Osmania Univerisity
-
వీసీల నియామకాల్లో ప్రమాణాలు పాటించాలి..
విశ్వవిద్యాలయాలు సమాజాన్ని నడిపించే మేధావులను తయారుచేసే కేంద్రాల వంటివి. చరిత్రను మలుపు తిప్పే ఉద్యమ కేంద్రాలుగానూ అనేకసార్లు నిరూపించుకున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణ చరిత్రలో యూనివర్సిటీలు నిర్వహించిన పాత్ర అమోఘం. ఉస్మానియా, కాకతీయ వంటి యూనివర్సిటీలు మలి తెలంగాణ ఉద్యమంలో పోషించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగినది.తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల అనంతరం తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది. అయితే ఇదంతా సాకారం చేయటానికి తమ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టిన విశ్వ విద్యాలయాల పరిస్థితి ఇప్పుడు అత్యంత దయనీయంగా మారుతోంది.2014లో స్వరాష్ట్రం వచ్చిన నాటి నుండి గడిచిన పదేండ్లలో విశ్వ విద్యాలయాలపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. యూనివర్సిటీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న విధంగా ఉంది. మౌలిక సదుపాయాలు కొత్తగా కల్పించినవి ఏమీ లేదు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలు లేక యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. అటెండర్ పోస్ట్ మొదలుకొని అధ్యాపక పోస్టు వరకూ ఎన్నో పోస్టులు ఖాళీ అయ్యాయి. అయినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దీనికి తోడు చాలా యూనివర్సిటీలకు పెద్ద దిక్కు అయిన వైస్ ఛాన్స్లర్లు (వీసీలు) లేరు. ఇన్‌చార్జీలతోనే కాలం గడుపుతూ వచ్చింది గత ప్రభుత్వం.ఈ నేపథ్యంలో ‘మార్పు కావాలి –కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అనుముల రేవంత్ రెడ్డి సర్కారు సైతం విశ్వవిద్యాలయాలను గాలికొదిలేసినట్లుగా కనిపిస్తోంది. వీసీల నియామకాలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెబుతున్నా అది సాకారం అయ్యేలా కనిపించడంలేదు. ఒకరిద్దరు వీసీ పదవితో పాటూ మరో ఉన్నత పదవినీ నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది.విద్యారంగంలో నిష్ణాతులుగా ఉండి, ప్రొఫెసర్‌గా పదేళ్ళ అనుభవం ఉండి, మంచి పాలనా దక్షుడై ఉన్నవారే వీసీ పదవికి అర్హులు. కానీ ఈ ప్రమాణాలతో సంబంధం లేకుండా మంత్రులూ, కాంట్రాక్టర్లూ తమకు అత్యంత సన్నిహితులూ, క్లాస్‌మేట్లూ అయినవారిని కొన్ని యూనివర్సిటీలకు ఉపకులపతులుగా నియమించాలని పావులు కదుపుతున్నట్లు యూనివర్సిటీ క్యాంపసుల్లో చర్చలు నడుస్తున్నాయి. వీసీల నియామకంలో మంత్రులు తమ తమ సామాజిక వర్గాలవారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.దీన్నిబట్టి విశ్వ విద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎంత భయంకరంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకుల జోక్యం తగ్గి, విశ్వ విద్యాలయాల స్వయం ప్రతిపత్తి కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెంటనే ఇప్పటికైనా ఉపకులపతుల ఎంపిక ప్రక్రియ, కేవలం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి పర్యవేక్షణలో మాత్రమే కాకుండా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమక్షంలో, నిష్పక్ష పాతంగా, అందరి దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకునేవిధంగా సాగాలి.అభ్యర్థులు ఆయా విశ్వవిద్యాలయాలను ఏ రకంగా అభివృద్ధి చేస్తారో తెలియచేసే విజన్ డాక్యుమెంట్లను సైతం సేకరించి విశ్లేషించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలి. అలా కాకుండా ప్రమాణాలను తుంగలో తొక్కి, అయినవారికే వీసీ పదవులను వడ్డిస్తే యూనివర్సిటీలు స్వరాష్ట్రంలోనూ బాగుపడవు. ఇక అందులో చదువుకునే యువత ఏవిధంగా తయారవుతారో ఊహించాల్సిందే!– జవ్వాజి దిలీప్; జేఎన్టీయూ పరిశోధక విద్యార్థి, హైదరాబాద్ -
గంటసేపట్లో పునరుద్ధరించండి
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల కారణం చెప్పి ఉస్మానియా వర్సిటీలోని హాస్టళ్లలో విద్యుత్, నీటి సరఫరాను ఆపడం సరికాదని.. గంటసేపట్లో పునరుద్ధ రించాలని అధికారులను హైకోర్టు ఆదే శించింది. అలా చేయని పక్షంలో రిజి స్ట్రార్ తమ ముందు హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. వర్సిటీ అధికారులు దసరా సెలవులను తొలుత అక్టోబర్ 3 నుంచి 10 వరకు పేర్కొ న్నారు. తర్వాత 26 వరకు పొడిగిండంతో పాటు విద్యుత్, నీటి సరఫరా నిలి పేశారు. వీటిని పునరుద్ధరించేలా ఆదే శాలివ్వాలని కోరుతూ ఎల్ఎల్బీ విద్యా ర్థులు నెరెళ్ల మహేశ్‌గౌడ్‌తో పాటు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచా రణ చేపట్టారు. పిటిషన్ తరఫున న్యాయవాది గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎల్ఎల్బీ వి ద్యార్థులు, గ్రూప్–1 అభ్యర్థులు పరీక్ష లకు సిద్ధమవుతున్నారన్నారు. హాస్టళ్ల లో చదువుకుంటున్న విద్యార్థుల్లో చాలా మంది పేద, మధ్య తరగతి విద్యార్థు లేనని వెల్లడించారు. వర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మరమ్మతులు చేయడం కోసం సరఫరా నిలిపినట్లు చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విద్యుత్, నీటి సరఫరా ను పునరుద్ధరించాలని ఆదేశించారు. -
ఓయూ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ తదితర కోర్సుల మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో ఉంచినట్లు ఆయన చెప్పారు. ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్, ఆర్కియాలజీ, ఉర్దూ, పర్షియన్, ఫిలాసఫీ, మరాఠీ విభాగాల్లో ఎంఏ, ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంకాం ప్రధమ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ప్రొఫెసర్ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. -
ఇంజనీరింగ్‌లో న్యూ జనరేషన్ కోర్సులు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో సరికొత్తగా ఇంజనీరింగ్ కోర్సులు రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో అత్యధిక డిమాండ్ ఉండే కోర్సులను ప్రవేశపెట్టేందుకు జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రస్థాయి విద్యాసంస్థలు సైతం ముందుకొస్తున్నాయి. ప్రధానం గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విద్యాసంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఏఐతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా వంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఐఐటీ హైదరాబాద్ బాటలో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఐఐటీ హైదరాబాద్ దేశంలోనే మొదటిసారిగా 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు సైతం అదే బాట పట్టనున్నాయి. ఏఐతోపాటు మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా అనలిటిక్స్, బిగ్ డేటా సబ్జెక్టులతో కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీ చర్యలు చేపట్టింది. ఈ కోర్సును 2019–20 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసుకుంది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లవారీగా సిలబస్‌ను రూపొందించింది. వర్సిటీ అకడమిక్ కౌన్సిల్ ఆమోదిస్తే కోర్సును అమల్లోకి తేవాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రస్థాయి కాలేజీల్లో ఈ కోర్సును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ కానుంది. ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు 2.5 శాతమే.. ప్రస్తుతం దేశంలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నది కేవలం 20 శాతంలోపేనని నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్టు పేర్కొంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, వైర్లెస్ టెక్నాలజీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ నైపుణ్యాలుగల వారికి మల్టీ నేషనల్ కంపెనీల్లో భారీ డిమాండ్ ఉండగా కేవలం 2.5 శాతం మాత్రమే ఏఐ నైపుణ్యాలు ఉన్న వారు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. మరోవైపు దేశంలోనూ ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులు చేస్తున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కాస్త మెరుగై 37 శాతానికి చేరుకున్నా తగిన నైపుణ్యాలు లేకపోవడం వల్లే 63 శాతం మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని ఇప్పటికే పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టాలని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగానే 2019–20 విద్యాసంవత్సరం నుంచి 600–700 గంటలు ఇంటర్న్‌షిప్‌ను అమలు చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. మరోవైపు ఇంజనీరింగ్ విద్యాసంస్థలు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కోర్సులను ప్రవేశపెట్టేందుకు కసరత్తు ప్రారంభించాయి. ఏఐ, బిగ్ డేటాకు భారీ డిమాండ్... ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్టు... రానున్న రోజుల్లో అంచనాలకు మించి విస్తరించనుందని జర్మనీకి చెందిన స్టాటిస్టా అనే గణాంక సేకరణ ఆన్లైన్ సంస్థ అంచనా వేసింది. 2016లో 3.2 బలియన్ డాలర్లుగా ఉన్న ఏఐ మార్కెట్ రెవెన్యూ... 2025 నాటికి 89.85 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, శామ్సంగ్ వంటి ప్రముఖ సంస్థలు ఏఐ, ఏఐ సంబంధిత రంగాల్లో పరిశోధనల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ మార్కెట్లో 2011లో 7.6 బిలియన్ డాలర్లుగా ఉన్న బిగ్ డేటా మార్కెట్ ప్రస్తుతం 49 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు స్టాటిస్టా అంచనా వేసింది. అది 2027 నాటికి వంద శాతం వృద్ధితో 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని పేర్కొంది. -
ఓయూలో నిరుద్యోగ ఆవేదన సభ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ.. ఓయూ లైబ్రరరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తన ఉనికిని కాపాడుకోవాడానికే కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
న్యూజెర్సీలో ఓయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
న్యూ జెర్సీ : ఉస్మానియా విశ్వవిద్యాలయం సాంకేతిక విభాగం శాఖాధిపతి ఆచార్య డా. లక్ష్మీనారాయణతో ఉస్మానియా పూర్వ విద్యార్థులు న్యూజెర్సీలోని మొఘలాయ్ దర్బార్‌లో కలిసి విశ్వవిద్యాలయంకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వివిధ రంగాలలో నిష్ణాతులైన ఆచార్యులు, శాస్త్రవేత్తలు, వాణిజ్య రంగ నిపుణులు, ఆర్ధిక రంగ నిపుణులు విశ్వవిద్యాలయం బాగోగుల గురించి మాట్లాడారు. ఆచార్య లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక, నిర్మాణాత్మకమైన అంశాలపై దృష్టి సారించిందని తెలిపారు. ప్రవాస ఉస్మానియా అంతా ఇందులో భాగస్వాములవ్వాలన్నారు. శతవసంతాలు పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు. అంతేకాకుండా జాతీయ అంచనా గుర్తింపు కౌన్సిల్ విభాగం ఉత్తమ విశ్వవిద్యాలయం గుర్తింపు రావటం మనందరికీ గర్వకారణం అన్నారు. నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, ఉస్మానియా అమెరికా విభాగం నోడల్ అధికారి మాట్లాడుతూ, ఉస్మానియా నోడల్ అధికారిగా ఇంత పెద్ద బాధ్యతను స్వీకరించటం తనకి ఎంతో ఆనందంగా ఉందని, తనపై నమ్మకముంచి ఈ బాధ్యతని ఇచ్చినందుకు ఉపకులపతి ఆచార్య రామచంద్రంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని ప్రతి ఉస్మానియా పూర్వ విద్యార్థిని విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంచటం ఈ బాధ్యత ముఖ్య ఉద్దేశమని అన్నారు. జనవరిలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్, భారత వాణిజ్య సదస్సు అక్టోబర్‌లో వచ్చే సంవత్సరం జరుగుతుందని ఈ రెండు గొప్ప సదస్సులకు ఉస్మానియా వేదికగా జరుగుతుండటం మనకి ఎంతో గర్వకారణమని అన్నారు. ప్రతి ఒక్కరు సంవత్సరంలో ఒక్కసారైనా విశ్వవిద్యాలయం సందర్శించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. న్యూయార్క్ స్టేట్ విశ్వవిద్యాలయం (సుని)ఫాషన్ టెక్నాలజీ రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న ఉస్మానియా పూర్వ విద్యార్థి ఆచార్య రాజశేఖర్ రెడ్డి వంగపర్తి మాట్లాడుతూ నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (నిఫ్ట్) సుని తో అనుబంధంగా పనిచేస్తుందని ఉస్మానియాని కూడా ఇందులో భాగస్వాములుగా చేసేలా ప్రతిపాదన చేస్తామన్నారు. డా. రవి మేరెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం రసాయన శాస్త్రం పూర్వ విద్యార్థి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల పేరుతో ఏదో ఒక మంచి పని చేస్తున్నామని ఇంకా పెద్ద ఎత్తున్న ప్రతి విద్యార్థి పాల్గొంటే బాగుంటుందన్నారు. మరో పూర్వ విద్యార్థి శరత్ వేముల మాట్లాడుతూ ప్రతి ఉస్మానియా విద్యార్థికి యూనివర్సిటీ తో ఎంతో అనుబంధం ఉంటుందని కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేయాలనీ ఉంటుందని నిజానికి అది ఒక బాధ్యతాయుత అంశమని అన్నారు. ఈ విషయంలో తాను ముందు ఉంటానని పేర్కొన్నారు. ఉస్మానియా సాంఖ్యక శాస్త్రం పూర్వ విద్యార్థి విలాస్ రెడ్డి జంబుల మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం చేపడుతున్న అనేక కార్యక్రమాలలో పూర్వ విద్యార్థుల పాత్ర చాలా ఉండాలని పిలుపునిచ్చారు. రీసెర్చ్ విద్యార్ధులకి తగిన సదుపాయాలు కల్పించటంలో ప్రవాస ఉస్మానియా పూర్వ విద్యార్థులు పాల్గొనాలని సూచించారు. ముఖ్యంగా పరిశోధన రంగానికి ఉస్మానియా పెట్టింది పేరని వారికి ఉపయుక్తమైన ల్యాప్ టాప్‌లు ఇస్తే వారు ప్రపంచంతో అనుసంధానమయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. శరత్ వేముల ఆధ్వర్యం లో జరిగిన ఈ కార్యక్రమంలో డా. రవి మేరెడ్డి మరియు డా” మాధవ్ లు ఆచార్య లక్ష్మినారాయణ ను శాలువాతో సత్కరించగా పూర్వ విద్యార్థి నరేష్ తుళ్లూరి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా అమెరికా విభాగం నోడల్ అధికారి నరసింహ రెడ్డి దొంతిరెడ్డి, డా” రవి మేరెడ్డి, శరత్ వేముల, డా మాధవ్ మోసర్ల, విలాస్ జంబుల, ఆచార్య రాజశేఖర్ వంగపర్తి, ఆచార్య రవీందర్ రెడ్డి రేగట్ట, డా” అజయ కట్ట, రామ మోహన్ రెడ్డి, నరేష్ తుళ్లూరి, పున్నరెడ్డి మండల, రోహిత్ పున్నాం, ద్వారకనాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. -
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
-
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బుధవారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటన ఇలా..: బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాల మళ్లింపు, నిలిపివేయడాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సు రూట్‌ను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచిస్తూ రాష్ట్రపతి పర్యటించే రూట్ల వివరాలను వెల్లడించారు. బేగంపేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 నిమిషాల మధ్య) బేగంపేట్ ఎయిర్‌పోర్టు, బేగంపేట్ పీఎస్, రసూల్‌పురా జంక్షన్, పీజీ కాలేజీ, సీటీవో ఫ్లైఓవర్, ప్లాజా, వైఎంసీఏ ఫ్లైఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, నాయుడు మోటర్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, అలుగడ్డ బావి జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, మెట్టుగూడ జంక్షన్, రైల్వే డిగ్రీ కాలేజీ, తార్నాక ఎక్స్ రోడ్స్, ఆర్టీసి దవాఖాన, ఉస్మానియా యూనివర్శిటీ. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌కు (మధ్యాహ్నం 1.15 నిమిషాల నుంచి 2 గంటల మధ్య) ఉస్మానియా యూనివర్శిటీ, ఆర్టీసీ దవాఖాన, తార్నాక ఎక్స్ రోడ్స్, రైల్వే డిగ్రీ కాలేజీ, మెట్టుగూడ జంక్షన్, ఎస్ఎన్టీ వర్క్ షాప్, అలుగడ్డ బావి జంక్షన్, ఆర్ఆర్సీ గ్రౌండ్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, నాయుడు మోటర్స్ లేన్, సంగీత్ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, నార్త్ జోన్ డీసీపీ అఫీస్, వైంఎసీఏ ఫ్లైఓవర్, ప్లాజా, సీటీవో ఫ్లైఓవర్, పీజీ కాలేజీ, రసూల్‌పురా జంక్షన్, పీఎన్టీ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ ఎక్స్ రోడ్స్, మోనప్ప ఐలాండ్, జయ గార్డెన్, యశోధ దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్ రైల్వే గేట్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాం. రాజ్‌భవన్ నుంచి గచ్చిబౌలి (సాయంత్రం 4 గంటల నుంచి 4.45 నిమిషాల మధ్య) మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహాం, కేసీపీ జంక్షన్, అన్సారీ మంజిల్, హోటల్ తాజ్ కృష్ణ టీ జంక్షన్, రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం. 1/12 జంక్షన్, ఖాజా మెన్షన్, మాసబ్ ట్యాంక్, ఎన్ ఎండీసీ, ఎస్.డీ.ఐ దవాఖాన, హుమాయిన్‌నగర్ పీఎస్, రైతు బజార్, రేతి బౌలి, నాలానగర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, గాలక్సీ ధీయేటర్, షేక్‌పేట్ నాలా, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి. గచ్చిబౌలి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు గచ్చిబౌలి, నారాయణమ్మ కాలేజీ, షేక్‌పేట్ నాలా, గాలక్సీ ధీయేటర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, నాలానగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, ఎస్.డి.కంటి ఆసు పత్రి, ఎన్ఎండీసీ, మాసబ్ ట్యాంక్, ఖాజ మెన్షన్, రోడ్డు నెం.1/12, రోడ్డు నెం.1/10 జంక్షన్, హోటల్ తాజ్ కృష్ణ జంక్షన్, రోడ్డు నెం. 1/7 జంక్షన్, రోడ్డు నెం. 1/4 జంక్షన్, నాగార్జున సర్కిల్ (ఎన్ఎఫ్సీఎల్), పంజాగుట్ట ఫ్లైఓవర్, సీఎం క్యాంప్ అఫీస్, బేగంపేట్ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్, శ్యాంలాల్, పీఎన్టీ జంక్షన్, బేగంపేట్ ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా. ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు... ⇒ అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సతాఫల్మండి వైపు మళ్లిస్తారు. ⇒ హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను వీవీఐపీలు వచ్చే సందర్భంగా రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నెం.1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు. ఆర్టీసీ బస్సుల మళ్లింపు ⇒ఎన్సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు. ⇒ ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ (డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది. ⇒ తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్లో వెళ్లాలి. ⇒ ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి. ⇒దిల్సుఖ్నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్లో నడుస్తాయి. -
25న సమ్మర్ రోడ్ రేస్ పోటీలు
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సమ్మర్ రోడ్ రేస్ పోటీలు ఈనెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి మైదానంలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ (ఏసీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పరుగులో పురుషులు, మహిళలు, అండర్-16 బాలబాలికల విభాగాల్లో 5 కిలో మీటర్లు, మాస్టర్ పురుషుల, మహిళల విభాగాలతోపాటు అండర్-10, 13 బాలబాలికల విభాగాల్లో 2 కిలో మీటర్ల పోటీలను నిర్వహిస్తారు. ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అథ్లెటిక్స్ కోచ్ జేవియర్, భూమయ్యలకు పంపాలి. ఇతర వివరాలకు ఏసీఏ కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ (92465-29013)ను సంప్రదించాలి.