
కుషాయిగూడ: విరసం నేత ప్రొఫెసర్ ఖాసీం బుధవారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తన అరెస్టు నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెలలుగా తనకు సంబం«ధించి వార్తలు ప్రచురించిన వార్తా పత్రికల యాజమాన్యాలకు, ఎడిటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకొనే టీచర్ అయిన తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇకపై పరిశోధన, అధ్యయనంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతి కోసం రచనలు చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment