సయీద్‌ గృహనిర్బంధం పొడిగింపు | Pakistan extends Mumbai attacks mastermind Hafiz Saeed's house arrest by 90 days | Sakshi
Sakshi News home page

సయీద్‌ గృహనిర్బంధం పొడిగింపు

Published Mon, May 1 2017 2:19 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

సయీద్‌ గృహనిర్బంధం పొడిగింపు

సయీద్‌ గృహనిర్బంధం పొడిగింపు

లాహోర్‌: ముంబై దాడుల సూత్రధారి, జమాత్‌ ఉద్‌ దవా ఉగ్రవాద సంస్థ చీఫ్‌ హఫీజ్‌ సయీద్‌ గృహనిర్బంధాన్ని పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది.

ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద సయీద్, ఆయన నలుగురు అనుచరులు  ఇక్బాల్,అబిద్,  హుస్సేన్, ఉబేద్‌ల మూడు నెలల గృహ నిర్బంధం ఆదివారం రాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ గృహనిర్బంధాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలపై ప్రభుత్వం వీరిని జనవరి 30వ తేదీ నుంచి లాహోర్‌లో గృహనిర్బంధంలో ఉంచుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement