జూబ్లీహిల్స్‌లో ప్రభాస్‌కు 84 ఎకరాల ఫామ్‌హౌస్‌? నిజమనుకుంటున్నారా? | Shobu Yarlagadda Reacts To News About Prabhas 84 Acres Lavish Jubilee Hills Farmhouse | Sakshi
Sakshi News home page

Prabhas: జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల ఫామ్‌హౌస్‌? బాహుబలి నిర్మాత ఏమన్నాడంటే?

Published Fri, Dec 2 2022 5:03 PM | Last Updated on Fri, Dec 2 2022 5:41 PM

Shobu Yarlagadda Reacts To News About Prabhas 84 Acres Lavish Jubilee Hills Farmhouse - Sakshi

సెలబ్రిటీల గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్స్‌ వినిపిస్తూనే ఉంటాయి. కొందరు వాటిని చూసీచూడనట్లు ఊరుకుంటే మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తుంటారు. తాజాగా ప్రభాస్‌ గురించి ఓ వెబ్‌సైట్‌ వార్తను వండివార్చింది. ప్రభాస్‌కు ఓ ఫామ్‌హౌస్‌ ఉందని, అది జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాల్లో విస్తరించి ఉందని పేర్కొంది. అక్కడితో ఆగకుండా కేవలం రూ.1.05 కోట్లకే ఈ ఫామ్‌హౌస్‌ను సొంతం చేసుకున్నట్లు పేర్కొనడం గమనార్హం. అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ 84 ఎకరాల ఫామ్‌హౌస్‌ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉండొచ్చని రాసుకొచ్చింది. దీనికి రాధేశ్యామ్‌లోని ఓ ఫొటోను వాడేసింది.

పాష్‌ ఏరియా అయిన జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు, అది కూడా కేవలం కోటి రూపాయలతో దక్కించుకోవడమేంటని నెటిజన్లు షాకవుతున్నారు. ఈ వార్తపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. 'ఏంటి, నిజమా? అసలు జూబ్లీహిల్స్‌లో 84 ఎకరాలు అంటే దాని విలువెంతుంటుందో మీకేమైనా తెలుసా? ఏదో ఒక చెత్త రాసేసి దానికి ఓ సెలబ్రిటీ పేరును జోడించడం బాగా అలవాటైపోయింది' అని చురకలంటించాడు. అటు డైరెక్టర్‌ మారుతి సైతం 'ప్రభాస్‌ విల్లాకు ఇంకా రాధేశ్యామ్‌ ఇంటీరియర్‌ డిజైనే వాడుతున్నట్లున్నారే?' అంటూ సెటైర్లు వేశాడు.

చదవండి: ఈ సీజన్‌లో అన్నింటికన్నా పరమ చెత్త నిర్ణయం ఇదే
ఓటీటీలో ఊర్వశివో రాక్షసివో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement