
న్యూఢిల్లీ: విప్లవ రచయిత నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ కాల వ్యవధిని సుప్రీంకోర్టు తొలగించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు వేసిన పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది.
82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది.
కాగా భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవర రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది.
చదవండి: పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి
Comments
Please login to add a commentAdd a comment