
హైదరాబాద్: సుప్రీం కోర్టు ఆదేశాలతో మహారాష్ట్ర పోలీసులు విరసం నేత వరవరరావును పూణె నుంచి హైదరాబాద్‌కు తరలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ భద్రత నడుమ హైదరాబాద్ గాంధీనగర్‌లోని ఆయన నివాసంలో వదిలిపెట్టి వెళ్లారు. ప్రధాని హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పాటు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఏకకాలంలో ప్రముఖ పౌర హక్కుల నేతలు, మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే.
అందులో భాగంగా విరసం నేత వరవర రావుతో పాటు మరో నలుగురు పౌరహక్కుల నేతలను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడంతో హౌస్ అరెస్ట్ చేసి మాత్రమే విచారణ జరపాలని సుప్రీంకోర్టు, పోలీసులను ఆదేశించింది. వరవరరావును ప్రస్తుతం పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. అలాగే పూణెకు చెందిన నలుగురు పోలీసులు వరవరరావు ఇంటి వద్ద ప్రత్యేకంగా కాపలాగా ఉన్నారు. అలాగే తెలంగాణ పోలీసులు కూడా అక్కడ భారీగా మోహరించారు. పరిసర ప్రాంతాల్లోకి ఎవరినీ అనుమతించటం లేదు.
వరవర రావుపై ఆందోళన వద్దు: హైకోర్టు
నిబంధనలకు విరుద్ధం: ఎన్‌హెచ్‌ఆర్‌సీ
Comments
Please login to add a commentAdd a comment