సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రగతి నివేదన సభకు వ్యతిరేకంగా దళిత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ ఆవేదన సభను చేపట్టారు. ప్రగతి నివేదన సభను నిరసిస్తూ.. ఓయూ లైబ్రరరీ నుంచి భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభ వరకు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తన ఉనికిని కాపాడుకోవాడానికే కేసీఆర్ ప్రగతి నివేదన సభను నిర్వహిస్తున్నారని విద్యార్థి నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment