హైదరాబాద్ : వరంగల్ జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బూటకపు ఎన్కౌంటర్ నేపథ్యంలో బుధవారం ఛలో అసెంబ్లీ నిర్వహించి తీరుతామని విరసం నేత వరవరరావు స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లో వరవరరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఛలో అసెంబ్లీ శాంతియుతంగా చేస్తామంటే పోలీసులు నిరాకరించారని తెలిపారు.
ప్రజా ప్రతినిధుల సభకు 144 సెక్షన్ విధించడమంటే ప్రజాస్వామ్యం దాని స్వభావాన్ని కోల్పోవడమే అని ఆయన అభిప్రాయపడ్డారు. మేం ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడమన్నారు. ఓ వేళ అటువైపు నుంచి ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని వరవరరావు వెల్లడించారు. ఛలో అసెంబ్లీలో 400 ప్రజా సంఘాలు పాల్గొంటాయని వరవరరావు తెలిపారు.