థానం చేయడం ద్వారా, అతిపెద్ద ఓటు బ్యాంకును సంఘటితం చేస్తున్నారు. తద్వారా కేంద్రీకృత అధికారాన్ని సుస్థిరం చేయాలని మెజారిటీ మతతత్వ శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగమే... దేశ జనాభాలో 12 కోట్ల పైచిలుకు ఉన్న అమాయక ఆదివాసీ ప్రజలకు హిందూ అస్తిత్వాన్ని అంటగట్టే ప్రయత్నం! షెడ్యూల్డ్ తెగలుగా రాజ్యాంగంలో వర్గీకరణకు గురైన ఆదివాసీ ప్రజల్లో చాలామంది హిందూ, క్రైస్తవం, ఇస్లాం మత శాఖల్లో అంతర్భాగం అయినప్పటికీ... ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో సాంప్రదాయిక ఆదివాసీ మతస్థులుగానే కొనసాగుతున్నారు. 2011 జనగణన ప్రకారం ఆనాటి 121 కోట్ల మంది జనాభాలో 79 లక్షల మంది హిందూ, ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బౌద్ధం, జైన మతాలకు చెందినవారు కాదు. నాస్తికులు, జొరాస్ట్రియన్లు, యూదులు, నిర్దిష్ట, అనిర్దిష్ట ఆదివాసీ మతాలకు చెందిన వారినందరినీ కలిపి ‘ఇతర మతాలు, విశ్వాసాలు’ అనే వర్గీకరణ కింద చేర్చారు. జార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం రాష్ట్రాల పరిధిలోని ఛోటానాగ్పూర్ పీఠభూమి ప్రాంతానికి చెందిన ముండా, భూమిజ్, ఖారియా, బైగా, హో, కురుఖ్, సంతాల్ తెగలకు చెందిన ప్రజలు సంప్రదాయిక చారి త్రక సంలీన మతమైన ‘సార్నాయిజం’కు చెందినవారు. సార్నా మతస్థులు 49 లక్షల మంది, సారి ధమ్మ 5 లక్షలు మంది ఉన్నారనీ; వీరితో పాటు వీరికి తోడు సంతాల్, కోయపూనెమ్, దోన్యీ– పోలోయిజం, సానామహిజం, ఖాసీ, నియామ్త్రే అనే మత విశ్వాసా లున్నట్టు 2011 జనగణనలో నమోదయ్యింది. ఆదివాసీ మతం, ప్రకృతి మతం, ‘సర్వాత్మ వాదం’ విశ్వాసులు కూడా ఉన్నట్టు అందులో నమోదు చేశారు. ఇంతటి వైవిధ్యం గల ఆదివాసీ ప్రజలను రాజకీయ దురు ద్దేశాల నేపథ్యంలో చారిత్రక అస్తిత్వ రహితులుగా మార్చివేసేందుకు పాలకులు ప్రయత్నిస్తుండటం అన్యాయం. వివిధ విశ్వాసాలు, ఆలోచనా ధోరణులు సామాజిక పరిణామ క్రమంలో సమకాలీన పాలక వర్గాల, ప్రజల అవసరాలకు అను గుణంగా ‘చారిత్రక సంలీనం’కు గురయ్యాయి. ఆయా జాతుల, తెగల, రాజ్యాల, సామ్రాజ్యాల పాలకవర్గాల అవసరాలకు అను గుణంగా చారిత్రక సంలీనం మెజారిటీ మతానికి చెందిన పాలకుల ఆధిపత్యాన్ని సుస్థిరం చేసేందుకు ఉపకరించేది. అలాంటి సంలీనం చారిత్రకంగా ప్రతీఘాతుక పాత్ర నిర్వహిస్తుంది. గ్రీకో– ఈజిప్షియన్, హెలినిస్టిక్ కాలంలో, గ్రీకో– రోమన్ మత చారిత్రక సంలీనాలు; షింటో–బౌద్ధం; అక్బర్ స్థాపించిన దీన్ –ఇ– ఇలాహి మతం; జర్మానిక్– సెల్టిక్– క్రిస్టియన్ మత విశ్వాసాల సంలీనాలు; నాజీ జర్మనీలో హిట్లర్ ప్రోత్సహించిన ‘జర్మన్ ఎవలాంజికల్ చర్చ్’; రష్యాలో ప్రతీఘాతుక విప్లవం కోసం ఏర్పాటైన ‘లివింగ్ చర్చ్’ అనే ఉద్యమం... అన్నీ కూడా మత చారిత్రక సంలీనాలే. ఇవన్నీ రాజ్య సుస్థిరత కోసం పాలకుల ప్రోత్సాహంతో ఏర్పాటైన మత చారిత్రక సంలీనాలు. ఈ నేపథ్యంలోనే నేడు ఇండియా వ్యాప్తంగా ‘ఏకీకృత హిందూ అస్తిత్వ’ కార్యక్రమం కూడా ఒక మత చారిత్రక సంలీనమే! భారతీయ న్యాయవ్యవస్థ ప్రకారం స్థానిక లేదా మూలవాసీ మతాలన్నీ హిందూ మతం పరిధిలోకి వస్తాయి. వైదిక మతాలు మాత్రమే హిందూ మతం కిందికి వస్తాయని రాజ్యాంగం గుర్తించక పోవడం వల్ల... ఆదివాసీ లాంటి మైనారిటీ మతాలకు ప్రత్యేక గుర్తింపు రాకుండా పోయింది. ద్వీపకల్పంలోని స్థానిక మతాలన్నిటినీ కలిపి హిందూ మతంగా గుర్తించడం పర్షియన్ల కాలం నుంచి ప్రారంభమైంది. వివిధ విశ్వాసాలకు, ప్రకృతి మతాలకు నిలయంగా ఉన్న ఇండియాను సులభంగా గుర్తించేందుకు వీలుగా పర్షియన్లు ‘హిందూ’ అని పిలవడంతో ఇక్కడి మతాలన్నిటినీ హిందూ మతంగా గుర్తించడం పరిపాటిగా మారింది. 1955 హిందూ వివాహ చట్టంలో కూడా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు కాని వారంతా హిందువులే నని నిర్వచించడం ఒక పెద్ద చారిత్రక తప్పిదమయింది. రాజ్యాంగం లోని ఈ లొసుగును ఆసరాగా తీసుకొని పాలకులు ఆదివాసీలకు జనగణన ద్వారా హిందూ అస్తిత్వాన్ని పులుముతూ, మెజారిటీ ఓటు బ్యాంకును రూపొందించాలనే కుయుక్తులు పన్నుతున్నారు. హిందూ అస్తిత్వం అనేది ఏకరీతి వ్యవస్థ కాదు. కుల అస్తిత్వమనే అసమానత్వం, అస్పృశ్యతల దుర్మార్గమైన దొంతర్ల వ్యవస్థ అది. 12 కోట్లౖకు పెగా ఉన్న ఆదివాసీ ప్రజానీకం అసమానతల దొంతర్ల వ్యవస్థలో భాగమయ్యే ప్రమాదం ఉంది. వీర శైవం, లింగాయత్, శ్రీవైష్ణవం, ఆదివాసీల ప్రకృతి మతాలు కాల క్రమంలో హిందూ చారి త్రక సంలీనానికి గురయ్యాయి. ఇటువంటి ప్రయత్నాలు ఎన్ని జరి గినా ఇప్పటికీ అవైదిక వ్యక్తీకరణలు ఆయా ప్రకృతి మతాల్లో కొన సాగుతూనే ఉన్నాయి. అలాంటి చిన్నపాటి ప్రత్యేకతలను కూడా తొల గించి ‘సామాజిక ఫాసిజానికి’ గురి చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఆదివాసీ ప్రజలను 2011 నాటి జనగణనలోని వర్గీకరణతో గానీ, మొత్తం ‘ప్రకృతి మతం’ అనే వర్గీకరణతోగానీ నమోదు చేయాలి. అదే సమయంలో మైదాన ప్రాంతాల్లోని హిందూ మతం గొడుగుకింద తమ విశిష్టతలను కోల్పోయిన లింగాయత్, శ్రీవైష్ణవం తదితర మత శాఖలను హిందూ మతంలో భాగంగా కాకుండా విడి విడిగా మైనారిటీ మతాలుగా గుర్తించాల్సి ఉంది. వైదికేతర విశిష్ట మతాలను, ఆదివాసీల మతాలను మైనారిటీ మతాలుగా పరిగణిస్తూ రాజ్యాంగ లోపాన్ని సవరణ చేయాలి. మైనారిటీ మత గుర్తింపు కోసం ఆయా మతçస్థులు ఉద్యమిస్తే, ‘ఏకీకృత హిందూ అస్తిత్వం’ అనే ఓటు బ్యాంకు రాజకీయ కుట్రలను ఎదుర్కొనడం సాధ్యమవుతుంది! శ్రమ సంబంధాల ప్రాతిపదికన దళిత, మైనారిటీ తదితర అణచివేత సమూ హాలలోని నిజ అస్తిత్వ ప్రజానీకంతో సంఘటితమైన ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్యమ నిర్మాణమే తక్షణ కర్తవ్యం. ఆత్మగౌరవ, కుల వివక్ష వ్యతిరేక, కుల నిర్మూలనా ఉద్యమాలు ‘ఏకీకృత నిజ అస్తిత్వ’ ఉద్య మాలుగా అవతరిస్తేనే హిందూ చారిత్రక సంలీనాన్ని అడ్డుకోగలం! వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు సీనియర్ జర్నలిస్ట్ మొబైల్: 95503 67536 -
ఆనంద్ మహీంద్రా నోట.. అరకు లోయ మాట.. కారణాలు ఇవే
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇండస్ట్రియలిస్టు. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత వెలుగులోకి తీసుకువచ్చే పనిలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ప్రయత్నాల్లో మరో అధ్యాయం మన అరుకు కాఫీ ప్రయాణం కాఫీ అంటే ఎక్కువ మందికి అస్సాం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత కర్నాటకలోని కూర్గ్ లోయ మదిలో మెదులుతుంది. కానీ మరిచిపోలేని రుచిని అందివ్వడంలో క్షణాల్లో మనసుని శరీరాన్ని ఉత్తేజపరడంలో ఆ రెండింటికి సరిసాటి మన అరుకు కాఫీ. విశాఖ ఏజెన్సీలో అరుకు లోయల్లో ఆదివాసీలు పండించే ఈ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అందువల్లే ఇక్కడ పండిన పంట పండదినట్టే విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆన్లైన్లో అత్యధిక ధరకు అమ్ముడైపోతుంది. అరకు కాఫీని ఒక్కసారి రుచి చూసిన వారు కాఫీ అంటే ఇదే అంటారు. అందుకు మరో ఉదాహారణ మన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. ఐన్‌స్టీన్ ట్వీట్‌తో భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటోను కాఫీ తాగుతున్నట్టుగా కప్‌పై ముద్రించిన గిఫ్ ఫైల్ని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అందులో ఐన్‌స్టీన్ కాఫీ తాగుతూ హుషారుగా ఉంటారు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ సింగర్ జేమ్స్బ్రౌన్ల హుషారుగా మారడానికి కారణం... అతను కచ్చితంగా బెంగళూరులో ఉన్న అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే కారణం అని అర్థం వచ్చేలా కామెంట్ రాశారు. James BrownStein? He must be at the Araku Café Bengaluru… pic.twitter.com/q7wtG5k1DT — anand mahindra (@anandmahindra) December 8, 2021 ఏంటీ అరకు ఆనంద్ మహీంద్రా నోట అరుకు కాఫీ గురించిన ప్రస్తావన వచ్చే సరికి నెటిజన్లు ఈ కాఫీ స్టోర్ ప్రత్యేకత గురించి ఆరా తీస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అరకు కేఫ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అత్యున్నత ప్రమాణాలతో అద్భుతమైన కాఫీ తాగేందుకు అక్కడ అరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు తోటల్లో ఆదివాసీలు సంప్రదాయ పద్దతిలో పండించే కాఫీనే ఇక్కడ ఉపయోగిస్తుంటారు. కాఫీ ఫిలాసఫీ గతంలో సైతం అరకు కాఫీకి ప్రచారం చేసి పెట్టారు ఆనంద్ మహీంద్రా. ప్రపంచ కాఫీ దినోత్సం రోజున ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ అరకు కాఫీ తోటల ప్రత్యేకతను తెలియజేస్తూ అక్టోబరు 1న ట్వీట్ చేసింది. దాన్ని ఆనంద్మహీంద్రా రీ ట్వీట్ చేస్తూ ఇది కప్ కాఫీ కంటే ఎక్కువ...ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టారు. More than just a cup of coffee…it’s a philosophy of life… @arakucoffeein @naandi_india https://t.co/UfAH5RtIjF — anand mahindra (@anandmahindra) October 1, 2021 లక్షమందికి ఆధారం అరకు వ్యాలీలో సుమారు లక్ష మంది ఆదివాసీలు కాఫీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మూడు కోట్లకు పైగా కాఫీ మొక్కలు పెంచుతున్నారు. వీరికి కాఫీ తోటల సాగులో ఆధునిక పద్దతులు తెలపడంతో పాటు మార్కెటింగ్‌లో సాయం చేస్తోంది ఆనంద్మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ సంస్థ. దీంతో అమెజాన్‌తో పాటు అనేక ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అరకు కాఫీ లభిస్తోంది. బ్రాండ్ అంబాసిడర్లా ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించడం, సాయం చేస్తూ సాన పట్టడం ఆనంద్ మహీంద్రా ప్రత్యేకత. అదే పద్దతిలో అరకు కాఫీకి అండగా ఉన్నారు ఆనంద్ మహీంద్రా. కేవలం సాయం చేసి చేతులు దులుపుకోకుండా రెగ్యులర్‌గా ప్రమోట్ చేస్తూ ఎళ్ల వేళలా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ మాదిరి క్రమం తప్పకుండా ప్రచారం చేస్తున్నారు. - సాక్షి వెబ్ ప్రత్యేకం చదవండి: పల్లెలో ఆటో నడిపిన సీఈవో.. ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆనంద్ మహీంద్రాకు సలహా -
కొంగుపట్టి లాగి.. జాకెట్ చించి..
టేకులపల్లి (భద్రాద్రి కొత్తగూడెం): పోడుభూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీ మహిళారైతులపై అటవీఅధికారులు దౌర్జన్యం చేయడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ సిద్ధారం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. సిద్ధారం సమీపంలో ఆదివాసీలు 30 ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి పట్టాలు ఇచ్చారు. మరికొన్ని భూములకు ఫారెస్టు అధికారులు రీసర్వే చేయడంతో బాధిత రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం సాగు చేసుకుంటున్న రైతులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళ్లిన సమయంలో అటవీ అధికారులు పోడు భూముల వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళలను దుర్భాషలాడుతూ వారిపై దౌర్జన్యానికి దిగారు. ‘ఎవడబ్బ సొమ్మని పోడు దున్నుతున్నారు’ అని తిడుతూ అరకలను తొలగించేందుకు ప్రయత్నించగా మహిళారైతులు అడ్డుకున్నారు. బీట్ ఆఫీసర్ మోతీలాల్ ఆగ్రహంతో మహిళా రైతులు జోగ కుమారి, కోరం రమణల కొంగుపట్టి లాగడంతో వారి జాకెట్లు చిరిగిపోయాయి. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎఫ్ఆర్వోను ‘సాక్షి’ ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఘటనపై బాధితులు జోగ కుమారి, కోరం రమణతోపాటు మహిళారైతులు స్వరూప, సమ్మక్క, పవిత్ర, లక్ష్మీ, నాగమణి, పద్మ, వివిధ పార్టీల నేతలు బోడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీట్ ఆఫీసర్లు మోతీలాల్, రమేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. -
Stan Swamy: అస్సలు సంబంధం లేని..
ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి.. 84 ఏళ్ల వయసులో.. పైగా కాళ్లు చేతులు గొలుసులతో బంధించి ఉంటాయి. ఇంత కంటే దారుణం ఉంటుందా? అంటూ ఓ ఫొటోను నెట్లో వైరల్ చేస్తున్నారు కొందరు. ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా శిక్ష అనుభవించిన స్టాన్ స్వామి.. గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కొందరు ఓ ఫొటోను వైరల్ చేస్తున్నారు. వైరల్.. గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉన్నారు. అలాంటి వ్యక్తిని సంకెళ్లతో బంధించి మరీ చికిత్స అందించారు. ఈ వయసులో ఆయనను అంతలా కష్టపెట్టడం దారుణం. వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో.. అంటూ కొందరు నెటిజన్స్ ఆ ఫొటోను వైరల్ చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్.. అయితే గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో అది మే నెలలో బాగా వైరల్ అయిన ఫొటోగా తేలింది. ఆ వ్యక్తి పేరు బాబురామ్ బల్వాన్(92). ఓ హత్య కేసులో యూపీ ఉటా జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో అతన్ని ఆస్పతత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. అయితే ఈ ఫొటో కూడా వివాదాస్పదం కాగా.. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో అలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చుకున్నారు అప్పుడు. అయినా ఆ వివాదం సర్దుమణగపోకపోవడంతో వార్డెన్‌ను సస్పెండ్ చేశారు కూడా. -
ఇది పోలింగ్ బూతే
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అత్యంత కష్టతరమైన పని. అందులోనూ అత్యంత వెనుకబడిన, కనీస రవాణా సదుపాయాలు లేని ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణ అతి కష్టం. అలాంటి కోవలోదే జార్ఖండ్‌లోని హజారీబాగ్. హజారీబాగ్ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో ఓట్లు వేయించేందుకు స్థానిక ఎన్నికల నిర్వహణాధికారులు ముçప్పుతిప్పలు పడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని ప్రజలు వారు. అభివృద్ధి వారి గూడేల్లోకి అడుగిడే పరిస్థితులే లేవు సరికదా జార్ఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మావోయి స్టుల ప్రాబల్యం ప్రబలంగా ఉంది. ఎలాగైనా పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ఆదివాసీలను ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు ఎన్నికల నిర్వాహకులు. కొండకోనల్లో ఉండే గిరిజనులను రప్పించేందుకు ఓ సరికొత్త ఎత్తుగడ వేశారు. గతంలో స్థానిక ఆదివాసీ ప్రజల్లో అత్యధిక మంది రైలు ఎక్కడం కాదు కనీసం చూడను కూడా చూసి ఉండర ని తెలిసుకున్నారు. అంతే రైలు బోగీ ఆకారంలో పోలింగ్ బూత్‌ని ఏర్పాటు చేసి, దానికి 140 నంబర్ ఇచ్చారు. దానికి తోడు రైలు బూత్ గురించి గిరిజన గూడేల్లో విస్తృతంగా ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల అధికారులు ఊహించినట్టుగానే నిజమైన రైలుని చూడని ఆదివాసీలు రైలు బూత్‌ని చూడ్డం కోసం వచ్చి, ఎంచక్కా రైలెక్కి తమ ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కుని వినియోగించుకుని వెళ్ళిపోయారు. టికెట్టు లేకుండా రైలెక్కినట్టూ అయ్యింది. అధికారులకు ఆశించిన ఓటుని వినియోగించుకోవడమూ జరిగింది. బూత్‌నంబర్ 140 జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం పరిధిలోని రామ్‌గఢ్ బ్లాక్లోనిది. -
అటవీ సంరక్షణలో బిష్ణోయ్ ఆదర్శం
1972 వన్యమృగ సంరక్షణకు చట్టం అమల్లోకి వచ్చింది. అభయారణ్యాలలోకి అడుగు పెట్టడం, వన్యమృగాల వేట చట్టవిరుద్ధమైంది. అయినా ఈ చట్టం మాఫియాను ఆపలేకపోయింది. అటవీ అధికా రులకు ఆయుధాలిచ్చినా వేట మాత్రం ఆగలేదు. కొన్ని ముఠాలు అక్రమంగా వనంలోకి ప్రవేశించి వన్యప్రాణులను వేటాడటం వలన కొన్ని జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడ్డది. అంతెందుకు ఆదిలాబాద్ జిల్లాలో 2012లో కవ్వాల్ అభయార ణ్యాన్ని పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించిన తరువాత కూడా వేట ఆగలేదు. మహారాష్ట్ర నుంచి వేటగాళ్లు తుపాకులతో పులులను వేటాడారు. అదే జిల్లా వెంచపల్లి జింకల అభయారణ్యంలో 1980లో వందల సంఖ్యలో కృష్ణ జింకలు ఉన్నట్లు అటవీ శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ ఇప్పుడక్కడ పదంటే పది కృష్ణ జింకలు కూడా కన్పించవు. సంపన్న కుటుంబాల్లో వేట ఒక వినోదం. సల్మాన్ ఖాన్ వేట అటువంటిదే. రాజస్తాన్‌లో కంకణీ గ్రామంలో రెండు కృష్ణజింకలను వేటాడిన సల్మాన్ ఖాన్ అక్కడి బిష్ణోయ్ తెగ యువకుల కంటపడ్డారు. తుపాకీ కాల్పుల శబ్దం వినగానే అప్రమత్తమైన యువకులు వాహనం వెంట పడి వివరాలు సేక రించి, ఫిర్యాదు చేశారు. సంపన్న వర్గాలు, పలుకు బడి వర్గాలు ఒక్కటైనా బిష్ణోయ్ యువకులు చివరి వరకు నిలబడి కేసు గెలిచారు. పులుల సంరక్షణ అనే కుట్రతో పాలకులు, పారి శ్రామిక వర్గాలు సంయుక్తంగా చెంచు, ఆదివాసి, ఆటవిక తెగలను అడవినుంచి వెళ్లగొట్ట టానికి ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆదివాసీలు అడవిలో అంతర్భాగమే. అడ విని అక్కడి జంతువులను, పక్షులను ఆదివాసీ గిరిజనులను వేరుగా చూడలేం. అటవీ ఆవరణ అంతస్థులో ఒక్కొక్క జాతిది ఒక్కో అంతస్థు. ఏ ఒక్క అంతస్థు దెబ్బతిన్నా... పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. అడవిలో సాయంత్రం ఐదుగంటలకే చీకటి తెరలు కమ్ముకుం టాయి. చీకటి పడక ముందే గుడిసెలకు చేరు కుంటారు. సరిగ్గా ఈ సమయంలో అడవిలో జీవ రాశులు బయటికి వస్తాయి. ఆహార ఆన్వేషణ పూర్తి చేసుకొని సూర్యోదయం వేళకు తావుకు చేరుకుం టాయి. సూర్యోదయం తరువాతే ఆదివాసీ దిన చర్య మొదలవుతుంది. ఆదివాసుల జీవన చర్యలు జీవ రాశుల జీవన విధానంపై జోక్యం చేసుకోవు. ప్రకృతే ఆదివాసీలకు, అటవీ జంతువులకు మధ్య అలాంటి సర్దుబాటు చేసింది. కానీ, అభయారణ్యాల్లోంచి ఆదివాసులను బయటకు పంపడం అన్యాయం. ‘చెంచులపై పరిశోధనకు వెళ్లి రాత్రి వేళ కుమ్మనిపెంటలోని అర్తి అంజన్న గుడిసెలో నిద్ర పోతుంటే ఏగిళ్లుబారే వేళ నిద్ర లేపి గుడిసెనుక నుంచి పోతున్న పులిని పిల్లిని చూపినట్టు చూపాడు’ అని ‘మరణం అంచున’ పుస్తకంలో రచయిత తన అనుభవాన్ని చెప్పారు. నిజానికి నల్లమలలో చెంచులు, పులులు కలిసే జీవనం చేస్తారు. వందల ఏళ్లుగా ఈ తంతు అలానే సాగుతోంది. ఇప్పుడేదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు చెంచు జాతులను అడవి దాటించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక నూతన ఆర్థిక విధానాల పర్యవసానం, అటవీ వన రులు, ఖనిజసంపద మీద పెట్టుబడి దారుల కన్ను, దానికి ఏ మిన హాయింపు లేకుండా కేంద్ర ప్రభుత్వాల దన్ను ఉండి ఉండవచ్చు. ఆటమిక్ మిన రల్ డైరెక్టర్ ఫర్ ఎక్స్‌ఫ్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ చేసిన ఏరియల్ సర్వేలో నల్లమల అటవీ ప్రాంతంలో వజ్రాలు, బంగారంతో పాటు 24 రకాల ఖనిజాలు ఉన్నాయని, వీటిలో వజ్రాలు, బంగారం, గ్రానైట్ వెలికితీత లాభదాయకంగా ఉంటుందని నిర్ధారణ అయింది. ఈ నివేదిక ఆధా రంగానే దక్షిణాఫ్రికాకు చెందిన డిబీర్స్ అనే మల్టీ నేషనల్ వజ్రాల కంపెనీకి నల్లమలలో వజ్రాల అన్వేషణకు 2009 నవంబర్‌లో అప్పటి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచే చెంచుల తరలింపు ముమ్మరం అయింది. అడవిని నాశనం చేసి, వన్య ప్రాణులను (ఆదివాసులతో సహా) సంహ రించి ఖనిజాల సంపదను దోచుకొనిపోయే విస్తాపన నుంచి అడవిని, చెంచు, ఆదివాసులను రాజస్తాన్‌లోని బిష్ణోయ్ తెగ యువత స్ఫూర్తితో కాపాడు కుందాం. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ మొబైల్ : 94403 80141 -
గిరిజన వర్సిటీ చేజారింది
ఉట్నూర్(ఖానాపూర్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందనే ఆశ ఇక కలగానే మిగిలిపోనుంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి జయశంకర్‌భూపాల్‌పల్లి జిల్లా ములుగు మండలం జాకారంలో వచ్చే జూన్‌లో గిరిజన యూనివర్సిటీ ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని గత గురువారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వర్సిటీ కోసం అవసరమైన భూమిని సేకరించినట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాయాలనీ అధికారులకు సూచించారు. 2008లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సంవత్సరం నవంబర్ 17న జీవో నంబరు 797 విడుదల చేసింది. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంగిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 2011 ఆగస్టు 27న జీవో నంబరు 783 జారీ చేసింది. దీంతో జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఆదివాసీలకు కేంద్ర స్థానమైన ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలవెనుకాల ప్రభుత్వ భూమి 470 ఎకరాల్లో పరంపోగు భూమి 300 ఎకరాలు గుర్తించింది. 7వ నంబరు జాతీయ రహదారికి 34 కిలోమీటర్ల దూరంలో రవాణా, హైటెన్షన్ విద్యుత్‌తోపాటు ఇతర సౌకర్యాలు=ఉన్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడంతో యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని ప్రభుత్వాలు పక్కన పెట్టాయి. కేంద్రంలోని యూపీఏప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సందర్భంగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ కేంద్రమంత్రి వర్గం ఆమోదించిన బిల్లు పదకొండో అంశంలో తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుప్రస్తావన ఉంది. అప్పటికే జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేయడంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు అవుతుందని అంతా ఆశించారు. ప్రారంభానికి ఏర్పాట్లు గిరిజన యూనివర్సిటీ పాత వరంగల్ జిల్లా(ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లా)లో ఏర్పాటుకు గత ప్రభుత్వాల హయాంలోనే బీజం పడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా కిశోర్ చంద్రదేవ్, కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రిగా, పాత వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గానికి చెందిన బలరాంనాయక్ ఉండడంతో యూనివర్సిటీని ఆ జిల్లాకు తరలించేలా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు సూత్రపాయ అనుమతులు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉన్న పాత ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలో అనువైన ప్రాంతంలో ఏర్పాటుకు నిర్ణయించారు. మొదట ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా ప్రయత్నాలు జరిగినా.. పోలవరం ముంపు ప్రాంతాలైన ఎనిమిది మండలాలు ఆంధ్రప్రదేశ్‌లో కలుపడంతో అక్కడ సాధ్యం కాలేదు. అదే జిల్లాలోని ఇల్లందులో ఏర్పాటుకు అనుకున్నా.. అక్కడ బొగ్గు గనులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగినా.. పరిస్థితులు ఆశాజనకంగా లేవని నిర్ధారించడంతో మాజీ కేంద్ర మంత్రి బలరాంనాయక్ నియోజకవర్గం ములుగులో ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం యూనివర్సిటీ ఏర్పాటుకు అవకాశాలు సర్వే చేయాలని అప్పట్లో ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలో అనుకున్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ములుగు మండలం జాకారంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆశలపై ప్రభుత్వం పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది. అనువైన పరిస్థితులు ఉన్నా.. ఉమ్మడి జిల్లా ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్‌లో యూనివర్సిటీ ఏర్పాటుకు అనువైన అవకాశాలు ఉన్నా.. రాజకీయ కారణాలు, ఒత్తిళ్లతోనే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2008లోనే ఉట్నూర్‌లో అవసరమైన ప్రభుత్వ పరంపోగు భూమిని అధికారులు గుర్తించారు. 4,95,794 గిరిజన జనాభాతో వివిధ గిరిజన తెగలకు అనువైన ప్రాంతంగా ఉందని, ఇతర సౌకర్యాల కల్పనకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉన్నాయని నివేదికలు ప్రభుత్వాలకు పంపించినా ఫలితం లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం కావడంతోనే మొండి చేయి చూపిందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. తాము యూనివర్సిటీ కోసం ఎన్ని పోరాటాలు చేసినా ప్రజాప్రతినిధుల సహకారం లేకపోవడంతో యూనివర్సిటీ వేరే జిల్లాకు తరలివెళ్లిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలి
హైదరాబాద్: బ్రాహ్మణీయ, సామ్రాజ్యవాద భావజాలాన్ని అడ్డుకోవాలని విరసం నేత వరవరరావు అన్నారు. సోమవా రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం (విరసం) 26వ మహాసభల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నేరెళ్ల ఘటన, మందకృష్ణ మాదిగ అరెస్టుల నేపథ్యంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందనిపిస్తోందని అన్నారు. రాజ్యం చేతిలో అనేకమంది విప్లవ రచయితలు, ఆదివాసీలు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలు, ఆదివాసీల మధ్య పాలకులు చిచ్చు పెడుతున్నారని విమర్శిం చారు. చివరికి ప్రభుత్వ కార్యాలయాలకూ కాషాయం రంగు వేస్తున్నారన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని ప్రపంచ తెలుగు మహాసభలకు దూరం పెట్టారన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో మహబూబ్‌నగర్ క్రౌన్ గార్డెన్లో జరిగే విరసం మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో విరసం సభ్యులు గీతాంజలి, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్ల పేరిట చంపుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలకు గురిచేసి బూటకపు ఎన్కౌంటర్లలో చంపుతున్నారని పలువురు వక్తలు ఆరోపించారు. 37, 38, 39 అధికరణల ప్రకారం సంక్రమించిన సమానహక్కులను కూడా హరిస్తున్నారని విమర్శించారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం(ఎస్వీకే)లో ‘రాజ్యహింస – ప్రతిఘటన’ అనే అంశంపై సదస్సు జరిగింది. వివిధ ఎన్కౌంటర్లలో చనిపోయిన బాధిత కుటుంబసభ్యులు సదస్సులో విలపించారు. టీఆర్ఎస్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని, మేకతోలు కప్పుకున్నవారిలాగా పాలకులున్నారని, వారిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం దానిపై న్యాయవిచారణ జరిపించాలని పేర్కొన్నారు. టేకులపల్లి ఎన్కౌంటర్ ప్రభుత్వ హత్యేనని, దళసభ్యుల్ని ముందే పట్టుకుని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని విరసం నేత వరవరరావు ఆరోపించారు. పోలీసుల అదుపులో ఇంకా ముగ్గురున్నారని, వారికి ప్రాణహాని ఉన్నందున వెంటనే కోర్టులో హాజరుపర్చాలని అన్నారు. పాలకులుగా ఎవరున్నా హింస ఆగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం వస్తే మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని ప్రకటించిన సీఎం కేసీఆర్ తెలంగాణలో రక్తపుటేరులు పారిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లలో చనిపోయినవారిలో 95 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలేనని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. టేకులపల్లి ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు. సభలు, సమావేశాలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, విమలక్క, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, జి.ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. సభలో గందరగోళం... సభాప్రాంగణంలో సీపీబాట పేరుతో కరపత్రాలను పంచిపెట్టడం వివాదాస్పదమైంది. వాటిలో న్యూడెమోక్రసీపై విమర్శలుండటంతో ఆ పార్టీ రాష్ట్ర నేత పోటు రంగారావు అభ్యంతరం తెలిపారు. సభకు మద్దతు తెలపడానికి వచ్చిన తమ పార్టీకి వ్యతిరేకంగా కరపత్రాలు పంచడం ఏంటని ప్రశ్నించడంతో కాసేపు గందరగోళం నెలకొంది. -
మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లాలోని జన్నారం మండలోని కొత్తపేటతండాపై ఆదివాసీల దాడికి దిగి, గుడిసెలకు నిప్పు పెట్టారు. పలు వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కోలంగూడలో భీమ్రావ్ అనే వ్యక్తిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే లంబాడీలే భీమ్ రావ్‌పై దాడికి చేశారని ఆదివాసీ నాయకులు తండాను ధ్వంసం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు తండాలో భారీగా మోహరించారు. ఆదివాసీలు, లంబాడీ నేతలతో డీసీపీ మనోహర్ రావు చర్చలు జరుపుతున్నారు. -
మంచిర్యాల జిల్లాలో మరోసారి ఉద్రిక్తత
-
లంబాడీలను ఎస్టీల నుంచి తొలగించాలి
ఇంద్రవెల్లి(ఖానాపూర్): లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందేనని ఆదివాసీలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు ఉద్యమం ఆపేది లేదని తేల్చి చెప్పారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఇంద్రవెల్లి స్తూపం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ఆదివాసీలు శనివారం భారీ ర్యాలీ తీశారు. నల్లబ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నా.. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆదివాసీలు తరలివచ్చారు. ఐటీడీఏ ఏపీవో జనరల్ కుమ్రు నాగోరావు, తహసీల్దార్ శివరాజ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గత పాలకులు లంబాడీలను విద్యాపరంగా మాత్రమే 1976లో ఎస్టీ జాబితాలో చేర్చారని, దీంతో అసలైన ఆదివాసీలకు వచ్చే ఉద్యోగ, రాజకీయ హక్కులన్నీ లంబాడీలే దోచుకుంటున్నారని ఆరోపించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్‌తో డిసెంబర్ 9న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తామని చెప్పారు. ఏజెన్సీలో 144 సెక్షన్ ఎత్తివేయా లని డిమాండ్ చేశారు. ఆదివాసీల ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓఎన్డీ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి వెడ్మా బోజ్జు, అమరవీరుల ఆశయ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పుర్క బాపురావ్, ఆదివాసీ నాయకులు కనక తుకారాం, ఆర్క ఖమ్ము, తోడసం నాగోరావ్, ఆయా గ్రామాల పెద్దలు వెట్టి రాజేశ్వర్, సోయం మాన్కు, హెరేకుమ్ర జంగు, మెస్రం ఇస్తారి, కినక లచ్చు, మెస్రం వెంకట్రావ్ తదితరులున్నారు. -
గిరిజనులు లేకుండానే వేడుకలా?
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆవేదన ∙ తూతూ మంత్రంగా ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు రంపచోడవరం : గిరిజన తెగలను ఆహ్వానించకుండానే అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడంపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు రావాల్సిన గిరిజనులు గ్రామాల్లో ఉండిపోయారని, పాఠశాల విద్యార్థులు మాత్రం వేదిక ఎదుట ఉన్నారన్నారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులకు స్థానం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రాజేశ్వరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెకంటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, కె.కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు. కలెక్టర్ వెళ్లిపోవడం బాధాకరం.. జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏజెన్సీలో వివిధ గిరిజన తెగలకు చెందిన వారితో ఆదివాసీ ఉత్సవాలను జ్వోతి ప్రజ్వలన చేయించి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఏజెన్సీలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఆదివాసీ దినోత్సవ ఉద్దేశాన్ని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వేదికపై గిరిజనులతో మాట్లాడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలెక్టర్ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం బాధకరమన్నారు. ఇలా అయితే గిరిజనులు వెల్లడించిన సమస్యలు పట్టించుకునేది ఎవరని ఆమె ప్రశ్నించారు. చట్టాలు అమలు కావడం లేదు.. చట్టాలు అమలు కావడం లేదని నిజమైన గిరిజనులు కులధ్రువీకరణ పత్రాలు పొందాలంటే అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో గిరిజన హక్కులను, రాయితీలు, ఉద్యోగాలను నకిలీ గిరిజనులు అనుభవిస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆరికట్టలన్నారు. ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఐటీడీఏ నుంచి తీర్మానం చేయాలని కోరారు. గంగవరం మండలంలో బీసీ కులస్తుడు, అతడి కుమారులకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందడం ఏజెన్సీలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి పరాకాష్ట అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఐటీడీఏ పీఓ రవి పట్టాన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. స్టాళ్లలో కనిపించని ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడా గిరిజన సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే ఏర్పాట్లు చేయలేదు. కేవలం హార్టికల్చర్, జీసీసీ, ఉచిత వైద్యం శిబిరం, వంటి వాటితో మమ అనిపించారు. ఎమ్మెల్యేను సన్మానించిన సంస్కృతి సంఘం స్దానిక గిరిజన సంక్షేమ సంస్కృతిక సం«ఘం ఆ««దl్వర్యంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఏజెన్సీలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలను సంఘం నాయకులు కడబాల రాంబాబు, కంగల శ్రీనువాస్,కుసం ఫకీరుదొర తదితరులు ఘనంగా సన్మానించారు. కోనసీమ అందాలపై శతకం అంకితం అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు. బుర్రిలంకలో సినీ సందడి నర్సరీల్లో ‘మిక్చర్ పొట్లం’ చిత్ర సన్నివేషాలు చిత్రీకరణ కడియం : మండలంలోని బుర్రిలంకలోని పలు నర్సరీల్లో మంగళవారం సినిమా షూటింగ్ సందడి చేసింది. శ్వేతాబసుప్రసాద్ ప్రధాన పాత్రలో గోదావరి సినీటోన్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘మిక్చర్ పొట్లం’ సినిమా షూటింగ్ జరిగింది. బుర్రిలంకలోని శ్రీ వెంకటరమణ నర్సరీ గార్డెన్లో ఒక పాటలోని పలుసన్నివేశాలను చిత్రీకరించారు. ఎంఎల్ సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ కుమారుడు జయంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. అలాగే సుమన్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారన్నారు. చిత్ర బృందంలో కృష్ణభగవాన్, చిట్టిబాబు, జూనియర్ రేలంగి తదితర నటులు నర్సరీ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆద్యంతం హాస్యభరితం ‘మిక్చర్‌పొట్లం’ కంబాలచెరువు : గోదావరి సినీటోన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మిక్చర్ పొట్లం’ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ కంటే వీరన్న చౌదరి అన్నారు. ఆ సినిమా విశేషాలపై రాజమహేంద్రవరం రివర్‌బేలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రముఖ హీరో భానుచందర్ కుమారుడు జయంత్ హీరోగా, గీతాంజలి హీరోయిన్గా నటిస్తున్నారన్నారు. మాధవపెద్ది సురేష్ సంగీతానందిస్తుండగా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సతీష్‌కుమార్ వహిస్తున్నారన్నారు. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
మంచిర్యాల సిటీ : జిల్లాలో గిరిజనులు, ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయం వద్ద ఐఎఫ్టీయూ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆర్డీవో ఆయిషా మస్రత్ ఖానంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి టీ. శ్రీనివాస్ మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న భూములకు ప్రభుత్వం పట్టాలివ్వకుండా, ఆక్రమించుకోవడం సరికాదన్నారు. సాగుచేసుకుంటున్న రైతులపై సంబంధిత శాఖ అధికారులు అక్రమ కేసులను పెట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు. హరితహారం పేరిట సాగుభూముల్లో మొక్కలు నాటుతూ, వారి పంటలను ధ్వంసం చేస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో లాల్‌కుమార్, చాంద్‌పాషా, బ్రహ్మానందం, దేవరాజు, ఎం జ్యోతి, శ్రీకాంత్ ఉన్నారు. -
రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
గుంటూరు వెస్ట్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి నారాయణుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించే వేడుకలకు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.