
మీడియాతో మాట్లాడుతున్న కేతిరెడ్డి (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు : త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జనతా దళ్ సెక్యులర్ (జేడీఎస్) పార్టీకి మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు. దక్షిణాదిపై వివక్షను ప్రధాన ఆయుధంగా ప్రచారం నిర్వహిస్తానని అన్నారు. కర్ణాటకలో తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాలైన బళ్ళారి, తూముకురు, రాయచూరు, బీదర్, గుల్బర్గా జిల్లాల్లో ఈ నెల 22 నుంచి పర్యటిస్తానని తెలిపారు. దక్షిణ భారత దేశంపై ఉత్తరాది నాయకత్వం చూపిస్తున్న వివక్షతను, చిన్న చూపును ప్రజలకు వివరిస్తూ.. జేడీఎస్ అభ్యర్థుల విజయానికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై స్పందిస్తూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం, విభజన చట్టంలోని హామిలను నెరవేర్చకపోవడం, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బ తీసిన విషయాన్ని కర్ణాటకలోని తెలుగు ఓటర్లకు వివరిస్తానన్నారు. ఇంకా తనలాగే దక్షిణాది ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై తమ వ్యతిరేకతను తెలియజేస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌ను కూడా కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాగైతే తన మద్దతు తెలిపి మనమంత ఒక్కటే అనే విషయాన్ని తెలిపారో అలాగే వారు కూడా తమ మద్దతు తెలపాల్సిందిగా కోరుతానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment