bahubali2
-
అబ్బాస్ అలీ ఎవరు..? : బాహుబలి నిర్మాత
నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో తప్పిదం చోటుచేసుకుంది. బాహుబలి 2 మూడు విభాగాల్లో అవార్డులు సాధించినట్టుగా జ్యూరీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక ట్విటర్లో వెల్లడించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, పోరాట సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. అంతా బాగానే ఉంది. కానీ బాహుబలి 2లో ఉత్తమ పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు గానూ అబ్బాస్ అలీ మొఘల్కు అవార్డు దక్కినట్టుగా ప్రకటించారు. బాహుబలి పోరాటలను రూపొందించింది ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. కానీ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టరీ ట్విటర్ ఖాతాలో అబ్బాస్ అలీ మొఘల్ అవార్డ్ వచ్చినట్టుగా ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటనపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ...‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? అతను బాహుబలి సిరీస్‌లో పనిచేయలేదు’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ.. తమ అధికారిక ఖాతాల్లోంచి దానికి సంబంధించిన ట్వీట్‌ను తొలగించారు. -
దంగల్
-
మా బావ ప్రభాస్ నిరూపించాడు : మోహన్ బాబు
బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ బాహుబలి యూనిట్‌పై అభినందనల జల్లు కురిపిస్తుండగా, తాజాగా సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా స్పందించారు. హీరోలు ప్రభాస్, రానా, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్రప్రసాద్‌లను ప్రశంసలతో ముంచెత్తారు. ‘బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ.’ అంటూ ప్రభాస్‌ను పొగుడుతూనే ఈ ఏడాదైనా వివాహం చేసుకోవాలంటూ సూచించారు. ‘డియర్ శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని, నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు..దిగ్విజయోస్తు..కీర్..మరకతమణిగా..ఎంఎం క్రీమ్‌గా..కీరవాణిగా..ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ ‘ప్రియమైన రాజమౌళి.. భారతదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని అన్నయ్య ఎన్.టి రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్రప్రసాద్'గా సార్థక నామధేయుడివి అయ్యావు. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’ అని బాహుబలి2 టీంను మోహన్ బాబు అభినందనలతో ముంచెత్తారు. -
'బాహుబలి2 కలెక్షన్లు.. మోదీ ఓ కారణం'
చెన్నై : బాహుబలి2 సినిమా దేశవ్యాప్తంగా విడుదలై భారీ కలెక్షన్లు రాబట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ కూడా ఒక కారణమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాహుబలి చిత్రంలోని కట్టప్ప, బాహుబలిల పాత్రలను ఊటంకిస్తూ మోదీ ప్రసంగించారని తెలిపారు. దీంతో బాహుబలికి ఉత్తరభారతదేశంలో క్రేజ్ ఏర్పడిందన్నారు. హీందీ చిత్రాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడానికి మోదీ కూడా ఓ కారణమయ్యారని తెలిపారు. హీరో ప్రభాస్ పెద్దనాన్న కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజుకు మోదీతో ఉన్న పరిచయం కూడా ఇందుకు దోహదపడిందని కేతిరెడ్డి అన్నారు. అంతేకాకుండా బాహుబలితో ఉత్తరాదిన కూడా తన సత్తా చాటిన ప్రభాస్‌ను వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో వినియోగించే అవకాశం కూడా లేకపోలేదని కేతిరెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో తమిళ హీరో విజయ్ మోదీని కలిసి తన మద్దతు తెలిపారు. విజయ్ కూడా బీజేపీతోనే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని కేతిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుల్లో ప్రభాస్‌తో పాటూ విజయ్‌లకు ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకుని బీజేపీ పాగా వేసే అవశాకాశం ఉందని కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. -
‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు
హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమాకు పైరసీ కష్టాలు తప్పలేదు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పటికే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అప్పుడే ఆన్లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పైరసీదారుల ఆటకట్టించేందుకు చిత్ర యూనిట్ చర్యలు చేపట్టింది. ‘బాహుబలి 2’ పైరసీ లింకులు బ్లాక్ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్ లో ఈ సినిమా సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం కోరింది. blockxpiracy.com, apfilmchamber.comలకు లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకు ‘బాహుబలి’ బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి 2’ విడుదలైంది. అయితే తమిళనాడులో చాలా ధియేటర్లు బెనిఫిట్ షోలను రద్దు చేశాయి. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యేక ప్రదర్శనలు వేయలేదని ధియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి. -
హైదరాబాద్‌లో బాహుబలి2 మానియా
-
బాహుబలి2 విడుదలకు సహకరించాలి..
చెన్నై: కావేరి వివాదంలో తమిళ నటుడు సత్యరాజ్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాక బాహుబలి-2ను అడ్డుకోకూడదని కన్నడిగులకు దర్శకుడు రాజమౌళి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 9 సంవత్సరాల ముందు మాట్లాడిన మాటలకు నిరసనగా బాహుబలి-2ను కన్నడిగులు ప్రదర్శన చేయకుండా అడ్డుకుంటామన్నడం కన్నడ, తెలుగు ప్రజల మధ్య విఘాతానికి కారణం కాకూడదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చిత్రా ప్రదర్శన జరిపించాలని కోరారు. కళకు, రాజకీయ మాటలకు సంబంధం లేదని అన్నారు. భారతదేశ చలనచిత్ర వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన చిత్రం బాహుబలి అని పోగిడారు. అలాంటి సినిమాను అడ్డుకోకుండా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. కన్నడ నాట పుట్టి పెరిగినా రాజమౌళిని కన్నడిగులు తమ సహోదరులుగా భావించి చిత్ర విడుదలకు సహకరించాలని పేర్కొన్నారు. అంతేకాక కన్నడ, తెలుగు ప్రజల మధ్య కొనసాగుతున్న సోదర భావం కొనసాగటానికి స్వాగతించాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. -
సాహోరే బాహుబలి
-
‘బాహుబలి 2’ లోగో ఆవిష్కరణ
-
హైలెట్‌గా కట్టప్ప క్యారెక్టర్