
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇండస్ట్రియలిస్టు. సమాకాలిన అంశాలపై వెంటనే స్పందించే మనసున్న మనిషి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభను గుర్తించి మరింత వెలుగులోకి తీసుకువచ్చే పనిలో ఎప్పుడూ ముందుంటారు. అలాంటి ప్రయత్నాల్లో మరో అధ్యాయం మన అరుకు కాఫీ ప్రయాణం
కాఫీ అంటే ఎక్కువ మందికి అస్సాం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత కర్నాటకలోని కూర్గ్ లోయ మదిలో మెదులుతుంది. కానీ మరిచిపోలేని రుచిని అందివ్వడంలో క్షణాల్లో మనసుని శరీరాన్ని ఉత్తేజపరడంలో ఆ రెండింటికి సరిసాటి మన అరుకు కాఫీ. విశాఖ ఏజెన్సీలో అరుకు లోయల్లో ఆదివాసీలు పండించే ఈ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అందువల్లే ఇక్కడ పండిన పంట పండదినట్టే విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఆన్‌లైన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైపోతుంది. అరకు కాఫీని ఒక్కసారి రుచి చూసిన వారు కాఫీ అంటే ఇదే అంటారు. అందుకు మరో ఉదాహారణ మన ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా.
ఐన్‌స్టీన్ ట్వీట్‌తో
భౌతిక శాస్త్రంలో ఎన్నో ఆవిష్కరణలకు ఆద్యుడైన నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఫోటోను కాఫీ తాగుతున్నట్టుగా కప్‌పై ముద్రించిన గిఫ్ ఫైల్‌ని ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. అందులో ఐన్‌స్టీన్ కాఫీ తాగుతూ హుషారుగా ఉంటారు. శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ సింగర్ జేమ్స్‌బ్రౌన్‌ల హుషారుగా మారడానికి కారణం... అతను కచ్చితంగా బెంగళూరులో ఉన్న అరకు కేఫ్‌లో కాఫీ తాగడమే కారణం అని అర్థం వచ్చేలా కామెంట్ రాశారు.
James BrownStein?
— anand mahindra (@anandmahindra) December 8, 2021
He must be at the Araku Café Bengaluru… pic.twitter.com/q7wtG5k1DT
ఏంటీ అరకు
ఆనంద్ మహీంద్రా నోట అరుకు కాఫీ గురించిన ప్రస్తావన వచ్చే సరికి నెటిజన్లు ఈ కాఫీ స్టోర్ ప్రత్యేకత గురించి ఆరా తీస్తున్నారు. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో అరకు కేఫ్‌కి ప్రత్యేక స్థానం ఉంది. అత్యున్నత ప్రమాణాలతో అద్భుతమైన కాఫీ తాగేందుకు అక్కడ అరకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు తోటల్లో ఆదివాసీలు సంప్రదాయ పద్దతిలో పండించే కాఫీనే ఇక్కడ ఉపయోగిస్తుంటారు.
కాఫీ ఫిలాసఫీ
గతంలో సైతం అరకు కాఫీకి ప్రచారం చేసి పెట్టారు ఆనంద్ మహీంద్రా. ప్రపంచ కాఫీ దినోత్సం రోజున ఆనంద్‌మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ అరకు కాఫీ తోటల ప్రత్యేకతను తెలియజేస్తూ అక్టోబరు 1న ట్వీట్ చేసింది. దాన్ని ఆనంద్‌మహీంద్రా రీ ట్వీట్ చేస్తూ ఇది కప్ కాఫీ కంటే ఎక్కువ...ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అంటూ క్యాప్షన్ పెట్టారు.
More than just a cup of coffee…it’s a philosophy of life… @arakucoffeein @naandi_india https://t.co/UfAH5RtIjF
— anand mahindra (@anandmahindra) October 1, 2021
లక్షమందికి ఆధారం
అరకు వ్యాలీలో సుమారు లక్ష మంది ఆదివాసీలు కాఫీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ మూడు కోట్లకు పైగా కాఫీ మొక్కలు పెంచుతున్నారు. వీరికి కాఫీ తోటల సాగులో ఆధునిక పద్దతులు తెలపడంతో పాటు మార్కెటింగ్‌లో సాయం చేస్తోంది ఆనంద్‌మహీంద్రాకి చెందిన నాంది ఫౌండేషన్ సంస్థ. దీంతో అమెజాన్‌తో పాటు అనేక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అరకు కాఫీ లభిస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్‌లా
ప్రతిభ ఎక్కడ ఉన్నా గుర్తించడం, సాయం చేస్తూ సాన పట్టడం ఆనంద్ మహీంద్రా ప్రత్యేకత. అదే పద్దతిలో అరకు కాఫీకి అండగా ఉన్నారు ఆనంద్ మహీంద్రా. కేవలం సాయం చేసి చేతులు దులుపుకోకుండా రెగ్యులర్‌గా ప్రమోట్ చేస్తూ ఎళ్ల వేళలా చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ మాదిరి క్రమం తప్పకుండా ప్రచారం చేస్తున్నారు.
- సాక్షి వెబ్ ప్రత్యేకం
చదవండి: పల్లెలో ఆటో నడిపిన సీఈవో.. ఫీడ్‌బ్యాక్‌తో పాటు ఆనంద్ మహీంద్రాకు సలహా