క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన రాష్ట్రపతి | President Pranab Mukherjee rejects 2 more mercy pleas | Sakshi
Sakshi News home page

క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన రాష్ట్రపతి

Published Sat, Jun 17 2017 9:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన రాష్ట్రపతి

క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: మరో నెల రోజుల్లో బాధ్యతల నుంచి దిగిపోతుండగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా మరో రెండు క్షమాభిక్ష పిటిషన్‌లను తిరస్కరించారు. దీంతో ఇప్పటి వరకు ఆయన వద్దకు తిరస్కరణకు గురైన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరింది. తాజాగా తిరస్కరించిన ఈ రెండు పిటిషన్లపై రాష్ట్రపతి ప్రణబ్‌ గత మే నెలాఖరున నిర్ణయం తీసుకున్నారు. 2012లో నాలుగేళ్ల బాలికపై ఇండోర్‌లో ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి చంపేయగా ఆ కేసుకు సంబంధించి వారికి మరణ శిక్షను కోర్టు విధించింది.

అలాగే, పుణెలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌ అతడి స్నేహితుడు కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్దకు గత ఏప్రిల్‌, మే నెలలో చేరాయి. వీటిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ రెండు కేసులు కూడా అత్యంత అమానవీయ స్థితిలో చోటుచేసుకున్న నేపథ్యంలో వారికి క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్రపతి నిర్ణయించుకున్నట్లున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రపతిగా ప్రణబ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముంబయి దాడులకు సంబంధించి అజ్మల్‌ కసబ్‌, అఫ్జల్‌గురు, యాకుబ్‌ మీనన్‌ వంటి కరడుగట్టిన ఉగ్రవాదులకు క్షమాభిక్ష పిటిషన్లు తిరస్కరణకు గురవడంతోపాటు ఉరిశిక్ష కూడా అమలైంది. ఈ ఏడాది జనవరిలో ప్రణబ్‌ ఓ నాలుగు మరణశిక్షలను జీవితకాల శిక్షలుగా కూడా మార్చారు. వచ్చే నెలలో రాష్ట్రపతిగా ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement