kethireddy jagadeshwarareddy
-
‘దక్షిణాదిపై వివక్ష’ ప్రధానాస్త్రంగా ప్రచారం
సాక్షి, బెంగళూరు : త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. దక్షిణాదిపై వివక్షను ప్రధాన ఆయుధంగా ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. కర్ణాటకలో తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాలైన బళ్ళారి, తూముకురు, రాయచూరు, బీదర్, గుల్బర్గా జిల్లాల్లో ఈ నెల 22 నుంచి పర్యటిస్తానని తెలిపారు. దక్షిణ భారత దేశంపై ఉత్తరాది నాయకత్వం చూపిస్తున్న వివక్షతను, చిన్న చూపును ప్రజలకు వివరిస్తూ.. జేడీఎస్ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని హామిలను నెరవేర్చకపోవడం, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బ తీసిన విషయాన్ని కర్ణాటకలోని తెలుగు ఓటర్లకు వివరిస్తానన్నారు. ఇంకా తనలాగే దక్షిణాది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై తమ వ్యతిరేకతను తెలియజేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను కూడా కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైతే తన మద్దతు తెలిపి మనమంత ఒక్కటే అనే విషయాన్ని తెలిపారో అలాగే వారు కూడా తమ మద్దతు తెలపాల్సిందిగా కోరుతానన్నారు. -
ఉయ్యాలవాడ విగ్రహాన్ని ఏర్పాటు చేయండి
అమరావతి( వెలగపూడి) : తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి చెన్నైలోని పొట్టి శ్రీరాములు హాల్‌కు పొట్టి శ్రీరాములు ఆంధ్ర భవన్ అని పేరుపెట్టాలని వినతి పత్రం సమర్పించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టించాలని కోరారు. ఉయ్యాలవాడను జాతీయ వీరుడుగా గుర్తించాలన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసిన జుర్రటివాగు ప్రాంతంను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. డ్రగ్స్ వాడేవారు, అమ్మే వారిపై దేశ ద్రోహ కేసులు పెట్టి శిక్షించేలా చట్టాలు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు సంబంధం ఉన్న సన్నివేశాలు చలనచిత్రాల్లో వాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడులో ఆక్రమణకు గురైన ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మిగతా సదావర్తి భూములను తిరిగి వసూలు చేసేలా తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటూ మంత్రి నారా లోకేష్‌ను కూడా కలిసి ఆయన దృష్టికి కూడా ఈ సమస్యలను తీసుకువచ్చారు. -
'శోభన్ బాబు ఆస్తులు ఎందుకు కోరటం లేదు'?
చెన్నై : తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణించిన అనంతరం జరుగుతున్న పరిణామాలపై తమిళనాడు ప్రజలు, జయలలిత అభిమానులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు భాషా పరిరక్షణ వేధిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. జయలలిత వారసులమంటూ కొత్తగా పుట్టుకొస్తున్నవారి ప్రకటనలు చూస్తుంటే అనుమాలున్నాయన్నారు. జయ వారసులుగా రోజుకు ఒకరు తెరపైకి వస్తున్నారు. వారందరూ కేవలం జయలలిత, శోభన్ బాబుల సంతానం అని చెబుతున్నారు. శోభన్ బాబు డీఎన్ఏతో తమ డీఎన్ఏను ఎందుకు సరిపోల్చమని అడగడం లేదని పేర్కొన్నారు. జయలలిత వారసత్వం మాత్రమే వీరందరూ కోరుతున్నారన్నారు. శోభన్ బాబుకు కూడా వీరు వారసులైనప్పటికీ ఆయన ఆస్తులను ఎందుకు వీరు కోరడం లేదని జగదీశ్వర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడు జయ కొత్త కూతురుగా బెంగళూరు నుంచి వచ్చిన అమృత అనే యువతి వెనక ఉన్న అదృశ్య వ్యక్తులు ఎవరో అని ప్రజలకు తెలియాలన్నారు. గతంలో అధికారం కోసం 2012లో జయలలితపై విష ప్రయోగానికి ప్రయత్నించిన శశికళ బెంగళూరు జైలు నుంచి సృష్టించిన ఒక కొత్త పాత్రదారి ఈ అమృత అని ఆరోపించారు. దీని వెనుకాల మన్నారుకుడి మాఫియా హస్తం ఉన్నదా అనే అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేశారు. జయలలిత ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు శశికళ లేక జయలలిత మేనకోడలు, మేనల్లుడు పన్నిన పన్నాగంలో అమృత పాత్ర ఉన్నదా అనే అనుమానాలు నిగ్గుతేలాలంటే కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. అమృత తన మాటల్లో కొందరు వ్యక్తులు జయలలిత తన తల్లి అని చెప్పినట్టు, ఇంతకాలం తాను జయలలిత చెల్లెలు వద్ద బెంగళూరులో పెరిగినట్టు పొంతనలేని కథలు అల్లిందన్నారు. జయలలిత మరణించి దాదాపు 9 నెలలు అయినప్పటికి ఇప్పుడు వచ్చి జయలలిత కుమార్తె అని చెప్పడం, శశికళ తన తల్లి చావుకు కారణం అని రాష్ట్రపతికి, ప్రధానికి సీబీఐ దర్యాప్తు కావాలని కోరుతూ లేఖలు రాయడం వాస్తవ విరుద్ధంగా ఉన్నాయన్నారు. తాను డీఎన్ఏ పరీక్షలకు సిద్ధమని తెలియజేయడం వెనక కూడా కుట్ర దాగి ఉందని కేతిరెడ్డి అన్నారు. ఇప్పటికే అమృత డీఎన్ఏ శాంపిల్స్ తీసి, జయలలిత శాంపిల్స్‌గా సృష్టించారేమో అన్న అనుమానం కలుగుతోందన్నారు. జయలలిత ఆసుపత్రిలో ఉండగా జరిగిన ఒక ఉప ఎన్నిక కొరకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత సంతకం చేయలేని పరిస్థితిలో ఉండగా, అదే సమయంలో వేరే వ్యక్తి వేలిముద్రలను జయలలిత వేలి ముద్రలుగా శశికళ సృష్టించారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. జయలలిత ఆస్తులను తన సొంతం చేసుకోవడానికే శశికళ ఒక పన్నాగం పన్నిందని తమిళనాడు ప్రజలు, జయలలిత అభిమానుల్లో అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీజేపీ తమిళనాడులో పాగా వేయడం కోసం అక్కడి అవినీతి ప్రభుత్వంపై కేంద్రపెత్తానం ఉండాలని అడుగులు వేస్తోందేగానీ, జయలలిత మరణం వెనక దాగున్న కుట్ర కోణాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. జయలలిత బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. తనకు వారసులు లేరు కాబట్టి జయ కోరిక ప్రకారం ఆమె ఆస్తులు అన్ని ప్రజలకే చెందాలన్నారు. ఆ దిశగా కేంద్రం సీబీఐతో విచారణ చేపట్టి.. ఎవరు దోషులో తేల్చిన రోజే తమిళనాడు ప్రజల గుండెల్లో బీజేపీకి ఒక సుస్థిరమైన స్థానం ఉంటుందని కేతిరెడ్డి తెలిపారు. జయలలిత మరణం వెనుక అనుమానులున్నాయని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సుప్రీం కోర్టులో గతంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ కేసును దాఖలు చేశారు. ఆ కేసులో విచారణలో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే సదరు కేసు దాఖలు చేయవల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం కోరి, ఆ కేసును కొట్టివేసింది. ఇప్పడు అమృత తానే జయలలిత కుమర్తెనని చెప్పుకోంటోంది కాబట్టి, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టి సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేస్తే అందుకు తన వంతుగా పూర్తి సహాకారం అందిస్తానని కేతిరెడ్డి తెలిపారు. -
'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం'
చెన్నై : బాహుబలి2 సినిమా దేశవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒక కారణమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాహుబలి చిత్రంలోని కట్టప్ప, బాహుబలిల పాత్రలను ఊటంకిస్తూ మోదీ ప్రసంగించారని తెలిపారు. దీంతో బాహుబలికి ఉత్తరభారతదేశంలో క్రేజ్ ఏర్పడిందన్నారు. హీందీ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడానికి మోదీ కూడా ఓ కారణమయ్యారని తెలిపారు. హీరో ప్రభాస్ పెద్దనాన్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు మోదీతో ఉన్న పరిచయం కూడా ఇందుకు దోహదపడిందని కేతిరెడ్డి అన్నారు. అంతేకాకుండా బాహుబలితో ఉత్తరాదిన కూడా తన సత్తా చాటిన ప్రభాస్‌ను వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వినియోగించే అవకాశం కూడా లేకపోలేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో తమిళ హీరో విజయ్ మోదీని కలిసి తన మద్దతు తెలిపారు. విజయ్ కూడా బీజేపీతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని కేతిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో ప్రభాస్‌తో పాటూ విజయ్‌లకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని బీజేపీ పాగా వేసే అవశాకాశం ఉందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. -
జల్లికట్టును పరిరక్షించండి : కేతిరెడ్డి
న్యూ ఢిల్లీ: తమిళ సంప్రదాయ జల్లికట్టు ఆటను పరిరక్షించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి లేఖ రాశారు. వ్యవసాయంతో పాటూ, రోజూ వారి జీవితంలో సహాయపడే ఎద్దులు, ఇతర జంతువులకు కృతజ్ఞత తెలిపడానికే జల్లికట్టు ఆట అని వివరించారు. నిర్దిష్ట స్థలంలో కొందరు యువకుల మధ్యకు బలిష్టమైన గిత్తను వదులి ఆడే ఈ జల్లికట్టు ఆచారం కళితోగై కాలం నుంచే ఉందని పేర్కొన్నారు. జంతువులకు శిక్షణ (కోతులు, ఎలుగుబంట్లు, పులులు తదితర) ఇచ్చి... వాటితో ప్రదర్శనలు ఇవ్వడాన్ని కేంద్ర ప్రభుత్వం 1991లో నిషేధించింది. 2011లో ఈ జాబితాలో గిత్తను కూడా చేర్చారు. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా... 2014లో అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ జల్లికట్టుపై నిషేధం విధించింది. అనంతరం ఎద్దు నిషేధిత జాబితాలో ఉన్నా జల్లికట్టు ఆడుకోవచ్చని కేంద్రం ఆదేశించింది. ఇది కోర్టు ధిక్కారమని జంతు పరిరక్షణ సంస్థ ‘పెటా’ సుప్రీం తలుపు తట్టింది. ఈ ఆదేశాలను సుప్రీం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో క్రీడ మద్దతుదారులు కొందరు అనుమతించాలని మళ్లీ సుప్రీంకు వెళ్లగా వారి విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా జల్లికట్టు కోసం ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. జల్లికట్టుకు అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకువచ్చి, రాజ్యాంగ సవరణ చేసి తమిళ సంప్రదాయ ఆట జల్టికట్టును పరిరక్షించాలని కేతిరెడ్డి ప్రణబ్ ముఖర్జీని కోరారు.