home arrest
-
పౌర హక్కుల నేతల నిర్బంధం పొడిగింపు
న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ అల్లర్ల కేసుకు సంబంధించి ఐదుగురు పౌర హక్కుల నేతలకు విధించిన గృహ నిర్బంధాన్ని సుప్రీంకోర్టు మరో ఐదు రోజులు పొడిగించింది. నిర్బంధ గడువు సెప్టెంబర్ 12తో ముగిసిన నేపథ్యంలో సెప్టెంబర్ 17 వరకు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు ఐదుగురు మేధావులు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎమ్ కన్వీల్కర్, డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పౌరహక్కుల నేతలు వరవరరావు, సుధా భరద్వాజ్, గౌతమ్ నవ్లఖా, వెర్నాన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరాలకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ పుణే పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
సింగరేణి అధికారుల గృహ నిర్బంధం
కోల్‌బెల్ట్ : జయశంకర్ జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధి ఓసీపీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్వాసితులు జీఎంతోపాటు వెంట వచ్చిన అధికారులను గృహ నిర్భంధం చేశారు. కేటీకే ఓసీపీ-2లో బ్లాస్టింగ్ల కారణంగా సమీపంలోని ఆకుదారివాడకు చెందిన దుర్గం రజిత ఇంటిపై రాళ్లు పడగా ధ్వంసమైంది. విషయం తెలుసుకున్న జీఎంతోపాటు ఎస్‌ఓటూ జీఎం పద్మనాభరెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్ జాన్ ఆనంద్, సెక్యూరిటీ ఆఫీసర్ మధుకర్ గురువారం గ్రామాన్ని సందర్శించారు. రజితకు సంబంధించిన ఇంటిలోపలికి వెళ్లి పరిశీలిస్తుండగా అక్కడికి చేరుకున్న ఓసీపీ నిర్వాసితులు అధికారులను రెండు గంటల పాటు ఇంటిలోనే నిర్భంధించారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యపై చర్చిస్తామని జీఎం గురువయ్య హామీ ఇవ్వడంతో వదిలిపెట్టారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ఓసీపీ సమీపంలోని సుమారు 800 ఇళ్ల విషయంలో సర్వే చేయిస్తామని హామీ ఇచ్చి అమలు చేయటం లేదన్నారు. అలాగే బ్లాస్టింగ్లతో బండరాళ్లు పడి ఇళ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఆకుదారివాడకు చెందిన సెగ్గెం లక్ష్మి, చిన్న రాజయ్య, చిన్న సమ్మయ్య ఇళ్లు, బుధవారం దుర్గం రజిత ఇల్లు ధ్వంసమైందని, ప్రాణాపాయం పొంచి ఉందని తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీఎం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కంట్రోల్ బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నామని, ఇళ్లపై రాళ్లు పడటం దురదృష్టకరమన్నారు. త్వరలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పారు. -
సయీద్ గృహనిర్బంధం పొడిగింపు
లాహోర్: ముంబై దాడుల సూత్రధారి, జమాత్ ఉద్ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్ గృహనిర్బంధాన్ని పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయీద్, ఆయన నలుగురు అనుచరులు ఇక్బాల్,అబిద్, హుస్సేన్, ఉబేద్ల మూడు నెలల గృహ నిర్బంధం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై ప్రభుత్వం వీరిని జనవరి 30వ తేదీ నుంచి లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉంచుతోంది.