'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం' | Modi one of the reason for bahubali2 collections says kethireddy | Sakshi
Sakshi News home page

'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం'

Published Mon, May 1 2017 10:11 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం'

'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం'

చెన్నై :
బాహుబలి2 సినిమా దేశవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒక కారణమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు.  ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా  బాహుబలి చిత్రంలోని కట్టప్ప, బాహుబలిల పాత్రలను ఊటంకిస్తూ మోదీ ప్రసంగించారని తెలిపారు. దీంతో బాహుబలికి ఉత్తరభారతదేశంలో క్రేజ్‌ ఏర్పడిందన్నారు. హీందీ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడానికి మోదీ కూడా ఓ కారణమయ్యారని తెలిపారు. హీరో ప్రభాస్‌ పెద్దనాన్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు మోదీతో ఉన్న పరిచయం కూడా ఇందుకు దోహదపడిందని కేతిరెడ్డి అన్నారు.

అంతేకాకుండా బాహుబలితో ఉత్తరాదిన కూడా తన సత్తా చాటిన ప్రభాస్‌ను వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వినియోగించే అవకాశం కూడా లేకపోలేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో తమిళ హీరో విజయ్‌ మోదీని కలిసి తన మద్దతు తెలిపారు. విజయ్‌ కూడా బీజేపీతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని కేతిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడుల్లో ప్రభాస్‌తో పాటూ విజయ్‌లకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని బీజేపీ పాగా వేసే అవశాకాశం ఉందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement