Shobu Yarlagadda
-
ఇది ప్రభాస్ విగ్రహమా? నవ్వుతున్న జనాలు.. స్పందించిన నిర్మాత
ఆరడుగుల అందగాడు.. అమ్మాయిల మనసు కొల్లగొట్టిన ఆజానుబాహుడు.. మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రభాస్. బాహుబలి సినిమాతో ఆలిండియా మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడీ స్టార్ హీరో. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల మైనపు బొమ్మలను ఏర్పాటు చేసే మేడమ్ టుస్సాడ్స్‌లోనూ ప్రభాస్ మైనపు విగ్రహం ఉంది. 2017లోనే ఆయన విగ్రహం ఏర్పాటైంది. ఆయన డార్లింగా? అయితే తాజాగా మరోచోట ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మైసూర్‌లోని ఓ స్టేడియంలో బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని తయారు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. ఏ యాంగిల్లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు? అసలు అక్కడున్నది డార్లింగ్ అని గుర్తుపట్టడమే కష్టంగా ఉందంటున్నారు. కొందరు నెటిజన్లేమో.. కొంత రామ్‌చరణ్‌లా, మరికొంత బిగ్‌బాస్ సన్నీలా కనిపిస్తున్నాడని సెటైర్లు వేస్తున్నారు. అసలు బాహుబలి పోలికలే లేవని, ఇంత ఘోరంగా ఎలా తయారు చేశారని విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించాడు. 'మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతాం' అని నిర్మాత ట్వీట్ చేశాడు. ఇది చూసిన జనాలు.. 'హమ్మయ్య, మీరు చెప్పాక కానీ ఆయన ప్రభాస్ అని మాకు అర్థం కాలేదు, థాంక్యూ..' అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరికొందరేమో.. 'దేశం మొత్తం మీద ఎక్కడ బాహుబలి బొమ్మలు ఉన్నా అన్నీ లైసెన్స్ తీసుకునే చేస్తున్నారా? ఆ విగ్రహాల వెనక పరిగెత్తే బదులు లైట్ తీసుకోవచ్చుగా' అని ఉచిత సలహా ఇస్తున్నారు. This not an officially licensed work and was done without our permission or knowledge. We will be taking immediate steps to get this removed. https://t.co/1SDRXdgdpi — Shobu Yarlagadda (@Shobu_) September 25, 2023 చదవండి: శివాజీ నోటిదూల.. 'ఎక్స్' టాపిక్.. నీ క్యారెక్టర్ ఏంటంటూ శుభశ్రీపై ఫైర్ -
యంగ్ హీరోపై బాహుబలి నిర్మాత శోభు సంచలన వ్యాఖ్యలు
బాహుబలితో తెలుగు సినిమా మార్కెట్‌ను ప్రపంచానికి తెలిపిన నిర్మాత శోభు యార్లగడ్డ. ఆ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. సోషల్ మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే ఆయన తనకు నచ్చని విషయం ఏదైనా పరిశ్రమలో జరిగితే తన అభిప్రాయాలను తెలపడానికి ఏ మాత్రం సంకోచించడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి సినిమాను వదులుకున్నాడని శోభు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత మళ్లీ వెంటనే దానిని తొలగించాడు. దీంతో ఆ యంగ్ హీరో ఎవరు..? ఆ హిట్ సినిమా ఏమిటి అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. శోభు చేసిన ట్వీట్లో ఇలా పేర్కొన్నాడు. 'ఇటీవలే సక్సెస్‌లో ఉన్న ఒక యంగ్ హీరో తన ఆటిట్యూడ్ వల్ల మంచి హిట్ సినిమాను వదులుకున్నాడు. మనకు విజయం వచ్చిన తర్వాత దానిని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.. ఒక డెబ్యూ డైరెక్టర్ స్క్రిప్ట్ చెప్పడానికి ఆ హీరో వద్దకు వెళ్ళినప్పుడు తన ఆటిట్యూడ్‌తో కనీస గౌరవం చూపలేదు. ఈ వైఖరి అతని కెరీర్‌కు ఏమాత్రం మంచిది కాదు. ఈ విషయంపై త్వరలో రిలైజ్ అవుతాడని ఆశిస్తున్నా. కొత్తగా వస్తున్న వారికి మినిమమ్ గౌరవం అయినా ఇవ్వాలి. అప్పుడే కెరీర్‌ను బిల్డ్ చేసుకోగలం. ఇలాంటి ఆటిట్యూడ్ తన కెరీర్‌కు ఉపయోగపడదు. ఇది ముందుగానే గ్రహిస్తాడని నేను ఆశిస్తున్నాను' అంటూ ఆయన ట్వీట్ చేశాడు. అయితే ఆ హీరో ఎవరు అనేది ఆయన తెలుపలేదు. (ఇదీ చదవండి: రూ. 500 కోట్లు అయినా సరే నచ్చకపోతే నో చెప్పేస్తా: హీరోయిన్) ఇక సోషల్ మీడియాలో పలువురు ఆ హీరో విశ్వక్ సేన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బేబీ సినిమా కథను ముందుగా విశ్వక్ సేన్‌కు డైరెక్టర్ సాయి రాజేష్ చెప్పాడు. కనీసం అది వినకుండా విశ్వక్ రిజెక్ట్ చేశాడు. ఇదే విషయాన్ని పరోక్షంగా సాయి రాజేష్ చెప్పాడు. అందుకు సమాధానంగా స్క్రిప్ట్ విన్న తర్వాత నో చెప్పడం కంటే ముందే నో చెబితే బాగుంటుందని విశ్వక్ కూడా గతంలోనే కౌంటర్ ఇచ్చాడు. ఇదే గొడవపైన శోభు స్పందించాడంటూ నెటిజన్లు చెప్పుకొచ్చారు. దీంతో కొంత సమయం తర్వాత విశ్వక్ సేన్ గురించి కామెంట్ చేయలేదని శోభు క్లారిటీ ఇచ్చాడు. అంతటితో ఆ గొడవకు తెర పడింది. మరి శోభు చెప్పిన యంగ్ హీరో ఎవరు.. ? ఆ హిట్ సినిమా ఏంటి.. ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్? నిజమనుకుంటున్నారా?
సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు వాటిని చూసీచూడనట్లు ఊరుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ప్రభాస్ గురించి ఓ వెబ్సైట్ వార్తను వండివార్చింది. ప్రభాస్‌కు ఓ ఫామ్‌హౌస్ ఉందని, అది జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. అక్కడితో ఆగకుండా కేవలం రూ.1.05 కోట్లకే ఈ ఫామ్‌హౌస్‌ను సొంతం చేసుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 84 ఎకరాల ఫామ్‌హౌస్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉండొచ్చని రాసుకొచ్చింది. దీనికి రాధేశ్యామ్లోని ఓ ఫొటోను వాడేసింది. పాష్ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు, అది కూడా కేవలం కోటి రూపాయలతో దక్కించుకోవడమేంటని నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వార్తపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. 'ఏంటి, నిజమా? అసలు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు అంటే దాని విలువెంతుంటుందో మీకేమైనా తెలుసా? ఏదో ఒక చెత్త రాసేసి దానికి ఓ సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది' అని చురకలంటించాడు. అటు డైరెక్టర్ మారుతి సైతం 'ప్రభాస్ విల్లాకు ఇంకా రాధేశ్యామ్ ఇంటీరియర్ డిజైనే వాడుతున్నట్లున్నారే?' అంటూ సెటైర్లు వేశాడు. చదవండి: ఈ సీజన్లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే ఓటీటీలో ఊర్వశివో రాక్షసివో -
భళా బాహుబలి
‘బాహుబలి’ చిత్రం భారతీయ సినిమాలో పెను మార్పులు తీసుకొచ్చింది. మార్కెట్‌ని విస్తృత పరిచింది.. హద్దుల్ని బద్దలు కొట్టేసింది. ప్రపంచ వ్యాప్త సినీ ప్రేక్షకులందరితో ‘భళా బాహుబలి’ అనిపించుకుంది. ఇప్పుడు లండన్‌లోనూ ‘భళా బాహుబలి’ అంటూ వినిపిస్తోంది. లండన్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: 1’ చిత్రాన్ని హిందీలో ప్రదర్శించారు. 148 ఏళ్ల ఆల్బర్ట్ హాల్ చరిత్రలో ఇంగ్లీష్ భాషలో కాకుండా ఇతర భాషలో ఓ సినిమా ప్రదర్శితం కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సినిమా ప్రదర్శన అనంతరం ప్రేక్షకులందరూ నిల్చొని చప్పట్లు కొట్టారని సమాచారం. ఈ ప్రదర్శనలో రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క, కీరవాణి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొన్నారు. పంచెకట్టు వేషధారణతో రాజమౌళి స్క్రీనింగ్‌కి హాజరయ్యారు. -
దెబ్బకు ట్వీట్ డెలిట్ చేశాడు!
సినీ ప్రేమికులందరికీ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేరు తెలిసే ఉంటుంది. బాలీవుడ్లో ఆయన ఇచ్చే రివ్యూలకు, చెప్పే బాక్సాఫీస్ కలెక్షన్లపై అందరికీ ఎంతో నమ్మకం ఉంటుంది. అయితే ఈ సారి ఆయన చెప్పిన బాక్సాఫీస్ లెక్కలు తప్పాయి. అందులోనూ బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని తక్కువ చేసి చూపడంతో ఆ చిత్ర నిర్మాత తరణ్ ఆదర్శ్‌కు చురకలంటించారు. ఆ దెబ్బతో ఆయన ఆ ట్వీట్‌ను డెలిట్ చేసేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ప్రపంచవ్యాప్తంగా అవేంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఎండ్‌గేమ్ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతూ హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని.. బాహుబలి2 రెండో స్థానంలోకి వెళ్లిందని ట్వీట్ చేశాడు. ఆ తర్వాతి స్థానంలో మరో మూడు, నాలుగు హిందీ సినిమాల పేర్లు ఉన్నాయని తెలిపాడు. అయితే బాహుబలి నిర్మాత అయిన శోభు యార్లగడ్డ ఈ ట్వీట్‌కు స్పందించారు. మీరు లిస్ట్‌లో చేర్చిన సినిమాలను తక్కువ చేయాలని మాట్లాడటం లేదు.. కానీ మీరు చేసిన పోలిక మాత్రం సరైంది కాదు ఎందుకుంటే బాహుబలి2 అనేది కేవలం హిందీలో డబ్ కాగా ఆ చిత్ర వసూళ్లను.. మిగతా చిత్రాలతో ఎలా పోలుస్తారు అంటూ ప్రశ్నించారు. మిగతా సినిమాలన్నీ ఇండియా పాన్ సినిమాలని, అన్ని భాషల్లో కలిపి సాధించిన వసూళ్లతో బాహుబలి2ను ఎలా ఒకటిగా పరిగణిస్తారంటూ ట్వీట్ చేశారు. దీంతో తరణ్ ఆదర్శ్ తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. Not to take away the success any of the films listed below, I don't think this is a right comparison and doesn't put things in perspective especially from veteran trade analyst like yourself! BB2 one language (predominantly North India) vs all other films all languages pan India https://t.co/IP2d2BbMEK — Shobu Yarlagadda (@Shobu_) May 3, 2019 -
రానా బర్త్‌డేకి జపాన్ నుంచి కానుకలు
బాహుబలి సినిమా తెలుగు సినిమా స్థాయిని పెంచటం మాత్రమే కాదు.. ఆ సినిమాలో నటించిన నటీనటుల స్థాయిని కూడా ఎన్నో రెట్లు పెంచింది. ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్, రానాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇటీవల బాహుబలి జపార్ లో రిలీజ్ అయిన సందర్భంగా అక్కడి అభిమానులు చేసిన సందడి అంతా ఇంతా కాదు. వారిని మరింత ఉత్సాహపరిచేందుకు చిత్రయూనిట్ జపాన్‌లో పర్యటించి వారితో సరదాగా గడిపారు. మన రానాను తమ వాడిగా ఓన్ చేసుకున్న జపాన్ అభిమానులు రానా పుట్టిన రోజు సందర్భంగా భారీగా గిఫ్ట్‌లను పంపించారు. బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా ఆఫీస్‌కు 19 గిప్ట్ పార్సిల్ వచ్చినట్టుగా నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. జపాన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మూవీ ట్విన్ ద్వారా ఈ పార్సిల్స్ వచ్చినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం హాథీ మేరి సాథీ సినిమాలో నటిస్తున్న రానా చేతిలో మరిన్ని బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 19 boxes of fan mail & gifts to @RanaDaggubati from our Japan distributor @movietwin2 arrived today at Arka! Thanks once again for all the love from Japan! #Ballaladeva @BaahubaliMovie #JapanFans #Fanlove @V8Japan pic.twitter.com/KOHuqcLjZD — Shobu Yarlagadda (@Shobu_) 14 December 2018 -
ఫిలింఫేర్ అవార్డ్స్ హంగామా
జియో 65 సౌత్ ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దక్షణాది ఇండస్ట్రీలకు సంబంధించిన పలువురు తారలు పాల్గొని అవార్డులను అందుకున్నారు. ఈ ఈవెంట్‌ను సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ హోస్ట్ చేశారు. రకుల్ ప్రీత్‌సింగ్, రెజీనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు హైలైట్‌గా నిలిచాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’, ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి: ది కన్‌క్లూజన్) ఉత్తమ నటుడిగా విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి), విమర్శకుల ఉత్తమ నటుడు వెంకటేశ్ (గురు), ఉత్తమ నటి: సాయి పల్లవి (ఫిదా), విమర్శకుల ఉత్తమ నటి : రితికా సింగ్ (గురు), ఉత్తమ సహాయ నటుడు : రానా దగ్గుబాటి (బాహుబలి: ది కన్‌క్లూజన్ ), ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం : కీరవాణి (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ తొలి చిత్ర కథానాయిక : కల్యాణి ప్రియదర్శన్, ఉత్తమ ఛాయాగ్రాహకుడు: సెంథిల్ కుమార్ (బాహుబలి: ది కన్‌క్లూజన్), ఉత్తమ కొరియోగ్రాఫర్: శేఖర్ (ఖైది నెం:150, ఫిదా), జీవిత సాఫల్య పురస్కారాన్ని కైకాల సత్యనారాయణ అందుకున్నారు. తమిళం ఉత్తమ చిత్రం: ఆరమ్, మలయాళంలో ఉత్తమ నటుడిగా ఫాహిద్ ఫాజల్, కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ అవార్డులను కైవసం చేసుకున్నారు. రానా, విజయ్, శోభు యార్లగడ్డ -
అబ్బాస్ అలీ ఎవరు..? : బాహుబలి నిర్మాత
నేడు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనలో తప్పిదం చోటుచేసుకుంది. బాహుబలి 2 మూడు విభాగాల్లో అవార్డులు సాధించినట్టుగా జ్యూరీ ప్రకటించింది. అందుకు సంబంధించిన వివరాలను అధికారిక ట్విటర్లో వెల్లడించారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, పోరాట సన్నివేశాలు, స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయని వెల్లడించారు. అంతా బాగానే ఉంది. కానీ బాహుబలి 2లో ఉత్తమ పోరాట సన్నివేశాలను రూపొందించినందుకు గానూ అబ్బాస్ అలీ మొఘల్కు అవార్డు దక్కినట్టుగా ప్రకటించారు. బాహుబలి పోరాటలను రూపొందించింది ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్. కానీ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టరీ ట్విటర్ ఖాతాలో అబ్బాస్ అలీ మొఘల్ అవార్డ్ వచ్చినట్టుగా ట్వీట్ చేశారు. అయితే ఈ అవార్డు ప్రకటనపై చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ...‘అబ్బాస్ అలీ మొఘల్ ఎవరు? అతను బాహుబలి సిరీస్‌లో పనిచేయలేదు’అంటూ ట్వీట్ చేశారు. దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ.. తమ అధికారిక ఖాతాల్లోంచి దానికి సంబంధించిన ట్వీట్‌ను తొలగించారు. -
బాహుబలి నిర్మాతల నుంచి మరో ఫాంటసీ
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. మన మార్కెట్ వంద కోట్లకు కూడా చేరని సమయంలో 250 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. నిర్మాణంతో పాటు ప్రమోషన్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించిన బాహుబలి నిర్మాతలు తెలుగు సినిమా కలెక్షన్ల స్టామినాను నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లారు. అదే ఫార్ములాను తమ నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారు ఆర్కా మీడియా మేకర్స్. బాహుబలి తరువాత తమ బ్యానర్లో మరో భారీ ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు కేయస్ ప్రకాష్ దర్శకత్వంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాను 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. కేవలం 20 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న శర్వా హీరోగా, ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేని ప్రకాష్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసి మరోసారి తమ గట్స్ చూపించారు. గతంలో ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఫాంటసీ సినిమా అనగనగా ఓ ధీరుడు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. -
డబ్బులిస్తారా.. నెట్లో పెట్టమంటారా!
► బాహుబలి నిర్మాతలకే బెదిరింపు ►బ బరి తెగించిన పైరసీ ముఠా ► ఆరుగురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. ఇదీ సినిమా ప్రదర్శితమయ్యే విధానం.. చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాతలు దాన్ని సాఫ్ట్‌కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో నిక్షి ప్తంచేస్తారు. ఈ బ్రాడ్కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్క్రిప్షన్లోకి (కోడ్ లాంగ్వేజ్) మార్చేస్తారు. దీన్ని డీక్రిప్షన్కు (సాధారణ చిత్రరూపం) చేసే ‘కీ’ నిర్మా తలకు అందిస్తారు. ఈ ‘కీ’ని వాడుకునే థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శిస్తాయి. చిన్న లోపం పసిగట్టిన పాత ఉద్యోగి.. బాహుబలి–2 నిర్మాతలు ఆరుగురు బ్రాడ్కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. గతంలో ఈ సంస్థలో మోను అలియాస్ అంకిత్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ను సంప్రదించాడు. అతడి థియేటర్లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్ అనుసంధానించి చిత్రానికి సంబం ధించిన హెచ్డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేశాడు. ఈ కాపీని వినియోగించి వీలున్నంత సంపాదించడానికి పట్నాకు చెందిన చందన్‌కు సమాచారం ఇచ్చాడు. పాత ముఠాతో జతకట్టిన చందన్.. 2015లో విడుదలైన బాహుబలి చిత్రం సైతం పైరసీకి గురైంది. నిర్మాతల ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతాతో పాటు అతడి అనుచరులు జితేందర్‌కుమార్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీల్ని అరెస్టు చేశారు. వీరి ద్వారానే బాహుబలి–2 కాపీని కూడా క్యాష్ చేసుకోవాలని భావించిన చందన్ విషయం వారికి చెప్పాడు. దీంతో రాహుల్ రంగంలోకి దిగాడు. వారానికి రూ.15 లక్షల చొప్పున డిమాండ్.. హైదరాబాద్ వచ్చిన రాహుల్ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్డీ ప్రింట్ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఫిర్యాదును అందుకున్న ఇన్స్పెక్టర్ చాంద్‌భాష నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి మూలాలు కనుగొంది. ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్‌లను అరెస్టు చేశారు. గతంలోనే అనేక సినిమాల పైరసీ ఈ ముఠా అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. ఢిల్లీలో పట్టుకున్న రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీలను న్యాయస్థానం ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసి హైదరాబాద్ వెళ్లి పోలీసుల ఎదుట హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. మిగిలిన ఇద్దరినీ బిహార్ నుంచి తీసుకువస్తున్నాం. పరారీలో ఉన్న మోను కోసం గాలిస్తున్నాం. – అవినాష్ మహంతి, సీసీఎస్ డీసీపీ -
బాహుబలి 2 నిర్మాతకు బెదిరింపు ఈమెయిల్
హైదరాబాద్: భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘బాహుబలి 2’ చరిత్ర సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అయితే బాహుబలి 2ని పైరసీ భూతం వదల్లేదు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు ఓ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. బీహార్ రాజధాని పాట్నా నుంచి ఓపైరసీ గ్యాంగ్ రూ. రెండుకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేకపోతే హెచ్డీ సినిమాని ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తామని బెదిరించింది. అయితే దీనిపై వెంటనే స్పందించిన యార్లగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఫ్టీలో వెళ్లిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. -
‘బాహుబలి’ నిర్మాత సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ఎమిరేట్స్ విమానంలో సిబ్బంది జాతివివక్ష వ్యాఖ్యలు చేయటంతోపాటు అనాగరికంగా వ్యవహరించారని ‘బాహుబలి’ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ(46) ఆరోపించారు. దుబాయ్‌లో బాహుబలి చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తుండగా.. ఎమిరేట్స్ సిబ్బంది తమ బృందంతో వ్యవహరించిన తీరును ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌కు ఎమిరేట్స్ ఈకే526లో వస్తున్నాం. గేట్బీ4 వద్దనున్న విమాన సిబ్బంది మా బృందంతో అనాగరికంగా వ్యవహరించారు. దారుణంగా ప్రవర్తించారు. ఈ సిబ్బందిలో ఒకరికి జాతివివక్ష ఉందని అర్థమైంది. నేను ఎమిరేట్స్‌లో తరచూ ప్రయాణిస్తాను. కానీ ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు’ అని శోభు ట్వీట్ చేశారు. ఆ విమానంలో ప్రయాణించిన బాహుబలి బృందంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, నటులు ప్రభాస్, రానా, అనుష్క ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి సినిమా రేపు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
బాహుబలి లీక్‌పై నిర్మాత క్లారిటీ
ప్రపంచవ్యాప్తంగా భారీ రిలీజ్ కు రెడీ అవుతున్న బాహుబలి 2 సినిమాను పైరసీ భూతం భయపెడుతోంది. సాంకేతికంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా లీకులను మాత్రం అరికట్ట లేకపోతున్నారు. తాజాగా బాహుబలి 2 సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడా షోస్ పడక ముందే ఈ ఫోటోస్ బయటకు రావటంతో సినిమా లీకైంది ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయంపై నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఇంత వరకు బాహుబలి 2కు సంబంధించిన ప్రదర్శనలు మొదలు కాలేదని తెలిపారు. అయితే పలు దేశాల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను ఆయా దేశాల్లో సెన్సార్ సభ్యులకు ప్రదర్శన వేశామని తెలిపారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫోటోలు సెన్సార్ సమయంలో తీసినవే అయి ఉంటాయని భావిస్తున్నారు. Except for screening to various "censor boards" in different countries, there have been no screenings of @BaahubaliMovie 2 till now anywhere — Shobu Yarlagadda (@Shobu_) 26 April 2017 -
‘బాహుబలి’పై ఐటీ దాడులు
-
‘బాహుబలి’పై ఐటీ దాడులు
హైదరాబాద్: బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నట్లు ధృవీకరించే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివరాలను ఆర్కా మీడియా కార్యాలయ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి ఐటీ అధికారులు ఓ బడా సినిమాకు సంబంధించిన నిర్మాతలపై దాడులు నిర్వహించడం టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారం నిర్మాతలు, దర్శకులు, హీరోల్లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో శోభు యార్లగడ్డ ఇక్కడ లేనట్లు సమాచారం. ప్రసాద్ దేవినేని మాత్రం మధ్యాహ్నం వరకు నగరంలో ఉండగా ఐటీ అధికారుల దాడులు తెలుసుకొని ఆయన మకాం మార్చినట్లు తెలుస్తోంది. కాగా ఎంత డబ్బును గుర్తించారు, ఏమేం పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టుబడిన డబ్బు రూ.60 కోట్లని పైకి తెలుస్తున్నా... ఇంకా భారీ మొత్తంలోనే దొరికినట్లు సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యాలయంలో సంచుల కొద్ది డబ్బు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే వారు ఈ దాడులు చేసినట్లు సమాచారం. -
బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయింది
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం బాహుబలి-2 షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మంగళవారంతో బాహుబలి-2 క్లైమాక్స్ పూర్తయినట్లు నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేటితో క్లైమాక్స్ షూటింగ్ పూర్తయిందని శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. భారీ షెడ్యూల్ ముగియడంతో చిత్ర యూనిట్ బ్రేక్ తీసుకోనుంది. తిరిగి సెప్టెంబరు 6 వ తేదీన కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలుగా నటించిన ఈ చిత్రాన్ని 2017 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది తెలియాలంటే 'బాహుబలి ది కంక్లూజన్' విడుదల కావాల్సిందే. Climax of @BaahubaliMovie 2 is completed as scheduled! A well deserved break for the unit till Sept 6th. https://t.co/1txMPyCCOY — Shobu Yarlagadda (@Shobu_) 30 August 2016 -
బాహుబలి విశేషాలు కావాలా..?
తెలుగు సినీ చరిత్ర రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా రెండో భాగం షూటింగ్ ముమ్మరంగా సాగుతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ భాగాన్ని షూట్ చేస్తున్నట్లు నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు. ఈనెల 13 నుంచి 10 వారాల పాటు బాహుబలి రెండో భాగం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా.. అంతా కలిసి అద్భుతంగా ఈ షూటింగ్లో పాల్గొంటున్నారంటూ బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కు సంబంధించిన ఓ ఫొటోను కూడా ట్వీట్ చేశారు. రాజమౌళి, రమారాజమౌళి తదితర బృందం మొత్తం డిజైన్లు రూపొందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. స్నాప్‌చాట్‌లో ఇక మీదట తాము అందుబాటులో ఉంటామని, సినిమాకు సంబంధించిన అన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. తమను ఫాలో అవడం ఎలాగో కూడా ట్విట్టర్లో వెల్లడించారు. తమన్నా కూడా ఇప్పటికే స్నాప్‌చాట్‌లో ఉందని తెలిపారు. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ కోసం జాతీయ అవార్డు విజేత అయిన ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ప్రత్యేకంగా సెట్లను డిజైన్ చేశారు. ఆగస్టు నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, అప్పటినుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా అయితే.. 2017 ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేస్తారు. The most complex & challenging schedule for climax of @BaahubaliMovie has been finally put in place! 10 weeks of madness starting June 13th! — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016 Months of pre-visualisation, action choreography, practice & rehearsals, multiple sets, 100's of props, VFX come together! @BaahubaliMovie — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016 And of course our cast lead by #Prabhas @RanaDaggubati, #Anushka @tamannaahspeaks and our superb crew! Well you get the picture! :) — Shobu Yarlagadda (@Shobu_) 5 June 2016 -
'బాహుబలి'కి అరుదైన గౌరవం
ముంబై: 'బాహుబలి' సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా జరిగే చర్చల్లో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ పాల్గొంటారు. విర్చువల్ రియాలిటీ(వీఆర్) అంశంపై వీరు చర్చలో పాల్గొననున్నారు. వీరితో పాటు రాడియన్ టెక్నాలజీస్ గ్రూపు(ఆర్టీజీ) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజా కోడూరి కూడా అక్కడికి వెళ్లనున్నారు. మే 11 నుంచి మే 22 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. మే 16న 'బాహుబలి' సినిమాను పదర్శించనున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన 'బాహుబలి' బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టడమే కాకుండా ఇటీవల 63వ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కించుకుంది. దీనికి కొనసాగింపుగా 'బాహుబలి 2' తెరకెక్కిస్తున్నారు.