ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు | Police Raids On Virasam State Secretary Professor Khasim House | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు

Published Sat, Jan 18 2020 10:01 AM | Last Updated on Sat, Jan 18 2020 2:39 PM

Police Raids On Virasam State Secretary Professor Khasim House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

గజ్వేల్‌ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్‌ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement