న్యూ ఢిల్లీ: తమిళ సంప్రదాయ జల్లికట్టు ఆటను పరిరక్షించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లేఖ రాశారు. వ్యవసాయంతో పాటూ, రోజూ వారి జీవితంలో సహాయపడే ఎద్దులు, ఇతర జంతువులకు కృతజ్ఞత తెలిపడానికే జల్లికట్టు ఆట అని వివరించారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులి ఆడే ఈ జల్లికట్టు ఆచారం కళితోగై కాలం నుంచే ఉందని పేర్కొన్నారు.
జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. అనంతరం ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది.
ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లగా వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, రాజ్యాంగ సవరణ చేసి తమిళ సంప్రదాయ ఆట జల్టికట్టును పరిరక్షించాలని కేతిరెడ్డి ప్రణబ్ ముఖర్జీని కోరారు.
జల్లికట్టును పరిరక్షించండి : కేతిరెడ్డి
Published Fri, Jan 20 2017 4:27 PM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM
Advertisement