
న్యూఢిల్లీ: భీమా కోరేగావ్–ఎల్గార్ పరిషత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ రచయిత వరవరరావు దాఖలు చేసిన శాశ్వత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు సోమవారం విచారణ జరపనుంది. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వడానికి బోంబే హైకోర్టు ఏప్రిల్ 13న నిరాకరించింది.
ఆ ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ వరవరరావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ముగ్గురు సభ్యుల సుప్రీం బెంచ్ విచారిస్తుంది. 83 ఏళ్ల వయసున్న వరవరరావు నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment