నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు | Traffic restrictions in Hyderabad for President's visit | Sakshi
Sakshi News home page

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Published Tue, Apr 25 2017 7:47 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి బుధవారం హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని ఆయా ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిపివేత, మళ్లింపు ఉంటుందని సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రపతి పర్యటన ఇలా..: బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి వెళ్లనున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలీలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ అడిటోరియంలో జరిగే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ ల్యాంగేజ్ యూనివర్సిటీ కార్యక్రమానికి హాజరువుతారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. రాష్ట్రపతి ఈ రూట్లలో పర్యటించే నిర్ణీత సమయాలలో ఆయా రూట్లలో ఆంక్షలు కొనసాగుతాయని సీపీ వెల్లడించారు. వాహనాల మళ్లింపు, నిలిపివేయడాలు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్లే ఆర్టీసి బస్సు రూట్‌ను మళ్లిస్తుండడంతో వాహనదారులు, ప్రయాణీకులు తమ గమ్యస్థానాలను సులువుగా చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సీపీ సూచిస్తూ రాష్ట్రపతి పర్యటించే రూట్ల వివరాలను వెల్లడించారు.

బేగంపేట్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ (మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.45 నిమిషాల మధ్య)
బేగంపేట్ ఎయిర్‌పోర్టు, బేగంపేట్ పీఎస్, రసూల్‌పురా జంక్షన్, పీజీ కాలేజీ, సీటీవో ఫ్లైఓవర్, ప్లాజా, వైఎంసీఏ ఫ్లైఓవర్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్స్, నాయుడు మోటర్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్ లేన్, అలుగడ్డ బావి జంక్షన్, ఎస్‌ఎన్‌టీ వర్క్ షాప్, మెట్టుగూడ జంక్షన్, రైల్వే డిగ్రీ కాలేజీ, తార్నాక ఎక్స్ రోడ్స్, ఆర్టీసి దవాఖాన, ఉస్మానియా యూనివర్శిటీ.

ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజ్‌భవన్‌కు (మధ్యాహ్నం 1.15 నిమిషాల నుంచి 2 గంటల మధ్య)
ఉస్మానియా యూనివర్శిటీ, ఆర్టీసీ దవాఖాన, తార్నాక ఎక్స్ రోడ్స్, రైల్వే డిగ్రీ కాలేజీ, మెట్టుగూడ జంక్షన్, ఎస్‌ఎన్‌టీ వర్క్ షాప్, అలుగడ్డ బావి జంక్షన్, ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్ లేన్, భారత్ పెట్రోల్ పంప్, నాయుడు మోటర్స్ లేన్, సంగీత్ ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, నార్త్ జోన్ డీసీపీ అఫీస్, వైంఎసీఏ ఫ్లైఓవర్, ప్లాజా, సీటీవో ఫ్లైఓవర్, పీజీ కాలేజీ, రసూల్‌పురా జంక్షన్, పీఎన్‌టీ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, హెచ్‌పీఎస్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ ఎక్స్ రోడ్స్, మోనప్ప ఐలాండ్, జయ గార్డెన్, యశోధ దవాఖాన, ఎంఎంటీఎస్, రాజ్‌భవన్ రైల్వే గేట్, రాజ్‌భవన్, వీవీ విగ్రహాం.

రాజ్‌భవన్ నుంచి గచ్చిబౌలి (సాయంత్రం 4 గంటల నుంచి 4.45 నిమిషాల మధ్య)
మోనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, మెట్రో రెసిడెన్సీ, వీవీ విగ్రహాం, కేసీపీ జంక్షన్, అన్సారీ మంజిల్, హోటల్ తాజ్ కృష్ణ టీ జంక్షన్, రోడ్డు నెం.1/10 జంక్షన్, రోడ్డు నెం. 1/12 జంక్షన్, ఖాజా మెన్షన్, మాసబ్ ట్యాంక్, ఎన్ ఎండీసీ, ఎస్.డీ.ఐ దవాఖాన, హుమాయిన్‌నగర్ పీఎస్, రైతు బజార్, రేతి బౌలి, నాలానగర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, గాలక్సీ ధీయేటర్, షేక్‌పేట్ నాలా, నారాయణమ్మ కాలేజీ నుంచి గచ్చిబౌలి.

గచ్చిబౌలి నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు
గచ్చిబౌలి, నారాయణమ్మ కాలేజీ, షేక్‌పేట్ నాలా, గాలక్సీ ధీయేటర్, టోలిచౌక్ ఫ్లైఓవర్, నాలానగర్, రేతిబౌలి, మెహిదీపట్నం, ఎస్.డి.కంటి ఆసు పత్రి, ఎన్‌ఎండీసీ, మాసబ్ ట్యాంక్, ఖాజ మెన్షన్, రోడ్డు నెం.1/12, రోడ్డు నెం.1/10 జంక్షన్, హోటల్ తాజ్ కృష్ణ జంక్షన్, రోడ్డు నెం. 1/7 జంక్షన్, రోడ్డు నెం. 1/4 జంక్షన్, నాగార్జున సర్కిల్ (ఎన్‌ఎఫ్‌సీఎల్), పంజాగుట్ట ఫ్లైఓవర్, సీఎం క్యాంప్ అఫీస్, బేగంపేట్ ఫ్లైఓవర్, హెచ్‌పీఎస్, శ్యాంలాల్, పీఎన్‌టీ జంక్షన్, బేగంపేట్ ఎయిర్‌పోర్టు, రసూల్‌పురా.

ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్లు...
అడిక్‌మెట్ ఫ్లైఓవర్, ఆర్ట్స్ కాలేజీ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలు సీతాఫల్ టీ జంక్షన్ వద్ద సతాఫల్‌మండి వైపు మళ్లిస్తారు.
హబ్సిగూడ నుంచి తార్నాక వైపు వెళ్లే వాహనాలను వీవీఐపీలు వచ్చే సందర్భంగా రాజ్యాభిలేఖ తార్నాక స్ట్రీట్ నెం.1 వద్ద, లాలాపేట్ నుంచి వచ్చే వాహనాలను డేవిడ్ మెమోరియల్ స్కూల్ వద్ద నిలిపివేస్తారు.
 
ఆర్టీసీ బస్సుల మళ్లింపు
ఎన్‌సీసీ గేట్ నుంచి పాసు ఉన్న వాహనాదారులను మాత్రమే ఉస్మానియా క్యాంపస్‌లోకి పంపిస్తారు. సాధారణ వాహనాలను డీడీ కాలనీ, విద్యానగర్ వైపు మళ్లిస్తారు.

ప్రధాన డైవర్షన్ రాంనగర్ టీ జంక్షన్, విద్యానగర్ టీ జంక్షన్ (డీడీ ఆసుపత్రి) వద్ద ఉంటుంది.

తార్నాక నుంచి వెళ్లే రూట్ నెం. 3 ఆర్టీసి బస్సులు స్ట్రీట్ నెం. 8 హబ్సి గూడ, రామాంతపూర్, అంబర్‌పేట్ 6 జంక్షన్, నింబోలిఅడ్డా మీదుగా కాచిగూడ రూట్‌లో వెళ్లాలి.

ఆఫ్జల్‌గంజ్ లేదా కోఠి నుంచి ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనాలు చాదర్‌ఘాట్, నింబోలి అడ్డా, అంబర్‌పేట 6 జంక్షన్, అంబర్‌పేట్, రామాం తపూర్, హబ్సిగూడ స్ట్రీట్ నెం. 8 నుంచి ఈసీఐఎల్‌కు వెళ్లాలి.

దిల్‌సుఖ్‌నగర్ నుంచి సికింద్రాబాద్‌కు రాకపోకలు సాగించే 107 రూట్ బస్సులను విద్యానగర్ వద్ద మళ్లిస్తారు, ఈ బస్సులు హిందీ మహా విద్యా లయ, ఆర్టీసి ఎక్స్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా సికింద్రాబాద్ రూట్‌లో నడుస్తాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement