Khasim
-
ప్రొఫెసర్ ఖాసీం విడుదల
కుషాయిగూడ: విరసం నేత ప్రొఫెసర్ ఖాసీం బుధవారం రాత్రి చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. విడుదలైన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తన అరెస్టు నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టిన వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెలలుగా తనకు సంబం«ధించి వార్తలు ప్రచురించిన వార్తా పత్రికల యాజమాన్యాలకు, ఎడిటర్లకు ధన్యవాదాలు తెలిపారు. యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకొనే టీచర్ అయిన తనను అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అకడమిక్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, ఇకపై పరిశోధన, అధ్యయనంపై దృష్టి సారించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో దళితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అభ్యున్నతి కోసం రచనలు చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబసభ్యులకు అండగా నిలిచిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రొఫెసర్ ఖాసీం అరెస్టు.. గజ్వేల్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సీటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు ముగిశాయి. ఓయూలోని క్వార్టర్స్‌లో ప్రొఫెసర్ ఖాసీం ఇంట్లో దాదాపు 5 గంటలపాటు తనిఖీలు చేసిన పోలీసులు కీలకమైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్‌డిస్కులు, విప్లవ సాహిత్యం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గజ్వేల్‌కు తరలించారు. మవోయిస్టులతో సంబంధాలున్నాయనే అనుమానంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం. గజ్వేల్ ఏసీపీ నారాయణ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారు. ఖాసీం ఇటీవలే విప్లవ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవడం గమనార్హం. అయితే, ప్రొఫెసర్ ఖాసీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు నిర్వహించినుట్టు పోలీసులు చెప్పారు. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో ఖాసీం ఏ-2గా ఉన్నారు. నాడు ఖాసీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్ వారెంట్లతో సోదాలు చేశామని వెల్లడించారు. -
రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ
విశాఖ క్రైం: నగరంలో సంచలనమైన రౌడీషీటర్ మహ్మద్ ఖాసీం హత్య కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆరు కత్తులు, ఒక పిస్టల్, బుల్లెట్స్, స్టీల్ రాడ్‌ను స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేశారు. ఈ నెల 2వ తేదీ(గురువారం రాత్రి) 10.50 గంటల సమయంలో ఎల్ఐసీ భవనం దరి(అంబేడ్కర్ విగ్రహం సమీపంలో) ఖాసీంను చిట్టుమామూతో పాటు మరో ఆరుగురు కత్తులతో నరికి అతి దారుణంగా హత్య చేయడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు మేరుగు చిట్టిబాబు–42(అలియాస్ చిట్టిమామూ), అంబటి మధుసూదనరావు–26(అలియాస్ రుషికొండ మధు), గుడ్ల వినోద్‌కుమార్‌రెడ్డి(26), శీలం సతీష్(23), సయ్యద్ రెహమాన్–24(అలియాస్ మున్నా), చొప్పా హేమంత్‌కుమార్(23), గత్తాడ శ్రీనివాస్(22)లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా వివరించారు. గొడవలే హత్యకు కారణం హత్యకు గురైన ఖాసీం, చిట్టిమామూ మధ్య కొన్నేళ్లుగా గొడవులు ఉన్నాయి. ఆధిపత్యం ఈ ముఠాలు ఘర్షణ పడుతుండేవి. ఖాసీం 2010 నుంచి పలు హత్య కేసుల్లో నిందితుడు. చిట్టిమామూ సోదరుడు, కంచరపాలేనికి చెందిన నగష్‌ను ఖాసీం హత్య చేశాడు. నగరంలో ఖాసీం, బత్తిన మురళీ, చిటిమామూల వర్గాల మధ్య వార్ జరుగుతుండడంతో వీరిపై పీడీ యాక్ట్ పెట్టారు. 2017లో చిట్టిమామూ, బత్తిన మురళీ జైలు నుంచి విడుదలయ్యారు. ఖాసీం ఈ ఏడాది జూన్ 12న బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి చిట్టిమామూ.. ఖాసీంను హతమార్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలో చిట్టిమామూ మూడు నెలల కిందట మధు అనే వ్యక్తి పేరు మీద పాత ఆటో(ఏపీ31టీఏ 7472)ను కొనుగోలు చేశాడు. అనకాపల్లిలో సింగ్‌ల వద్ద కత్తులు కొనుగోలు చేశాడు. జూలై 27, 2018న చిట్టిమామూ.. మధుకు ఒక పిస్టల్, మూడు రౌండ్ల బుల్లెట్లు అందజేశాడు. దీంతో ఖాసీంను హతమార్చేందుకు వ్యూహం రచించారు. ముందుగా ఖాసీం వర్గానికి చెందిన బత్తిన మురళీని గురువారం(ఈనెల 2న) కైలాసపురంలో హత్య చేయడానికి చిట్టిమామూ ముఠా ప్లాన్ చేసింది. అయితే మురళీ చుట్టు పక్కల ఎక్కువ మంది జనాలు ఉండడంతో హత్యకు వీలు కాలేదు. అక్కడి నుంచి వెనుదిరిగిన చిట్టిమామూ ముఠా ఉదయం నుంచే ఖాసీం కదలికలపై రెక్కీ నిర్వహించింది. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఖాసీం డైమండ్ పార్కు సమీపంలోని సాయిరాం పార్లర్ వద్దకు వస్తాడన్న సమాచారంతో ఆర్యకుమార్, శ్యామ్, శ్రీను, వేముల ఆనంద్, పవన్, ప్రసాద్, గాది వెంకటేష్ కాపు కాశారు. అయితే ఖాసీం రాత్రి 10 గంటలకు సాయిరాం పార్లర్ వద్దకు వచ్చాడు. హత్య చేయడానికి ప్రయత్నించినా జనాలు ఎక్కువగా ఉండడంతో అక్కడే కాపు కాశారు. ఖాసీం రాత్రి 10.30 గంటల సమయంలో సాయిరాం పార్లర్ నుంచి ఎల్ఐసీ భవనం మీదుగా డాబాగార్డెన్స్ వైపు హోండాయాక్టివ్(ఏపీ 31 డీఎన్ 8662)పై ఇంటికి వెళ్తున్నాడు. ఆయనను అంబటి మధు, జి.వినోద్‌రెడ్డి పల్సర్–220 మోటార్ బైక్‌పై, ఆటోలో సయ్యద్ రెహమాన్, చొప్పా హేమంత్‌కుమార్, శీలం సతీష్, రాజేష్ వెంబడించారు. రెహమాన్ డ్రైవింగ్ చేశాడు. హోండా యాక్టివ్ సాయి నడుపుతుండగా.. వెనక ఖాసీం కూర్చున్నాడు. ఆటోతో హోండో యాక్టివ్‌ను ఢీకొట్టారు. దీంతో కింద పడిన ఖాసీంను మధు పిస్టోల్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అది పేలకపోవడంతో ఆటోలో ఉన్న వారు కత్తులతో ఖాసీంపై దాడి చేశారు. తల, మెడ, కడుపుపై కత్తులతో బలంగా నరికేశారు. దాంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు రాజేష్ పారిపోయాడు. మిగతా ఐదుగురు, చిట్టిమామూ ఇంటికి వెళ్లారు. ఆ తరువాత ఐదుగురితో పాటు చిట్టిమామూ కలిసి మోటర్ సైకిల్, ఆటోలో ఎన్ఏడీ జంక్షన్‌కు వెళ్లి అక్కడున్న శ్రీనుకు పిస్టోల్ అందజేశారు. కశింకోట వెళ్లి స్నేహితుల వద్ద రూ.10 వేలు తీసుకొని అన్నవరం వెళ్లారు. అన్నవరంలోని బస్టాండ్ రోడ్డు వద్ద ఆటోను వదిలేసి, కాకినాడకు వెళ్లిపోయారు. మరుసటి రోజు 3న కారులో రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లారు. మళ్లీ తిరిగి రాజమండ్రి జొన్నాడకు చేరుకున్నారు. మరో వైపు పోలీసు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఎట్టకేలకు గురువారం సాయంత్రం ఎన్‌హెచ్–16 తాడి గ్రామంలో ఆటోల వెళ్తుండగా అనుమానంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఆటోలో ఉన్న ఆరు కత్తులు, ఒక పిస్టోల్, ఒక స్టీల్ రాడ్, కారంపొడిని స్వాధీనం చేసుకుని, ఆటోను సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్టు సీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. రౌడీయిజం చేస్తే తాటతీస్తా : సీపీ నగరంలో రౌడీయిజం చేస్తే తాటాతీస్తానని సీపీ హెచ్చరించారు. ప్రజలు భయాందోళన చెందనవసరం లేదని, పోలీసులు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చునని చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీ ఫకీరప్ప, ఎస్బీ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఈస్ట్ ఏసీపీ అన్నెపు నర్సింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసిం హత్య’
సాక్షి, విశాఖపట్నం : ఆధిపత్య పోరే రౌడీ షీటర్ ఖాసిం హత్యకు కారణమని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. ఆగస్టు రెండో తేదీన జరిగిన ఈ హత్య కేసును ఛేదించిన సీపీ మహేష్‌చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు.. ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసింను హత్య చేశారని, ఈ హత్యకు ముందు అతని అనుచరుడు బతిన మురళిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని. అయితే అతడు రాకపోయే సరికి మళ్లీ డైమండ్ పార్క్ సాయిరామ్ పార్లర్ వద్ద రెక్కీ నిర్వహించారని, వాహనాలతో వెంబడించి ఖాసింను హతమార్చారని ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులైన మెరుగు చిట్టి బాబు అలియాస్ చిట్టి మాము, అంబటి అంబటి మధుసూదన్ రావు అలియాస్ ఋషికొండ మధు, గుడ్ల వినోద్ కుమార్ రెడ్డి అలియాస్ రామాటాకీస్ వినోద్, శీలం సతీష్, సయ్యద్ రెహాన్ అలియాస్ మున్నా, చొప్పా హేమంత కుమార్, గతడ శ్రీనివాసులు ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఒక పిస్టల్, రెండు రౌండ్ల బుల్లెట్లు, ఆటో, ఆరు పదునైన కత్తులు, ఒక స్టీల్ రాడ్, కారంపోడి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పోలీసుల అదుపులో చిట్టిమాము ముఠా
విశాఖ క్రైం: నగరంలో సంచలనం రేపిన రౌడీషీటర్ ఖాసీం హత్య కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని నగరంలోకి తీసుకొచ్చినట్లు తెలిసింది. హత్యలో ప్రధాన సూత్రధారుడు చిట్టిమాము అని నిర్థారించిన పోలీసులు ఆ ముఠా కదలికలపై దృష్టి సారించారు. ఉభయ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఉన్నట్లు అనుమానించి 6 బృందాలతో విస్తృతంగా గాలించారు. చివరకు విజయవాడలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఆదివారం హత్యలో కీలకమైన ఐదుగురిని అదుపులోకి తీసుకుని నగరానికి తీÜసుకొచ్చినట్లు తెలిసింది. అప్పటి నుంచి వారిని విచారిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు... హత్యలో మొత్తం 14 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వీరిలో ఆరుగురు గురువారం రాత్రి 10.30గంటల సమయంలో ఖాసీంను రోడ్డు మీద కత్తులతో నరికారని, మిగిలిన వారంతా సమీపంలోని తోపుడుబళ్ల వద్ద కాపు కాచారని తెలిసింది. ఆ సమయంలో ఖాసీం తప్పించుకుని ముందుకు వస్తే అక్కడ అంతమొందించేందుకు ముగ్గురు మాటువేశారని, వేరే మార్గంలో తప్పించుకునేందుకు యత్నించినా మట్టుబెట్టేందుకు వీలుగా పక్క రోడ్డులో ముగ్గురు, మరో చోట ఇద్దరు కాపుకాచారని తెలిసింది. చిట్టిమాము సోదరుడితోపాటు అతని ప్రాణ స్నేహితుడు కిరణ్‌ను హతమార్చినప్పటి నుంచి ఖాసీంపై పగ పెంచుకున్నట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. కిరణ్ హత్య తర్వాత అతని భార్య చిట్టిమాముకు ఓ ఫిస్టల్ ఇచ్చిందని, ఖాసీం హత్య రోజు కత్తులతో దాడి చేసినప్పటికీ తప్పించుకుంటే ఆ ఫిస్టల్ వినియోగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ హత్యలో కీలకమైన చిట్టిమాముతోపాటు సీతంపేటకు చెందిన వినోద్, రుషికొండకు చెందిన చిట్టి, షణ్ముక, మధుతో కలిపి మొత్తం ఐదుగురు అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరందరినీ రెండు రోజుల్లో మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా ఆధ్వర్యంలో డీసీపీ ఫకీరప్ప, ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి సారథ్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలతో పాటు పలువురు సిబ్బంది నిందితులను పట్టకోవడంలో కీలకపాత్ర పోషించారు. -
తుపాకీతో బెదిరించి.. కత్తులతో నరికారు
విశాఖ క్రైం/అల్లిపురం/ డాబాగార్డెన్స్: నగరంలో జరుగుతున్న రౌడీ షీటర్ల వరస హత్యలతో ప్రజలు నిర్ఘాంతమైపోతున్నారు. ఏ హత్యకు ఆ హత్య విభిన్న పంథాలో జరుగుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. బైక్‌పై వస్తున్న ఖాసీంను ఆటోతో ఢీకొట్టడం, కింద పడ్డ అతన్ని తుపాకీతో గురిపెట్టి అచేతనంగా ఉంచి కత్తులతో దారుణంగా హత్య చేయడం.. అంతటా చర్చనీయాంశమైంది. విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకే ఇలాంటి నేర సంస్కృతి.. ప్రశాంత విశాఖలో పురి విప్పడంతో నగర ప్రజల్లో భయాందోళన నెలకొంది. రౌడీషీటర్ మహ్మద్ ఖాసీంను గురువారం రాత్రి 10 గంటల సమయంలో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బైక్‌పై డైమండ్ పార్క్ నుంచి ఎల్ఐసీ బిల్డింగ్ మీదుగా ఖాసీం ఇంటికి వెళ్తున్నాడు. వెనుక ఆటోలో కత్తులతో వస్తున్న ప్రత్యర్థులు ఎల్ఐసీ భవనం ఎదురుగా బైక్‌ను ఢీ కొట్టారు. ఖాసీం బైక్‌పై నుంచి పడిపోయాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి తుపాకీ తీసి ఖాసీం తలపై గురిపెట్టాడని, ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు కత్తులతో అతనిపై దాడి చేశారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఖాసీంను తుపాకీతో గురిపెట్టిన వ్యక్తి చిట్టిమాముగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ పిస్టల్ ఎవరిదనే కోణంలో విచారణ చేపడుతున్నారు. కమిషనర్ లడ్డా ఆదేశాల మేరకు టూటౌన్, ఎంఆర్పేట పరిధిలో రౌడీ షీటర్లను తెల్లవారుజామున ఆరు గంటలకే స్టేషన్లకు తరలించారు. వారు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఖాసీం హత్య కేసులో అనుమానితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రధానంగా చిట్టిమాము, రుషికొండ మధు, రామాటాకీస్ మధు, టెక్కం లక్ష్మణ, షణ్ముఖ్, చలువతోట మధు, కల్యాణ్‌లతో పాటు మరికొంత మంది పేర్లు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఘటన అనంతరం చిట్టిమాముతో పాటు అతని భార్య కూడా కనిపించకపోవడంతో..ఈ కేసులో చిట్టిమాము పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఖాసీం పోస్టుమార్టం సమయంలో అతని అనుచరుడు మురళీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాతకక్షలే కారణమని అనుమానం ఖాసీం హత్య కేసులో పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఖాసీం మేనల్లుడు తెలుగు అనిల్. అతని హత్య కేసులో ప్రధాన నిందితుడు పొడుగు కిరణ్ గ్యాంగ్‌కు, ఖాసీం గ్యాంగ్‌కు మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. పొడుగు కిరణ్‌పై రెండు సార్లు దాడులు జరగడం, కిరణ్ జైల్లోనే ఆత్మహత్య చేసుకోవడం తదితర ఘటనలు చేసుకున్నాయి. మరో వైపు చిట్టి మాము తమ్ముడు హత్య కేసులో ఖాసీం ఒకడు. వన్‌టౌన్‌లో 1992లో జరిగిన హత్య కేసులో నిందితుడు ఖాసీం. కప్పరాడలో జరిగిన జంట హత్య కేసులో చిట్టిమాము తమ్ముడిని ఖాసీం హత్య చేశారు. జిల్లా పరిషత్‌లో లచ్చా అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో కూడా ఖాసీం నిందితుడు. ఈ నేపథ్యంలో పొడుగు కిరణ్ వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న చిట్టిమాము, అతని అనుచరులు ఖాసీం పట్ల గుర్రుగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారు గురువారం రాత్రి ఒంటరిగా దొరికిన ఖాసీంపై దాడికి పాల్పడి మట్టుబెట్టారు. హత్య అనంతరం వారంతా పరారయ్యారు. నిందితుల కోసం మూడు బృందాలు.. ఖాసీం హత్య కేసులో దర్యాప్తు కోసం మూడు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో విచారణ చేపడుతున్నాయి. ఖాసీం హత్య కేసును పోలీస్ కమిషనర్ లడ్డా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖాసీం మృతదేహానికి పోస్ట్‌మార్టం ఖాసీం మృతదేహానికి శుక్రవారం కేజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఖాసీం మద్దతుదారులు అధిక సంఖ్యలో మార్చురీకి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా హడావుడిగా మారింది. శాంతి భద్రతల సమస్య రాకుండా పోలీసులు ముందుగానే మార్చురీ చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్చురీ పరిసర ప్రాంతాల్లో గుంపుగా ఉన్న యువకులను చెల్లా చెదురు చేశారు. ప్రధాన గేట్ల వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమతి లేనిదే ఎవర్నీ లోపలికి పంపలేదు. అనుమానం వచ్చిన వారిని గేట్ అవతలే ఉంచారు. గుర్తింపు కార్డు చూసి ఉద్యోగులను వదిలారు. అలాగే క్యాజువాల్టీ వద్ద పోలీసులు మొహరించారు. ఏవీఎన్ కాలేజ్ డౌన్రోడ్డులోని గేట్‌ను మూసివేశారు. అడుగడుగునా పోలీసులు ఉండడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఆందోళనకు గురయ్యారు. -
గూడూరు జెడ్పీటీసీని సస్పెండ్ చేస్తూ జీవో జారీ
హన్మకొండ : జిల్లాలోని గూడూరు మండలం జెడ్పీటీసీ సభ్యుడు ఖాసింను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గురువారం ప్రభుత్వం జీఓ జారీ చేసింది. జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ విషయంలో ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ వాకాటి కరుణకు పంపిన నివేదిక ఆధారంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జూలై 27వ తేదీన జెడ్పీటీసీ సభ్యుడిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు. ఈ జీఓ జారీ కావడంతో జెడ్పీ టీసీ సభ్యుడిగా ఖాసింను పదవీ నుంచి సస్పెండ్ అయినట్లు సమాచారం.