న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి ఐదుగురు పౌర హక్కుల నేతలకు విధించిన గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. నిర్బంధ గడువు సెప్టెంబర్ 12తో ముగిసిన నేపథ్యంలో సెప్టెంబర్ 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్వీల్కర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్‌లఖా, వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment