విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అరెస్టైన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది.