- వివాదాస్పద భూములే టార్గెట్
- సొంతశాఖను వదలని వైనం
- విరాళం పేరుతో చందాలు వసూలు
- కూర సురేందర్ అవినీతికి అంతేలేదు
సాక్షి, హన్మకొండ : ఏసీబీకి చిక్కి చర్లపల్లి జైలులో ఊచలు లెక్కపెడుతున్న జనగామ డీఎస్పీ కూర సురేందర్ నిర్మించిన అవినీతి పుట్టలో నుంచి రోజురోజుకు నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. జనగామ కేంద్రంగా చేసుకుని వరంగల్- హైదరాబాద్ జాతీయ రహదారిపై వరంగల్ శివారు, రాంపూర్, జనగామ, పెంబర్తి, భువనగిరి ప్రాంతాలలో బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ అనితీని సామ్రాట్, ఏసీబీకి పట్టుబడే వరకు చడీ చప్పుడు కాకుండా మామూళ్లు ముట్టజెప్పి నరకయాతన అనుభవించిన వారు నేడు ఆయన అవినీతి చిట్టాపై బాహాటంగా చర్చించుకుంటున్నారు. పదవీ బాధ్యతలను విస్మరించి తన అధికారలను దుర్వినియోగం చేస్తూ విచక్షణారహితంగా లంచాలు వసూలు చేసిన వాటిలో మరికొన్ని ఉదంతాలు.
- బచ్చన్నపేట మండలంలో ఇటీవల మంత్రాల నెపంతో ఓ హత్య జరిగింది. ఈ కేసులో అనుమానితుల నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- గత నాలుగు నెలల క్రితం పట్టణంలో సంచలం రేపిన ఓ వ్యాపారి ఆత్మహత్యాయత్నం సంఘటనలో డీఎస్పీ కార్యాలయం కేంద్రంగా రూ. 13 లక్షలు చేతులు మారినట్లు తెలిసింది.
- కొన్ని నెలల క్రితం జనగామ పట్టణంలో నెహ్రూపార్క్ ప్రాంతంలో ఓ వైద్యుడిని విచారణ పేరుతో డీఎస్పీ కార్యాలాయానికి పిలిపించారు. సదరు వైద్యుడి అర్హత సర్టిఫికేట్లు చూపించాలంటూ కోరారు. ఇలా వరుసగా వారం రోజుల పాటు ఒకే తరహా విచారణ జరిపి సదరు వైద్యుడిని మానసికంగా వేధించారు. అతని విధులకు ఆటంకం కలిగించారు. ఆఖరికి క్లినిక్‌లో వసతులు సరిగా లేవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ విచారణతో విసిగి వేసారిన సదరు వైద్యుడు, చివరికి డీఎస్పీ అంతరంగాన్ని గ్రహించి రూ. 4 లక్షలు ముట్టచెప్పినట్లు తెలుస్తోంది.
- జనగామ పట్టణ శివారు హన్మకొండ రోడ్డులోని ఓ వివాదాస్పద భూమిలో డీఎస్పీ సురేందర్ తలదూర్చి ఓ వర్గం వద్ద రూ 20 లక్షల ముడుపులు అందుకున్నట్లు తెలిసింది. ఇదే సెటిల్‌మెంట్‌లో అవతలి వ్యక్తి నుండి రూ 10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
- జనగామలోని నెహ్రూ పార్క్ వద్ద ఓ వియ్యం వ్యాపారికి చెందిన 125 గజాల స్థలం ఉంది. మార్కెట్‌లో ఈ స్థలం విలువ రూ. 89 లక్షలుగా ఉంది. ఈ భూమిని కొనుగోలు చేసేందుకు రూ. 22లక్షలు చెల్లిం చాడు ఓ బంగారం వ్యాపారి. తీరా రిజిష్ట్రేషన్ చేయిం చేందుకు వెళ్లగా సదరు ఫ్లాట్‌పై బాంయకు రుణం ఉన్నట్లు తేలింది. దానితో తన అడ్వాన్స్ ఇప్పించాలంటూ డీఎస్పీని, బంగారం వ్యాపారి డీఎస్పీ ఆశ్రయించాడు. కేసు సెటిల్ చేసేందుకు తొలుత రూ. 50 వేలు అడ్వాన్స్‌గా పొందారు. ఆ తర్వాత బియ్యం వ్యాపారిని బెదిరించాడు. ఈ కేసునుంచి నీకు విముక్తి కలగాలంటే రూ 8 లక్షలు ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు. చివరికి సమస్య పరిష్కారం కాకపోగా డీఎస్పీ ఖాతాలోకి రూ. 8.50 లక్షలు జమయ్యాయి.
- చివరకు సొంత శాఖ ఉద్యోగులు సైతం డీఎస్పీ బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ డివిజన్‌లో పనిచేస్తున్న నలుగురు సబ్ ఇన్స్‌పెక్టర్‌ల ప్రొబేషనరీ కాలం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేసేందుకు ఒక్కొక్కరిని లక్ష రూపాయల వంతున నాలుగు లక్షలు డిమాండ్ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
- జనగామలో ఏర్పాటు చేస్తున్న బతుకమ్మకుంట అభిల క్రితం అఖిలపక్ష కమిటీ సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న డీఎస్పీ సురేందర్ ఆర్భాటంగా తన వంతుగా రూ. 51 వేలు అభివృద్ధి కోసం విరాళం ఇస్తానని ప్రకటించాడు. తర్వాత విరాళం సేకరణ పేరు చెప్పి పలువురు వ్యాపారుల వద్ద ఇష్టారీతిగా వసూళ్లు చేసినట్లు వ్యాపారులు చెవులు కొరుక్కుం టున్నారను.
కక్కుర్తితోనే కటకటాల పాలు
Published Sun, Aug 30 2015 4:28 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement