varavaara rao
-
వరవరరావుకు ఊరట.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: విప్లవ రచయిత నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ కాల వ్యవధిని సుప్రీంకోర్టు తొలగించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు వేసిన పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. కాగా భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవర రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. చదవండి: పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి -
వరవరరావుకి ప్రైవేటు వైద్యులతో పరీక్షలు నిర్వహించాలి
ముంబై: బీమా కోరెగావ్ కేసులో తలోజా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విప్లవకవి వరవరరావుకి నానావతి ఆసుపత్రికి చెందిన ప్రైవేట్ వైద్యుల బృందంచే వీడియో కన్సల్టేషన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని, అవసరమైతే ఆయన వద్దకు వెళ్ళి నేరుగా వైద్య పరీక్షలు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వైద్య పరీక్షల నివేదికను నవంబర్ 16 లోపు కోర్టుకి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. నిందితుడి ఆరోగ్య పరిరక్షణకు నానావతి ఆసుపత్రి వైద్యుల పరీక్షలే ఉపయోగకరమని కోర్టు అభిప్రా యపడింది. వరవరరావు బెయిలు విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది. వరవరరావు భార్య హేమలత, తన భర్తని మెరుగైన చికిత్స కోసం నానావతి ఆసుపత్రికి మార్చాలని, ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు స్వతంత్ర వైద్యుల ప్యానల్‌ను ఏర్పాటు చేయాలని, వరవరరావుకు ఉన్న ఆరోగ్య సమస్యలరీత్యా ఆయన్ను తక్షణమే బెయిల్‌పై విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. వరవరరావు ఆరోగ్యం క్షీణిస్తోందని, అతను జైలులోనే చనిపోయే ప్రమాదం ఉన్నదని వరవరరావు తరఫు న్యాయవాది ఇందిర వ్యాఖ్యానించారు. -
నిర్బంధాన్ని ధిక్కరిద్దాం
తెలుగు విప్లవ రచయితలు ఇద్దరు మహారాష్ట్ర జైళ్లలో బందీలయ్యారు. వీరిలో ప్రొ‘‘ సాయిబాబా నాగపూర్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తూ తీవ్ర అనారోగ్యంతో మృత్యుముఖంలో ఉన్నారు. ఆయనకు వైద్యంకోసం వేసిన బెయిల్‌ను కూడా కోర్టు కొట్టేసింది. ఆధునిక తెలుగు సాహిత్యంలోనే పేరెన్నికగన్న విప్లవకవి వరవరరావు ఐదు నెలల నుంచి పూణేలోని ఎరవాడ జైల్లో బందీ అయ్యారు. 80 ఏళ్ల వయసులో కనీస సౌకర్యాలు లేని జైలు జీవితం అనుభవిస్తున్నారు. వీరేగాక దేశవ్యాప్తంగా సుప్రసిద్ధులైన సుధాభరద్వాజ్, సురేంద్ర గాడ్లింగ్, ప్రొ. షోమాసేన్, వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరేరా, రోనావిల్సన్, సుధీర్ ధావ్లే, మహేష్ రౌత్ కూడా ఎరవాడ జైల్లో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నారు. సాహిత్య, కళా, న్యాయ, మేధో రంగాల్లో దేశం గర్వించదగిన ఈ బుద్ధిజీవులను అక్రమ కేసుల కింద సంఘ్‌పరి వార్ ప్రభుత్వం నిర్బంధించింది. వీళ్లంతా తమ మేధస్సుతో, సృజనాత్మకతతో సమాజ వికాసానికి దోహదం చేశారు. ప్రజాస్వామిక విలువలను, సంస్కృతిని స్థాపించడానికి కృషి చేశారు. ప్రజా పోరాటాలతో కలిసి నడవడమే బుద్ధిజీవుల కర్తవ్యమనే తరతరాల ఆదర్శాన్ని ఎత్తిపట్టారు. అట్టడుగు కులాల, వర్గాల, ఆదివాసుల, మత మైనారిటీల ఉనికినే రద్దు చేసే ప్రభుత్వ విధానాలను వీళ్లు ఎదిరించారు. దేశ సంపదను సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టే కుట్రలను బహిర్గతం చేశారు. తమ శ్రమతో సమస్త సంపదలు సృష్టిస్తున్న కార్మికవర్గంపై జరుగుతున్న దోపిడీని ప్రశ్నించారు. పీడిత ప్రజలు చేస్తున్న పోరాటాల్లో భాగమయ్యారు. అంతిమంగా ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న నియంతృత్వాన్ని ఖండించి, ఒక మానవీయమైన వ్యవస్థను స్థాపించుకోడానికి ప్రజలు చేస్తున్న ప్రయత్నాలకు బాసటగా నిలబడ్డారు. ప్రజల తరపున రాస్తూ, మాట్లాడుతూ, పోరాడుతున్నందుకే వీరి మీద తప్పుడు ఆరోపణలు చేశాయి. బెయిలు రాకుండా అడ్డుకుంటున్నాయి. న్యాయ ప్రక్రియను తమ కనుసన్నల్లో నడుపుతున్నాయి. మన దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం వచ్చేసిందనడానికి వీళ్ల నిర్బంధమే ఒక ఉదాహరణ. ఈ పది మంది మేధావులేకాదు, దేశ వ్యాప్తంగా వేలాది మంది దళితులు, ఆదివాసులు, ముస్లింలు చేయని నేరానికి ఏండ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. మనకు పేర్లు తెలిసిన ఈ పది మంది గురించేగాక జైళ్లలో అక్రమంగా బందీలైన వాళ్లందరి విడుదల కోసం ఆందోళన జరుగుతోంది. దేశంలో హక్కుల ఉల్లంఘన ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఆందోళనపడుతున్నారు. ప్రజాస్వామ్యమంటే భిన్నాభిప్రాయ ప్రకటనలకు చోటు ఉండటం. వేర్వేరు ప్రత్యామ్నాయాలను విశ్వసించి, ఆచరించే అవకాశం ఉండటం. పాలకులు ఈ విలువను ధ్వంసం చేశారు. ఈ స్థితిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా పోరాటాలు జరిగాయి. తెలుగు సాహిత్య, మేధో రంగాల నుంచి కూడా తీవ్ర నిరసన వచ్చింది. ఇందులో భాగంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హైదరాబాదు, వరం గల్, విజయవాడ, కర్నూలు నగరాల్లో విరసం ఆధ్వర్యంలో రచయితలు, మేధావులు, ప్రజాస్వామికవాదులతో ధర్నాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాం. విప్లవ రచయితల సంఘం -
‘ఆపరేషన్ ఆర్కే కాదు...ఆపరేషన్ మైనింగ్’
హైదరాబాద్ : మైనింగ్ కంపెనీలతో చేసుకున్న ఎంవోయులో భాగంగానే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆపరేషన్ ఆర్కే కొనసాగిస్తోందని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ‘ఆపరేషన్ ఆర్కే కాదు... ఆపరేషన్ మైనింగ్. ఆధారాలు లేకుండా మేం ఎప్పుడూ ఆరోపించం. లొంగిపోయిన దళ సభ్యుడు ఇచ్చిన సమచారం మేరకే ఈ ఆపరేషన్ జరిగింది. పేర్లు ఏవైనా చంపడమే లక్ష్యంగా ప్రభుత్వం ఆపరేషన్ కొనసాగిస్తోంది. మావోయిస్టు మృతదేహాల పోస్టుమార్టంలో స్పష్టం లేదు’ అని అన్నారు. ఏవోబీలో బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్కేతో పాటు రవిలను తక్షణమే కోర్టులో హాజరు పరచాలన్నారు. అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు.