
ఆదివాసీల అభివృద్ధికి మేధావులు ప్రభుత్వానికి సలహాలివ్వాలి
బంజారాహిల్స్: దేశంలోని మారుమూల ప్రాంతాలు, ఆదివాసీ గూడేల అభివృద్ధే నిజ మైన అభివృద్ధి అని మంత్రి సీతక్క అభిప్రాయపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజనీతిశాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ‘ఆదివాసీ జీవనోపాధి పద్ధ తులు: సాధికారత సాధనలో సమస్యలు– వ్యూహాలు’అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి ధనసరి సీతక్క హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఆదివాసీ బిడ్డగా ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉం దన్నారు. గత కొన్నేళ్లుగా ఆత్మగౌరవం కోసం ఆదివాసీ పోరాటాలు ఇపμటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏ అభివృద్ధి నమూనాలోనైనా వెనుకంజలో ఆదివాసీలు: హరగోపాల్
ఏ అభివృద్ధి నమూనాలోనైనా ఆదివాసీలు వెనుకంజలోనే ఉన్నారని ప్రొఫెసర్ హర సదస్సులో మంత్రి సీతక్క,ప్రొఫెసర్ హరగోపాలæ తదితరులు గోపాల్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, ఆదివా సీల ప్రయోజనాల మధ్య ఎప్పుడూ వైరు ధ్యముంటుందని, ఇక్కడ నష్టపోయేది గిరిజ నులేనని ఆయన వివరించారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయ రిజి స్ట్రార్ సుధారాణి, అకడమిక్ డైరెక్టర్ పుషμచక్రపాణి, సదస్సు డైరెక్టర్ గుంటి రవీందర్, సామాజిక శాస్త్రం విభాగాధిపతి వడ్డా ణం శ్రీనివాస్, కో–డైరెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment