Cherlapalli prison
-
ప్రొఫెసర్ ఖాసీం విడుదల
కుషాయిగూడ: విరసం నేత ప్రొఫెసర్ ఖాసీం బుధవారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తన అరెస్టు నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెలలుగా తనకు సంబం«ధించి వార్తలు ప్రచురించిన వార్తా పత్రికల యాజమాన్యాలకు, ఎడిటర్లకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకొనే టీచర్ అయిన తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇకపై పరిశోధన, అధ్యయనంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతి కోసం రచనలు చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
నయీమ్ అనుచరులను చర్లపల్లికి తరలింపు
పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం వీరిని హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచిన వనస్థలిపురం పోలీసులు తదనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. నయీం కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధుని పిటి వారెంట్ మీద నల్లగొండ జైలు నుంచి తరలించారు. సోమవారం మధును సైతం హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు. -
ఏడు రోజులు...ఏడు రంగులు
- ఆసుపత్రుల్లో రోజుకో రంగు బెడ్‌షీట్ - పరిశుభ్రత కోసం ప్రతీ రోజూ మార్చేలా ఈ విధానం - రాష్ట్రంలో 20 వేల పడకలకు రెండు సెట్ల రంగు రంగు దుప్పట్లు - టెండర్ల ప్రకియ మొదలు... చర్లపల్లి జైలు ఖైదీల నుంచీ కొనుగోలు సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలపై ఇక నుంచి రంగు రంగుల దుప్పట్లు దర్శనమివ్వనున్నాయి. ప్రస్తుతం తెల్లరంగు బెడ్షీట్లు మాత్రమే వాడుతుండగా... ఇకనుంచి వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లూ కనిపించనున్నాయి. ఆసుపత్రుల్లో తెల్ల రంగు దుప్పట్లను ఉతక్కుండానే రోజుల తరబడి ఉపయోగిస్తున్నారు. దీంతో ఇతర రోగులు వాడిన దుప్పట్లనే మరో రోగి వాడుతోన్న పరిస్థితి నెలకొంది. ఫలితంగా రోగులు అంటు వ్యాధులకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతీ రోజూ ఆసుపత్రుల్లోని పడకలపై బెడ్షీట్లను మార్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని ఆయన ఆదేశించారు. అందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. వారంలో ఏడు రోజులు ఏడు రంగుల దుప్పట్లు వాడితే తప్పనిసరిగా దుప్పట్లను ఉతికి ఆరేస్తారని... రోజుకో రంగు దుప్పటి వాడాలన్న నిర్ణయం వల్ల పర్యవేక్షణ కూడా సులువుగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వారంలో ఏ రోజు ఏ రంగు దుప్పటి వాడాలో నిర్ణయిస్తారు. ఆ ప్రకారమే ఆసుపత్రి సిబ్బంది దుప్పట్లను ప్రతీ రోజూ మార్చుతూ... మార్చిన వాటిని ఉతికేయించి మరో వారానికి సిద్ధంగా ఉంచుతారు. 20 వేల పడకలకు రంగు రంగుల దుప్పట్లు... కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే ఈ విధానాన్ని దేశంలోని 19 ప్రధాన ఆసుపత్రుల్లో అమలు చేస్తోంది. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి, ఛండీఘర్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకే షన్ అండ్ రీసెర్చ్, పాండిచ్చేరిలోని జిప్‌మర్‌లోనూ ఈ విధానం అమలవుతోంది. ఆయా ఆసుపత్రుల్లో సోమవారం తెల్ల దుప్పటి, మంగళవారం గులాబీ, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపుపచ్చ, శుక్రవారం ఊదా లేదా మరో రెండు రంగులు, శనివారం నీలం, ఆదివారం లేత బూడిదరంగు లేదా మరో రంగును వాడుతున్నారు. కొద్దిపాటి మార్పులు చేసి ఆ ప్రకారమే రాష్ట్రంలోనూ అమలుచేస్తారని వైద్యాధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, రాష్ట్రస్థాయిలో ఉస్మానియా, నీలోఫర్, నిమ్స్, ఎంఎన్‌జే సహా అనేక పెద్దాసుపత్రులున్నాయి. వాటన్నింటిలో దాదాపు 20 వేల వరకు పడకలున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నీలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్, సరోజినీ దేవి వంటి పెద్దాసుపత్రులు, బోధనాసుపత్రుల్లో ఏకంగా 8,374 పడకలున్నాయి. అందులో ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే 1168, నిమ్స్‌లో 1500 పడకలున్నాయి. జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో 1900 పడకలున్నాయి. 750 వరకు ప్రాథమిక ఆసుపత్రులుండగా... వాటిల్లో కొన్నింటినీ 30 పడకల వరకు పెంచుతున్నారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రంగు రంగుల బెడ్షీట్లు రానున్నాయి. టెండర్ల ప్రక్రియ మొదలు... అన్ని ఆసుపత్రుల్లోనూ ఏడు రోజులు ఏడు రంగుల బెడ్షీట్లను రెండు సెట్లు అందుబాటులో ఉండేలా చూడాలని నిర్ణయించారు. ఒక సెట్టు ఎప్పుడూ రిజర్వులో ఉంచుతారు. రంగు బెడ్షీట్లను కొనుగోలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ టెండర్ల ప్రక్రియ ప్రారంభించింది. తక్కువ కోట్ చేసిన కంపెనీ నుంచి బెడ్షీట్లను కొనుగోలు చేస్తారు. చర్లపల్లి జైలులో ఖైదీలు బెడ్షీట్లు తయారు చేస్తున్నందున వారి నుంచి ఎన్ని వీలైతే అన్ని కొనుగోలు చేయాలని కూడా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పడకకు ఏడు దుప్పట్లు రెండు సెట్ల చొప్పున 20 వేల పడకలకు 2.80 లక్షల రంగు దుప్పట్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. -
ఖైదీలకు గ్లాస్ చల్లటి మజ్జిగ
వేసవి తాపం నుంచి సేదతీరేందుకు చర్లపల్లి జైల్లో ఖైదీలకు మజ్జిగ పంపిణీ చేయాలని జైళ్ల శాఖ నిర్ణయించింది. ఈ పధకం సోమవారం అధికారులు ప్రారంభించారు. ప్రతీ ఖైదీకి 50 ఎంఎల్ చొప్పున మజ్జిగ అందించనున్నారు. వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
హెచ్ సీయూ విద్యార్థులకు పరామర్శల వెల్లువ
♦ ములాఖత్‌లో కలుసుకున్న నారాయణ,వీహెచ్, కోదండరాం ♦ భారీగా తరలివచ్చిన హెచ్‌సీయూ విద్యార్థులు కుషాయిగూడ: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను శనివారం పలువురు ములాఖ త్లో కలుసుకుని పరామర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తదితరు లు విద్యార్థులను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే హెచ్‌సీయూ విద్యార్థులు కూడా భారీగా తరలివచ్చి తమ సహచర విద్యార్థులను పరామర్శించారు. కేంద్రం తీరు గర్హనీయం: వీహెచ్ కేంద్రంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ చెప్పుచేతల్లో పనిచేయడం దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వి.హన్మంతరావు అన్నారు. హెచ్‌సీయూ ఘటనకు కారణమైన వీసీ అప్పారావుపై వన్‌మ్యాన్ కమిటీ ఎలాంటి రిపోర్టు అందజేయకముందే తిరిగి ఎలా విధులకు హజరవుతారని ఆయన ప్రశ్నించారు. అప్పారావు హయంలో ఎలాంటి నియామకాలు జరగడానికి వీలులేదన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ పిల్ దాఖలు చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు. ఆయన వెంట రాష్ట్రయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్‌కుమార్ యాదవ్ ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: నారాయణ, సీపీఐ నేత కేంద్ర ప్రభుత్వం తన అణచివేత ధోరణితో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతులు ఇచ్చే కుట్రలో భాగంగానే విద్యార్థులు, మేధావులపై దాడులు చేయిస్తోందని సీపీసీ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చర్లపల్లి జైల్ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్‌పాషా, బాలమల్లేశ్, శివరాంకృష్ణలతో కలిసి ఆయన మాట్లాడారు. ఓట్ల కోసం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసే బీజేపీ నాయకులు ఆయన ఆశయసాధన కృషి చేసే రత్నం లాంటి మేధావులను జైలులో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీ అప్పారావు తీరు సబబుకాదు : కోదండరాం హెచ్‌సీయూ ఘటన గోటితో పోయేదాన్ని గొడ్డలి పెట్టును తలపిస్తుందని, వాస్తవంగా విచారణ ఎదుర్కొంటున్న వీసీ అప్పారావు నెల రోజులు ఆగి ఉంటే ఈ పరిస్థితులు తలెత్తేది కాదని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. కేసులు కొనసాగుతుండగా తిరిగి వీసీ బాధ్యతలు చేపట్టడానికి యూనివర్సీటీకి రావడం సమంజసం కాదన్నారు. విద్యార్ధులపై పోలీసుల దాడులు సరికాదన్నారు. విద్యార్థులను కొట్టవద్దన్న అధ్యాపకులను అరెస్టు చేసి జైలులో పెట్టడం అమానుషమన్నారు. -
కక్కుర్తితోనే కటకటాల పాలు
- వివాదాస్పద భూములే టార్గెట్ - సొంతశాఖను వదలని వైనం - విరాళం పేరుతో చందాలు వసూలు - కూర సురేందర్ అవినీతికి అంతేలేదు సాక్షి, హన్మకొండ : ఏసీబీకి చిక్కి చర్లపల్లి జైలులో ఊచలు లెక్కపెడుతున్న జనగామ డీఎస్పీ కూర సురేందర్ నిర్మించిన అవినీతి పుట్టలో నుంచి రోజురోజుకు నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. జనగామ కేంద్రంగా చేసుకుని వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై వరంగల్ శివారు, రాంపూర్, జనగామ, పెంబర్తి, భువనగిరి ప్రాంతాలలో బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అనితీని సామ్రాట్, ఏసీబీకి పట్టుబడే వరకు చడీ చప్పుడు కాకుండా మామూళ్లు ముట్టజెప్పి నరకయాతన అనుభవించిన వారు నేడు ఆయన అవినీతి చిట్టాపై బాహాటంగా చర్చించుకుంటున్నారు. పదవీ బాధ్యతలను విస్మరించి తన అధికారలను దుర్వినియోగం చేస్తూ విచక్షణారహితంగా లంచాలు వసూలు చేసిన వాటిలో మరికొన్ని ఉదంతాలు. - బచ్చన్నపేట మండలంలో ఇటీవల మంత్రాల నెపంతో ఓ హత్య జరిగింది. ఈ కేసులో అనుమానితుల నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. - గత నాలుగు నెలల క్రితం పట్టణంలో సంచలం రేపిన ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం సంఘటనలో డీఎస్పీ కార్యాలయం కేంద్రంగా రూ. 13 లక్షలు చేతులు మారినట్లు తెలిసింది. - కొన్ని నెలల క్రితం జనగామ పట్టణంలో నెహ్రూపార్క్ ప్రాంతంలో ఓ వైద్యుడిని విచారణ పేరుతో డీఎస్పీ కార్యాలాయానికి పిలిపించారు. సదరు వైద్యుడి అర్హత సర్టిఫికేట్లు చూపించాలంటూ కోరారు. ఇలా వరుసగా వారం రోజుల పాటు ఒకే తరహా విచారణ జరిపి సదరు వైద్యుడిని మానసికంగా వేధించారు. అతని విధులకు ఆటంకం కలిగించారు. ఆఖరికి క్లినిక్‌లో వసతులు సరిగా లేవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విచారణతో విసిగి వేసారిన సదరు వైద్యుడు, చివరికి డీఎస్పీ అంతరంగాన్ని గ్రహించి రూ. 4 లక్షలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది. - జనగామ పట్టణ శివారు హన్మకొండ రోడ్డులోని ఓ వివాదాస్పద భూమిలో డీఎస్పీ సురేందర్ తలదూర్చి ఓ వర్గం వద్ద రూ 20 లక్షల ముడుపులు అందుకున్నట్లు తెలిసింది. ఇదే సెటిల్మెంట్లో అవతలి వ్యక్తి నుండి రూ 10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. - జనగామలోని నెహ్రూ పార్క్ వద్ద ఓ వియ్యం వ్యాపారికి చెందిన 125 గజాల స్థలం ఉంది. మార్కెట్లో ఈ స్థలం విలువ రూ. 89 లక్షలుగా ఉంది. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు రూ. 22లక్షలు చెల్లిం చాడు ఓ బంగారం వ్యాపారి. తీరా రిజిష్ట్రేషన్ చేయిం చేందుకు వెళ్లగా సదరు ఫ్లాట్‌పై బాంయకు రుణం ఉన్నట్లు తేలింది. దానితో తన అడ్వాన్స్ ఇప్పించాలంటూ డీఎస్పీని, బంగారం వ్యాపారి డీఎస్పీ ఆశ్రయించాడు. కేసు సెటిల్ చేసేందుకు తొలుత రూ. 50 వేలు అడ్వాన్స్‌గా పొందారు. ఆ తర్వాత బియ్యం వ్యాపారిని బెదిరించాడు. ఈ కేసునుంచి నీకు విముక్తి కలగాలంటే రూ 8 లక్షలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు. చివరికి సమస్య పరిష్కారం కాకపోగా డీఎస్పీ ఖాతాలోకి రూ. 8.50 లక్షలు జమయ్యాయి. - చివరకు సొంత శాఖ ఉద్యోగులు సైతం డీఎస్పీ బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ డివిజన్లో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్స్పెక్టర్ల ప్రొబేషనరీ కాలం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఒక్కొక్కరిని లక్ష రూపాయల వంతున నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. - జనగామలో ఏర్పాటు చేస్తున్న బతుకమ్మకుంట అభిల క్రితం అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డీఎస్పీ సురేందర్ ఆర్భాటంగా తన వంతుగా రూ. 51 వేలు అభివృద్ధి కోసం విరాళం ఇస్తానని ప్రకటించాడు. తర్వాత విరాళం సేకరణ పేరు చెప్పి పలువురు వ్యాపారుల వద్ద ఇష్టారీతిగా వసూళ్లు చేసినట్లు వ్యాపారులు చెవులు కొరుక్కుం టున్నారను. -
కరుడుగట్టిన నేరస్తుల ముఠా అరెస్ట్
నల్లగొండ క్రైంః వారంతా కరుడుగట్టిన నేరస్తులు. చర్లపల్లి జైలులో ఓ ముఠా గా ఏర్పాడ్డారు.. వారిపై ఎన్నెన్నో కేసులు. ముఠాలో ఓ సభ్యుడు ఫ్యాక్షనిస్టులు పటోళ్ల గోవర్దన్‌రెడ్డి, మద్దెల చెర్వు సూరి వద్ద పనిచేశాడు. సూరి హత్య కేసులో నిందితుడు భానుకిరణ్ వద్ద కూడా పనిచేశాడు. తాజాగా మిర్యాలగూడకు చెందిన వ్యాపారిని హత్య చేసేందుకు రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు.. వాహనాల తనిఖీలో పోలీసులకు పట్టుబడ్డారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ ప్రభాకర్‌రావు నిందితుల వివరాలు వెల్లడించారు. పట్టుబడ్డారు ఇలా... నల్లగొండ సీసీఎస్, మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు మంగళవారం మిర్యాలగూడ సాగర్ రింగ్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా నేరస్తుల ము ఠా పట్టుబడింది. వీరి వద్ద ఒక రివాల్వర్, మారుతి మ్యాన్, ఇండికా కారు, రెండు మారణాయుధాలు, రెండు కారం ప్యాకెట్లు, రూ.1.50 లక్షల నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నా రు. వీరంతా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ఓ వ్యాపారిని హత్య చేసేం దుకు పథకం పన్నినట్లు గుర్తించామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన బుర్జుకాడి విజయ్‌కుమార్ అలియాస్ విష్ణు,రంగారెడ్డి జిల్లా శివారెడ్డిగూడెం పోలీసుమహేందర్, వరంగల్ జిల్లా మడిపల్లికి చెందిన గుంటుక రమేష్, రంగారెడ్డి జిల్లా జీడిమెట్లకు చెందిన కాసర్ల రాజు ముఠాగా ఏర్పడి వ్యాపారి గోపాల్‌రెడ్డిని హత్య చేసేందుకు రూ.10 లక్షలు ఒప్పందం చేసుకున్నారు. జిల్లాలోని పెన్‌పహాడ్ మండలానికి చెందిన నారాయణ పాపిరెడ్డి, నేరేడుచర్ల మండలానికి చెందిన నూకల మధుకర్‌రెడ్డి, తిప్పర్తి మండలం యల్లమ్మగూడేనికి చెందిన ఉట్కూరి వెంకట్‌రెడ్డి కలిసి హత్యకు పథకం పన్ని రూ.3 లక్ష 20 వేలు అడ్వాన్స్‌గా చెల్లించారు. మిర్యాలగూడలో రాఘవేంద్రస్వామి ఐరన్, హార్డ్‌వేర్ షాపు నిర్వహించే గోపాల్‌రెడ్డికి సంబంధించిన పాస్‌ఫొటో, షాపు అడ్రసును ఈ ముఠాకు అందజేశారు. తననే హత్య చేస్తాడని.. గోపాల్‌రెడ్డి తన సమీప బంధువైన నారాయణ పాపిరెడ్డికి రూ.5 లక్షలు ఇ వ్వాల్సి ఉన్న విషయం కోర్టు పరిధిలో కేసు సాగుతోంది. గత నవంబరులో గోపాల్‌రెడ్డి నారాయణగూడెం గ్రామానికి వెళ్లడంతో అక్కడే నివాసం ఉంటున్న పాపిరెడ్డి గమనించి తనను చంపడానికి వచ్చాడని భావించాడు. డబ్బులు ఇవ్వకపోగ, హత్య చేసేందుకు పథకం వేశాడని అనుమానించాడు. దీనితో గోపాల్రెడ్డినే హత్య చేసేందుకు పాత నేర చరి త్ర కలిగిన నలుగురు వ్యక్తుల ముఠా మధుకర్‌రెడ్డి, వారి సమీప బంధువు సందీప్‌రెడ్డి ఫ్యాక్షన్ నేరస్తుడైన విజయ్‌కుమార్‌ను సంప్రదించారు. విజయ్‌కుమార్, రమేష్, మహేందర్, రాజులు వివిధ కేసుల్లో చర్లపల్లి జైలులో ఉండి పరి చయం ఏర్పడి ఒక ముఠాగా ఏర్పాడ్డా రు. ముఠాలో ప్రథమ ముద్దాయి విజయ్‌కుమార్‌తో కలిసి పాపిరెడ్డి, మధుకర్‌రెడ్డి, సందీప్‌రెడ్డిలు ఒక కారులో వెళ్లి గోపాల్‌రెడ్డి హ్యత చేసేందుకు ఇంటిని, షాపును రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో అనుకున్న ప్రకారం విజయ్‌కుమార్ తన అనుచరులతో మంగళవారం ఉదయం ఓ వ్యాన్‌లో హత్యకు కావాల్సిన మారణాయుధాలు, కారం ప్యా కెట్లు తీసుకుని హైదరాబాద్ నుంచి ఇబ్రహింపట్నం మీదుగా మిర్యాలగూడ చేరుకోన్నారు. గోపాల్‌రెడ్డి షాపుకు కొద్ది దూరంలో వ్యాన్‌లో ఉన్న వీరందరినీ పోలీసులు పట్టుకున్నారు. ముఠా హత్య ప్రయత్నానికి కారకులైన వారిని సీసీఎస్ డీఎస్పీ సునీతా మోహన్, సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిని ఎస్పీ అభినందించారు. -
రౌడీలూ ఖబడ్దార్
- హద్దుమీరితే పీడీ యాక్ట్ - తాజాగా రౌడీలు ఫిర్దౌస్, లతీఫ్, తన్వీర్‌పై ప్రయోగం - చర్లపల్లి జైలుకు తరలింపు - వీరిపై 12 ఠాణాల్లో 84 కేసులు: వెలుగు చూడని వందకు పైగానే సాక్షి, సిటీబ్యూరో: సేఫ్ట్సిటీ-స్మార్ట్‌సిటీలో భాగంగా నగర పోలీసు లు మరో అడుగు ముందుకేశారు. ప్రజల రక్షణ, భద్రతలకు భంగం కలిగించే రౌడీషీటర్లు, అసాంఘికశక్తుల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు తదితర వరుస నేరాలకు పాల్పడుతూ ఇటు పోలీసులను, అటు ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్న కరుడుగట్టిన ముగ్గురు రౌడీషీటర్లపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించారు. దీంతో నెల రోజుల వ్యవధిలో ఏడుగురిపై ఈ చట్టం ప్రయోగించి జైలు కు తరలించారు. తాజాగా పీడీయాక్ట్ కింద మరో ముగ్గురిని డీసీపీ సత్య నారాయణ జైలుకు పంపారు. బంజారాహిల్స్ సయ్యద్‌నగర్‌కు చెందిన మహ్మద్ ఫిర్దౌస్ (32), మల్లేపల్లికి చెందిన మహ్మద్ లతీఫ్ (32), ఎల్లారెడ్డిగూడ జయప్రకాష్‌నగర్‌కు చెందిన మహ్మద్ తన్వీర్ (26)లు రౌడీషీటర్లు. చిన్న చిన్న నేరాలకు పాల్పడి 12 ఏళ్ల క్రితం నేర జీవితాన్ని ప్రారంభించిన ఈ ముగ్గురు ప్రస్తుతం కరుడుగట్టిన నేరగాళ్లుగా మారారు. వీరిపై పంజగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్సార్‌నగర్, లంగర్‌హౌస్ గోల్కొండ, ఆసిఫ్‌నగర్, హుమాయున్‌నగర్, హబీబ్‌నగర్, చిక్కడపల్లి, నాంపల్లి పోలీసు స్టేషన్ల మొ త్తం 84 కేసులున్నాయి. ఇందులో కొన్ని కేసులు సాక్షులను బేదిరించడం వల్ల వీగిపోయాయి. దీంతో వారిలో ధైర్యం రె ట్టింపై మరిన్ని నేరాలు చేయడం ప్రారంభించారు. కిరాయి హత్యలు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు, బెది రింపులు, కొట్లాటలు, హత్యాయత్నాలు తదితర నేరాలకు పాల్పడుతున్నారు. అరెస్టయిన ప్రతిసారి నెల రోజుల్లోనే జైలు నుంచి బెయిల్‌పై విడుదలై తిరిగి నేరాలు చే యడం విధిగా పె ట్టుకున్నా రు. రౌడీషీటర్లు జంగ్లీ యూ సుఫ్, చోర్ కౌసర్లతో పాటు యువతులతో వ్యభి చారం చేయిస్తున్న పల్లె సుధాకర్‌రెడ్డి, బోడ రాజులపై పోలీసులు గతంలో పీడీ యాక్ట్ ప్రయోగించిన విషయం తెలిసిందే. ఫిర్దోస్‌పై 26 కేసులు.... రౌడీషీటర్ ఫిర్దోస్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్, గోల్కొండ, చిక్కడపల్లి, నాంపల్లి, లంగర్‌హౌస్, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లలో 26 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో హత్య, హత్యాయత్నాలు, దొంగతనాలు, దాడులు, బెదిరింపులు, ఆయుధాలు కలిగి ఉండటంలాంటి కేసులున్నాయి. లతీఫ్‌పై 46 కేసులు... అత్యధికంగా లతీఫ్‌పై హబీబ్‌నగర్, హుమాయున్‌నగర్,పంజగుట్ట, ఆసిఫ్‌నగర్, షాహినాత్‌గంజ్, నాంపల్లి, గో ల్కొండ, లంగర్‌హౌస్ బంజారాహిల్స్ ఠాణాలలో 46 క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో దాడులు, బెదిరిం పులు, హత్య లు, హత్యాయత్నాలు, కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తన్వీర్‌పై 14 కేసులు... తన్వీర్‌పై ఎస్సార్‌నగర్, జూబ్లీహిల్స్, పంజగుట్ట పోలీసు స్టేషన్లలో 14 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హత్యాయత్నాలు, బెదిరింపులు తదితర నేరాలున్నాయి. ప్రజల రక్షణే ధ్యేయం... ప్రజల రక్షణే మా ధ్యేయం. మాపై నుమ్మకం ఉంచి ప్రభుత్వం పోలీసుశాఖకు కోట్లాది రూపాయలు ఖర్చు చే స్తోంది. నగరాన్ని ప్రపంచంలోనే సేఫ్‌సిటీగా మార్చేం దు కు ఇప్పటికే ఎన్నో చర్యలు మొదలెట్టారు. సిబ్బంది, అధికారుల ప్రవర్తనలో కూడా మార్పులొస్తున్నాయి. ఫ్రెం డ్లీ పోలీసింగ్‌ను మరింత పెంచుతాం. దీంతో పాటు రౌడీమూకలు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారి పట్ల ఉపేక్షించే ప్రసక్తేలేదు. రాజకీయ ఒత్తిళ్ల తలొగ్గం. ముఖ్యంగా రౌడీ షీటర్లు తమ పద్ధతి మార్చుకోవాలి, లేదంటే పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. - ఎం.మహేందర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ ఫిర్యాదు చేయాలన్నా భయమే.... పై దముగ్గురు రౌడీషీటర్ల ఆగడాలపై సామాన్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు. ఎవరైనా వారిపై ఫిర్యాదు చేస్తే వారిని బెదిరించడం, వారి పిల్లల్ని కిడ్నాప్ చేయడం వంటివి చేసేవారు. దీంతో వారి ఆగడాలు హద్దుమీరాయి. వారిపై ఫిర్యాదు చేయనిదే పోలీసులు కేసు నమోదు చేయలేరు. అధికారికంగా వారిపై ఇప్పటి వరకు 84 కేసులు నమోదు కాగా వెలుగు చూడని కేసులు వందకుపైగానే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఒకడుగు ముందుకేసి వారిపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ చట్టం కింద ఏడాది పాటు వీరు జైలులో ఉండాల్సిందే.