virasam leader
-
వరవరరావుకు ఊరట.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: విప్లవ రచయిత నేత వరవర రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ కాల వ్యవధిని సుప్రీంకోర్టు తొలగించింది. అనారోగ్య కారణాలతో శాశ్వత బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టులో వరవరరావు వేసిన పిటిషన్ వేశారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టింది. 82 ఏళ్ల వయసున్న వరవరరావు ఇప్పటికే రెండున్నరేళ్లపాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడని తెలిపిన సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన శాశ్వత మెడికల్ బెయిల్‌ను మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై దాటి ఎక్కడికి వెళ్లకూడదని నిబంధన విధించింది. కాగా భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో వరవర రావు నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సాగించిన కుట్రలో భాగస్వామిగా మారారని ఆరోపిస్తూ వరవరరావు, సుధా భరద్వాజ్ సహా 16 మంది సామాజిక కార్యకర్తలు, మేధావులను 2018 ఆగస్టులో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. చదవండి: పార్లమెంట్ సమావేశాలు వాయిదాపై వివరణ ఇచ్చిన కేంద్ర మంత్రి -
ప్రొఫెసర్ ఖాసీం విడుదల
కుషాయిగూడ: విరసం నేత ప్రొఫెసర్ ఖాసీం బుధవారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తన అరెస్టు నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెలలుగా తనకు సంబం«ధించి వార్తలు ప్రచురించిన వార్తా పత్రికల యాజమాన్యాలకు, ఎడిటర్లకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకొనే టీచర్ అయిన తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇకపై పరిశోధన, అధ్యయనంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతి కోసం రచనలు చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
జ్ఞాన సంపదను పురాణాలకు అంటగట్టవద్దు
నల్లగొండ కల్చరల్: భారతీయ జ్ఞాన సంపదను బ్రాహ్మణ్య కేంద్రంగా పురాణాలకు అంటగట్టే ప్రయత్నాన్ని సహించమని విప్లవ రచయితల సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శి పాణి అన్నారు దీనిని ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సంసిద్ధంగానే ఉంటామని పేర్కొన్నారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన విరసం 21వ సాహిత్య పాఠశాల కార్యక్రమంలో ‘దేశీసాహిత్య సామాజిక చరిత్ర – మార్క్సిజం’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. దేశీయ సాహిత్యం, సామాజిక చరిత్రను మార్క్సిస్టు భావాలతో అర్థం చేసుకోవాలన్నారు. కాగా, మధ్యాహ్నం నిర్వహించిన సమావేశంలో ‘భీమా కోరేగావ్ – బ్రాహ్మణీయ వ్యతిరేక పోరాట ప్రతీక’అనే అంశంపై విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి ప్రసంగిస్తూ భీమా కోరేగావ్ చరిత్రను వివరించారు. బ్రాహ్మణీయ కేంద్రంగా చరిత్రను రాసుకోవడం సంఘ్ పరివార్‌కు వెన్నతోపెట్టిన విద్య అన్నారు. చరిత్రను ఆధిపత్య వర్గాలు తమకు అనుగుణంగా రాసుకున్నాయని, దాన్ని తిరస్కరిస్తూ అట్టడుగు వర్గాలు ఉద్యమాలు నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంగానే భీమా కోరేగావ్ పోరాటాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భీమా కోరేగావ్ పోరాటాన్ని బడుగు వర్గాలు స్ఫూర్తిగా తీసుకోవడం ఇవాల్టి పాలకవర్గాలకు కంటగింపుగా మారిందన్నారు. దళితులు విజయోత్సవాలు చేసుకోవడం జీర్ణించుకోలేని సంఘ్ పరివార్ శక్తులు దాడులకు పాల్పడడంతో పాటు ఇద్దరు దళితుల హత్యకు కారణమయ్యాయని పేర్కొ న్నారు. కలెక్టివ్ వాయిస్ కన్వీనర్, కవి యాకూబ్ మాట్లాడుతూ దేశంలో హిందూ ఫాసిజం పెచ్చరిల్లుతుందని, గౌరీ లంకేశ్ లాంటి ప్రజా మేధావులను హత్య చేసిన హిందూ మతోన్మాద శక్తులను ప్రశ్నిస్తే.. అర్బన్ మావోయిస్టుల పేరుతో జైళ్లలో నిర్బంధిస్తున్నారన్నారు. -
హైదరాబాద్‌లో నివాసానికి వరవరరావు
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు. వరవర రావుపై ఆందోళన వద్దు: హైకోర్టు నిబంధనలకు విరుద్ధం: ఎన్హెచ్ఆర్సీ -
అరెస్టుల పర్వం!
దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు, దాడులు నిర్వహించి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న అయిదుగురు నాయకులు–హైదరాబాద్‌లో విప్లవ రచయిత వరవరరావు, ముంబైలో హైకోర్టు న్యాయవాదులు వెర్నాన్ గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్, న్యూఢిల్లీలో పౌరహక్కుల నాయకుడు గౌతం నవల ఖాలను మహారాష్ట్రకు చెందిన పూణె పోలీసులు అరెస్టు చేశారు. పుణెకు సమీపంలోని భీమా– కొరెగావ్‌లో గత ఏడాది డిసెంబర్ 31న దళిత వీరుల సంస్మరణ సభకు ముందూ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఉదంతాలకు సంబంధించి సాగుతున్న దర్యాప్తులో భాగంగానే ఈ అరెస్టులు చేశామని పోలీసులు చెబుతున్నారు. ఆ ఉదంతాలతో మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్నదని, ఇప్పుడు అరెస్టయినవారంతా ఆ పార్టీతో సంబంధాల్లో ఉన్నవారేనని వారి అభియోగం. అంతే కాదు... భీమా–కొరెగావ్ తదనంతర పరిణామాల గురించి దర్యాప్తు చేస్తుండగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టు పార్టీ పన్నిన కుట్ర వెల్లడైందంటున్నారు. ఈ అయిదుగురి అరెస్టుతో పాటు న్యాయవాది సుసాన్ అబ్రహాం(ముంబై), ఫాదర్ స్టాన్ స్వామి(రాంచీ), ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే(గోవా), జర్నలిస్టు క్రాంతి టేకుల(హైదరాబాద్) ఇళ్లలోనూ, వరవరరావు ఇద్దరు కుమా ర్తెల ఇళ్లలోనూ కూడా సోదాలు చేశారు. ఇప్పుడు అరెస్టయిన అయిదుగురూ రహస్య జీవితం గడుపుతున్నవారు కాదు. వారి వారి రంగాల్లో లబ్ధప్రతిష్టులుగా కొనసాగుతూ, హక్కుల ఉల్లంఘనలపై నిలదీస్తున్నవారు. ఆ విష యంలో తప్ప వీరిలో చాలామందికి సంస్థాగతంగా కావొచ్చు...విశ్వాసాలరీత్యా కావొచ్చు ఏకాభి ప్రాయం లేదు. వరవరరావు విప్లవ సాహిత్యోద్యమంలో దాదాపు అర్ధ శతాబ్ది నుంచి పని చేస్తు న్నారు. విప్లవ రచయితల సంఘం(విరసం) సంస్థాపక సభ్యుడాయన. మావోయిస్టు పార్టీతో సంబం ధాలున్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వం నిషేధించిన సంస్థల్లో విరసం లేదు. గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీ రాలు న్యాయవాద వృత్తిలో ఉంటూ పౌరహక్కులకు సంబంధించి బలమైన గొంతు వినిపిస్తున్న వారు. మొన్న జూన్‌లో ఈ ఉదంతానికి సంబంధించే అరెస్టయిన అయిదుగురు సభ్యుల తరఫున న్యాయస్థానాల్లో వాదిస్తున్నారు. కార్మిక సంఘం నాయకురాలు సుధా భరద్వాజ్ వృత్తి రీత్యా న్యాయ వాది. సోషలిస్టు నాయకుడు స్వర్గీయ శంకర్ గుహ నియోగి స్థాపించిన ఛత్తీస్‌గఢ్ ముక్తి మోర్చాలో చురుగ్గా పనిచేసి ప్రస్తుతం భిలాయ్ గని కార్మిక సంస్థ నాయకురాలిగా, పీయూ సీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉంటున్నారు. ఢిల్లీలో అరెస్టయిన గౌతం నవలఖా పౌరహక్కుల రంగంలో పనిచేస్తు న్నారు. చరిత్రలో భీమా–కొరెగావ్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 200 ఏళ్లక్రితం ఆధిపత్య కులాలపై పోరాడి విజయం సాధించిన దళిత వీరుల స్మారక చిహ్నం అక్కడుంది. భీమా–కొరెగావ్ పోరాట ద్విశత జయంతి కావడంతో నిరుడు డిసెంబర్లో జరిగిన సదస్సుకు భారీ యెత్తున దళితులు హాజ రయ్యారు. సదస్సు జరిగిన రోజే ఘర్షణలు చెలరేగి దళిత యువకుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఉదంతాలకు సంబంధించి గత మార్చిలో సమతా హిందూ అఘాదీ అధ్యక్షుడు మిలింద్ ఎక్బోటేను అరెస్టుచేశారు. ఆయన బెయిల్‌పై విడుదల య్యారు. ఈ కేసు అతీగతీ ఏమైందో తెలియదుగానీ... ఆ సదస్సులో ప్రసంగించిన వక్తలు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయటం వల్లే హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. అనంతరం మొన్న జూన్‌లో దళిత కార్యకర్త సుధీర్ ధవాలే, న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, హక్కుల కార్యకర్త మహేష్ రౌత్, ప్రొఫెసర్ షోమా సేన్, రాజకీయ ఖైదీల హక్కుల కమిటీ నాయకుడు రోనా విల్సన్‌లను అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టయిన వారుగానీ, ఇంతక్రితం అరెస్ట యినవారుగానీ భీమా–కొరెగావ్ సదస్సుకు వెళ్లలేదు. ఆ సదస్సును రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబే డ్కర్తోబాటు ముంబై హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కోల్సే పాటిల్ నిర్వహించారు. ఆ ముగ్గురినీ ఇంతవరకూ పోలీసులు ప్రశ్నించనే లేదు! ప్రధాని హత్యకు కుట్ర జరిగిందనే ఆరోపణ అసాధారణమైనది. దాన్ని తేలిగ్గా తీసుకోవాలని ఎవరూ అనరు. కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ మొదలుకొని పలువురు మాజీ న్యాయమూర్తులు, కొందరు రిటైర్డ్ పోలీసు ఉన్నతాధికారుల వరకూ ఆరోపణకు ఆధారంగా చూపుతున్న లేఖను కొట్టిపారేశారు. అది నమ్మశక్యంగా లేదన్నారు. వారి అభిప్రాయాల సంగతలా ఉంచి ఆరోపణలొచ్చినప్పుడు దర్యాప్తులో భాగంగా ఎవరినైనా పిలిపించి ప్రశ్నించే అధి కారం పోలీసులకుంటుంది. ఆ తర్వాత వారిని అరెస్టు కూడా చేయొచ్చు. ఆరోపణల్లోని నిజా నిజాలు కోర్టులు తేలుస్తాయి. అయితే ఆ ప్రక్రియకు కూడా ఒక విధానమంటూ ఉంటుంది. ఈ అయిదుగురి అరెస్టులోనూ పోలీసులు అది పాటించినట్టు కనబడదు. అరెస్టు చేసినప్పుడు వారి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలతో రాసే పంచనామా రిపోర్టు నిందితులకు తెలిసిన భాషలోనే ఇవ్వాలి. ఇద్దరు స్థానికులు సాక్షులుగా ఉండాలి. లేఖ బయటపడ్డాక ఏడు నెలలపాటు దర్యాప్తు సాగించిన పోలీసులు ఇలాంటి నిబంధనలు పాటించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ కారణాలు చూపే ఢిల్లీ హైకోర్టు గౌతం నవలఖానూ, పంజాబ్ హర్యానా హైకోర్టు సుధా భర ద్వాజ్నూ పుణెకు తీసుకెళ్లేందుకు పోలీసులను అనుమతించలేదు. వరవరరావు విషయంలో సైతం ఈ నిబంధన బేఖాతరైంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మొదలుకొని చరిత్రకారుడు రామ చంద్ర గుహ వరకూ అనేకమంది ప్రముఖులు ఈ అరెస్టుల్ని ఖండించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వర్తమాన పరిస్థితులను ఎమర్జెన్సీ కాలంతో పోల్చింది. తీసుకునే చర్యలేమైనా రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని... విమర్శలకూ, ఆరోపణలకూ అతీతంగా ఉండాలని ప్రభు త్వాలు గుర్తించటం అవసరం. -
విరసం నేతను బంధించిన పోలీసులు
సాక్షి, ఖమ్మం: అమరుల బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్య హింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ’ నిర్వహిస్తున్న సభకు తరలివస్తున్న విరసం నేత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు వరవరరావు పోలీసులకు మధ్య వాగ్వివివాదం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ ఈ సభకు అనుమతి లేనందునే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వరవరరావుతో పాటుకు సభకు వస్తున్న పలువురిని కుసుమంచి పోలీస్టేషన్‌కు తరలించారు. -
నక్సల్బరీయే పీడిత జనవిముక్తి మార్గం
విరసం నేత వరవరరావు సాక్షి, హైదరాబాద్: పశ్చిమబెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని కుగ్రామమైన నక్సల్బరీలో రాజుకున్న నిప్పురవ్వ విప్లవోద్యమ దావానలమై దేశమంతటా విస్తరించిందని, గడిచిన ఐదు దశాబ్దాల్లో పీడిత జనవిముక్తికి నక్సల్బరీయే ఏకైక మార్గమని రుజువు చేసిం దని విరసం నేత వరవరరావు అన్నారు. ఏభైయేళ్ల నక్సల్బరీ ఉద్యమ ప్రస్థానంపై ‘సోషలిజమే ప్రత్యామ్నాయమార్గం’గా పేర్కొంటూ గురువారం ఇక్కడ విరసం నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. నాలుగు రోజులుగా జరిగిన రాజకీయ తరగతుల ముగింపు సందర్భంగా జరిపిన ఈ సభ నక్సల్బరీలో 1967 మే 25న భూస్వామ్య వ్యతిరేక తిరుగుబాటులో మరణించిన పది మంది ఉద్యమకారులుసహా నాటి నుంచి నేటి వరకు అసువులు బాసిన అమరవీరులందరికీ రెండు నిముషాలు మౌనం పాటించి నివాళులు అర్పించింది. వరవరరావు మాట్లాడుతూ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీ ఇప్పటి వరకు పార్టీ ఎన్ని చీలికలైందో అంత ఐక్యతను సాధించిందని అన్నారు. గుజరాత్ నుంచి విషపు పడమటి గాలి తెలంగాణకు వీస్తున్నదన్నారు. అందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండలో రజాకార్లు దాడులు చేసిన ప్రాంతాల్ని సందర్శిస్తున్నారని విమర్శించారు. తాను అధ్యక్షుడిగా ఉన్న రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్‌ని నిషేధించారే కానీ తన గొంతును నిషేధించలేదనీ, అందుకే మావోయుస్టు పార్టీ కేంద్ర కమిటీ పంపిన ప్రకటనను చదివి వినిపిస్తున్నానంటూ పేర్కొన్నారు. విరసం మరో నేత కల్యాణరావు మాట్లాడుతూ ఆకలి, అంటరానితనం, అసమానతలు న్నంతకాలం సాయుధ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ నక్సల్బరీ విప్లవోద్యమం తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిందన్నారు. వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమంలో పౌరహక్కుల సంఘం నేతలు నారాయణరావు, నలమాస కృష్ణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
విరసం నేతలపై కేసు ఎందుకు?
♦ గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో కొత్త కోణం వరవరరావుపై జూన్ 25వ తేదీన ♦ నల్లగొండ కోర్టులో పిటిషన్ వేయించిన నయీమ్ ♦ నయీమ్ సూచన మేరకే న్యాయవాది ఛత్రపతితో కేసు ♦ పోలీసు విచారణలో వెల్లడించిన ఐటెన్ న్యూస్ సీఈవో ♦ హాని తలపెట్టే ఆలోచనతోనే అంటున్న పోలీసు వర్గాలు నల్లగొండ క్రైం: గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో మరో కొత్త కోణంపై పోలీసులు దృష్టి సారించారు. ఎప్పటి నుంచో మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న నయీమ్ తాజాగా విరసం నేతలపై కేసులు ఎందుకు వేయించారనే కోణంలో నల్లగొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విరసం నేతలు వరవరరావు, విజయలక్ష్మి, కాసీంలపై కోర్టులో కట్టంగూరుకు చెందిన న్యాయవాది ఛత్రపతి ద్వారా నల్లగొండ కోర్టులో జూన్ 25న పిటిషన్ వేశామని, ఈ పిటిషన్లో విరసం నేతలు హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశాల వీడియో క్లిప్పింగులను కూడా జత చేశామని పోలీసు విచారణలో నయీమ్ అనుచరుడు, ఐటెన్ న్యూస్ సీఈవో బి. హరిప్రసాదరెడ్డి వెల్లడించినట్టు తెలుస్తోంది. నయీమ్ ఫోన్ చేసి విరసం నేతలపై కోర్టులో పిటిషన్ వేయాలని, ఇందుకు గాను న్యాయవాది ఛత్రపతిని కలవాలని ఆదేశించాడని, ఆ మేరకే తాము ఆ పనిచేశామని పోలీసులకు హరి చెప్పినట్టు తెలుస్తోంది. కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరించలేదు కానీ.. కేసు ఎందుకు వేయించారనే కోణంలో పోలీసు దర్యాప్తు జరుగుతున్నట్టు సమాచారం. విరసం నేతలపై కేసు వేయడం ద్వారా వారు కోర్టు విచారణకు నల్లగొండకు రావాల్సిన పరిస్థితులను కల్పించాలని, ఆ క్రమంలో హాని తలపెట్టాలనే ఆలోచన నయీమ్ చేసి ఉంటాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా పౌరహక్కుల నేత ఆజం అలీని నల్లగొండలోనే నయీమ్ అనుచరులు హత్య చేశారని, కేసు వేయించేందుకు ప్రధాన కారణం ఏమిటనేది రాబడుతున్నామని అయితే, హరిని మరోసారి పోలీసు క స్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని పోలీసులంటున్నారు. -
ప్రభుత్వాలు మారినా విధానాలు మారలేదు
విరసం నేత వరవరరావు ఆరోపణ న్యూశాయంపేట: ప్రభుత్వాలు మారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, వైఖరి మారడం లేదని, అణచివేతలు, బెదిరింపులు, బూటకపు ఎన్కౌంటర్లలో కాల్చిచంపడం యథావిధిగా కొనసాగిస్తున్నాయని విరసం నేత వరవరరావు ఆరోపించారు. సోమవారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. పట్టపగలే ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టుకుంటే మఫ్టీ పోలీసులు తుపాకులతో వెంటాడుతున్నారని పేర్కొన్నారు. మార్చి 1న హసన్‌పర్తి మండలం మునిపల్లికి చెందిన దార సాంబయ్య ఇంటిపైకి వెళ్లి పోలీసులు నానా బీభత్సం సృష్టించారని పేర్కొన్నారు. గతంలోనూ పోలీసులు సాంబయ్య కళ్లకు గంతలు కట్టి.. హైదరాబాద్ తీసుకెళ్లారని.. ఆహారంలో విషం కలిపి హరిభూషణ్, దామోదర్, ప్రభాకర్లకు తినిపించి చంపివేయాలని, లేకుంటే ఆకుల భూమయ్య, గంటి ప్రసాదంలకు పట్టిన గతే నీకూ పడుతుందని బెదిరించారన్నారు. ఉద్యమద్రోహానికి పాల్పడ లేక సాంబయ్య పురుగుల మందు తాగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడని తెలిపారు. పోలీసుల బెదిరింపులకు సాంబయ్య తండ్రి వీరయ్య గుండెపోటుతో మరణించాడని చెప్పారు. విలేకరుల సమావేశంలో పౌరహక్కుల సంఘం నాయకులు ఎ.సురేష్,పెంట రమేష్, బంధుమిత్రుల సంఘం నాయకురాలు అంజమ్మ, టీపీఎఫ్ నాయకులు జనగామ కుమారస్వామి, వోపీడీఆర్ నాయకులు బీరం రాములు రంజిత్, దార సాంబయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాగా విరసం నేత వరవరరావు ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు మఫ్టీ పోలీసులు వచ్చి వివరాలను రికార్ట్ చేశారు. ప్రెస్‌మీట్ అయిపోగానే హాల్ నుంచి వెళ్తున్న క్రమంలో వరవరరావు ‘ఎవరు మీరు’ అంటూ మఫ్టీలో ఉన్న వారిని ప్రశ్నించగా, పరిగెత్తారు. వారిని ప్రజాసంఘాల నాయకులు వెంబడించగా, తుపాకులు చూపి బెదిరించి పారిపోయారు. -
కాశీంపై రాజద్రోహం కేసు ఎత్తివేయాలి
విరసం రాష్ట్ర నాయకుడు కల్యాణరావు విజయవాడ : నడుస్తున్న తెలంగాణ సంపాదకుడు, ప్రముఖ రచయిత సి. కాశీంపై పెట్టిన రాజద్రోహం కేసు ఎత్తివేయాలని విరసం రాష్ట్ర నాయకుడు జి.కల్యాణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో కళ్యాణ్‌రావు విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులకు లేఖలు రాశారన్న అభియోగంమోపి గత నెల 20న ములుగు స్టేషన్లో కాశీంపై రాజద్రోహం కేసు నమోదు చేశారన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఊపా) కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. నిషేధిత సంస్థలో సభ్యుడుతోపాటు పలు అభియోగాలు మోపారని వివరించారు. అప్రజాస్వామిక ఊపా చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటీష్ పాలకులు తెచ్చిన కాలం చెల్లిన ఈ చట్టాన్ని నేటికీ అమలు చేయడం అప్రజాస్వామికమన్నారు. కాశీం విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ప్రజాస్వామిక తెలంగాణ కోరుకున్నవారిలో ఆయన ఒకరని.... అటువంటి వ్యక్తిపై రాజద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నమోదైన తొలి కుట్ర కేసు ఇదేనని కల్యాణ్‌రావు స్పష్టం చేశారు. పోలీసులు లేఖలు సృష్టించడమే కాకుండా, మావోయిస్టు అనుబంధ పత్రిక అంటూ నడుస్తున్న తెలంగాణ పత్రికపైనా కుట్ర చేశారన్నారు. ప్రభుత్వ గ్రంథాలయాలు, యూనివర్సిటీలు సహా తెలంగాణ రాష్ట్రమంతటా ఎంతో మంది చదివే పత్రికపైనా అభియోగాలు మోపడం అన్యాయమన్నారు. ప్రభుత్వ అణచివేత విధానాన్ని నిరసించాలని రచయితలూ, ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులకు కల్యాణ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో తాటి శ్రీకృష్ణ, కొండపల్లి మాధవరావు, నారాయణ, అరసవల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రేపు ఛలో అసెంబ్లీ నిర్వహిస్తాం
హైదరాబాద్ : వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలో బుధవారం ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో వరవరరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఛలో అసెంబ్లీ శాంతియుతంగా చేస్తామంటే పోలీసులు నిరాకరించారని తెలిపారు. ప్రజా ప్రతినిధుల సభకు 144 సెక్షన్ విధించడమంటే ప్రజాస్వామ్యం దాని స్వభావాన్ని కోల్పోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడమన్నారు. ఓ వేళ అటువైపు నుంచి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వరవరరావు వెల్లడించారు. ఛలో అసెంబ్లీలో 400 ప్రజా సంఘాలు పాల్గొంటాయని వరవరరావు తెలిపారు. -
వరవరరావును అడ్డుకున్న పోలీసులు
వరంగల్ : కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విరసం నేత వరవరరావు మండిపడ్డారు. వరంగల్ జిల్లా మేడారం మండలం తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఖచ్చితంగా బూటకం అని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని వరవరరావు విమర్శించారు. మైనింగ్ మాఫియాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్న మావోయిస్టులను అంతమొందించాలని చూస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వరంగల్ నగరంలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టులు శ్రుతి, సాగర్ రెడ్డిల మృతదేహాలకు బుధవారం శవ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారి మృతదేహాలను పరిశీలించేందుకు వరవరరావు మార్చురీలోకి వెళ్తున్నారు. ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విరసం నేతలు, ప్రజా సంఘ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో వరవరరావు పైవిధంగా స్పందించారు. అంతకుముందు ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను వరవరరావు పరామర్శించారు. -
మావోయిస్ట్ సానుభూతిపరుడు కళ్యాణరావు అరెస్ట్
-
విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అరెస్టు