బాహుబలి సిరీస్ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ
నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో తప్పిదం చోటుచేసుకుంది. బాహుబలి 2 మూడు విభాగాల్లో అవార్డులు సాధించినట్టుగా జ్యూరీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక ట్విటర్‌లో వెల్లడించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, పోరాట సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. అంతా బాగానే ఉంది. కానీ బాహుబలి 2లో ఉత్తమ పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు గానూ అబ్బాస్ అలీ మొఘల్‌కు అవార్డు దక్కినట్టుగా ప్రకటించారు.
బాహుబలి పోరాటలను రూపొందించింది ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. కానీ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టరీ ట్విటర్ ఖాతాలో అబ్బాస్ అలీ మొఘల్ అవార్డ్ వచ్చినట్టుగా ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటనపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ...‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? అతను బాహుబలి సిరీస్‌లో పనిచేయలేదు’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ.. తమ అధికారిక ఖాతాల్లోంచి దానికి సంబంధించిన ట్వీట్‌ను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment