ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: సమ్మర్ రోడ్ రేస్ పోటీలు ఈనెల 25వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజి మైదానంలో నిర్వహించనున్నారు. హైదరాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ (ఏసీఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ పరుగులో పురుషులు, మహిళలు, అండర్-16 బాలబాలికల విభాగాల్లో 5 కిలో మీటర్లు, మాస్టర్ పురుషుల, మహిళల విభాగాలతోపాటు అండర్-10, 13 బాలబాలికల విభాగాల్లో 2 కిలో మీటర్ల పోటీలను నిర్వహిస్తారు.
ఆసక్తి గల వారు తమ ఎంట్రీలను అథ్లెటిక్స్ కోచ్ జేవియర్, భూమయ్యలకు పంపాలి. ఇతర వివరాలకు ఏసీఏ కార్యదర్శి డాక్టర్ రాజేష్ కుమార్ (92465-29013)ను సంప్రదించాలి.
25న సమ్మర్ రోడ్ రేస్ పోటీలు
Published Wed, May 21 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM
Advertisement
Advertisement