పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.
పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ అనుచరులు శ్రీధర్ గౌడ్, బలరాంలను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కోర్టు ఇచ్చిన 5 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో సోమవారం వీరిని హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచిన వనస్థలిపురం పోలీసులు తదనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా.. నయీం కేసులో ప్రధాన నిందితుడు టెక్ మధుని పిటి వారెంట్ మీద నల్లగొండ జైలు నుంచి తరలించారు. సోమవారం మధును సైతం హయత్ నగర్ కోర్టులో హాజరు పరిచారు.