‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు | If you come across Baahubali 2 pirated links kindly send to us | Sakshi
Sakshi News home page

‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు

Published Fri, Apr 28 2017 9:07 AM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు

‘బాహుబలి 2’కు తప్పని కష్టాలు

హైదరాబాద్‌: అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమాకు పైరసీ కష్టాలు తప్పలేదు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని దృశ్యాలు ఇప్పటికే ఇంటర్నెట్‌ లో ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అప్పుడే ఆన్‌లైన్‌లో పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు పైరసీదారుల ఆటకట్టించేందుకు చిత్ర యూనిట్‌ చర్యలు చేపట్టింది.

‘బాహుబలి 2’ పైరసీ లింకులు బ్లాక్‌ చేసేందుకు సిద్ధమైంది. ఇంటర్నెట్‌ లో ఈ సినిమా సంబంధించి పైరసీ లింకులు తెలిస్తే తమకు సమాచారం అందించాలని రాజమౌళి బృందం కోరింది. blockxpiracy.com, apfilmchamber.comలకు లింకులు పంపాలని విజ్ఞప్తి చేసింది. పైరసీ పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఎంతో కష్టపడి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ధియేటర్లలోనే చూడాలని ప్రేక్షకులకు ‘బాహుబలి’ బృందం విజ్ఞప్తి చేసింది.

శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ‘బాహుబలి 2’  విడుదలైంది. అయితే తమిళనాడులో చాలా ధియేటర్లు బెనిఫిట్‌ షోలను రద్దు చేశాయి. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యేక ప్రదర్శనలు వేయలేదని ధియేటర్ల యాజమాన్యాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement