romila Thapar
-
వరవరరావును తక్షణమే ఆస్పత్రికి తరలించండి
ముంబై: బీమా కోరేగావ్ కేసులో అరెస్టై విచారణ ఖైదీగా నిర్బంధంలో ఉన్న విప్లవ కవి పి.వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్ సహా పలువురు ఆక్టివిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారేలా వ్యవహరించడం సరికాదని.. ఓ వ్యక్తిని అలా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టమని ఏ చట్టం చెప్పదని పేర్కొన్నారు. ఇది ఎన్కౌంటర్ కంటే తక్కువేమీ కాదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ మేరకు రొమిలా థాపర్, ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్, దేవకీ జైన్, సోషలిస్టు సతీశ్ దేశ్‌పాండే, మానవ హక్కుల కార్యకర్త మజా దారూవాలా మహా సర్కారు, జాతీయ దర్యాప్తు సంస్థకు లేఖ రాశారు. ‘‘అన్నీ తెలిసి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఓ వ్యక్తికి వైద్య చికిత్స అందించేందుకు నిరాకరించి.. ఆ వ్యక్తి ప్రాణాలకు హాని కలిగేలా వ్యవహరించడం ఎన్‌కౌంటర్‌కు మరో రూపంలా పరిణమిస్తుంది. కాబట్టి పి. వరవరరావుకు తక్షణమే సరైన చికిత్స అందేలా భారత రాష్ట్రం చర్యలు తీసుకోవాలి. గత 22 నెలలుగా వరవరరావు విచారణకు అన్ని విధాలులగా సహకరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఆరోగ్యం మరింత క్షీణించేలా పరిస్థితులను కల్పించమని చట్టంలో లేదు’’ అని పేర్కొన్నారు. అదే విధంగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం ఆయనకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్రలోని పుణేలో గత ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు ఆయనను తరలించారు. ఈ నేపథ్యంలో విచారణ ఖైదీగా ఉన్న వరవరరావుతో జైలు అధికారులు తనతో ఫోన్లో మాట్లాడించారని, వీవీ మాట్లాడిన తీరు పొంతన లేకుండా ఉందని, మాట మొద్దు బారిపోయిందని ఆయన సహచరి హేమలత ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయనను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాలని కుటుంబసభ్యులతో పాటు హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. వరవరరావుకు వెంటనే బెయిలు మంజూరు చేసి ఆయనకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.(జైలులోనే చంపుతారా?) -
‘అర్బన్ నక్సల్’ అంటే ఏంటి?: రొమిలా థాపర్
న్యూఢిల్లీ: ‘అర్బన్ నక్సల్’ అనే మాటకు అర్థం ఏమిటో చెప్పాలని ప్రముఖ చరిత్రకారిణి రొమిలా థాపర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనతోపాటు తనవంటి కార్యకర్తలకు ఆ మాటకు నిర్వచనం తెలియదని అన్నారు. వామపక్ష అనుకూల కార్యకర్తల గృహ నిర్బంధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో థాపర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘అర్బన్ నక్సల్ అని పిలవడం తేలికైపోయింది. అర్బన్ నక్సల్స్ అంటే వారికి అర్థం తెలుసా? ముందుగా ప్రభుత్వాన్ని ఆ మాటకు అర్థం చెప్పమనండి. ఆ కేటగిరీలో మేమెలా ఉంటామో, అర్బన్ నక్సల్స్ ఎలా అయ్యామో చెప్పమనండి. అర్బన్ నక్సల్ నిర్వచనం ప్రభుత్వానికీ తెలియదా లేదా మాకు అర్థం కాలేదా చెప్పమనండి’ అని అన్నారు. సమాజంలో మంచి కోసం పోరాడుతున్న వారికి అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టటం వెనుక రాజకీయ కారణాలున్నాయని ఆమె ఆరోపించారు. -
‘కోరెగావ్’ పై పోలీసుల భిన్న స్వరాలు
సాక్షి, న్యూఢిల్లీ : భీమా కోరెగావ్ కేసులో ‘అర్బన్ మావోయిస్టులు’ అంటూ ఐదుగురు సామాజిక కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్, మరో నలుగురు ప్రముఖులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు బుధవారం నాడు విచారణ ప్రారంభించింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పుణె పోలీసులు రెండు పరస్పర భిన్నంగా దాఖలు చేసిన అఫిడవిట్లపై కూడా సుప్రీం కోర్టు విచారణ కొనసాగనుంది. కోరెగావ్ కేసులో హైదరాబాద్‌లో వరవర రావుతోపాటు దేశవ్యాప్తంగా మరో నలుగురు సామాజిక కార్యకర్తలను ఆగస్టు 28వ తేదీన పుణె పోలీసులు అరెస్ట్ చేయడం, రొమిల్లా థాపర్ నాయకత్వాన ప్రజాహిత పిటిషన్‌ను దాఖలు చేయడం, దానికి స్పందించి సెప్టెంబర్ మూడవ తేదీన పుణె పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేయడం తదితర పరిణామాలు తెల్సినవే. ఆ అఫిడవిట్ ప్రకారం భీమా కోరెగావ్ గ్రామానికి సరిగ్గా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుణె నగరంలో ఎల్గార్ పరిషద్ పేరిట గతేడాది డిసెంబర్ 31వ తేదీన బహిరంగ సభ జరిగింది. ఆ సభను నిర్వహించిన నిషేధిత సీపీఐ (మావోయిస్టు) కార్యకర్తలు దళితులను రెచ్చగొట్టారు. ఫలితంగా ఆ మరుసటి రోజు అంటే జనవరి 1వ తేదీన భీమా కోరెగావ్ గ్రామంలో అల్లర్లు చెలరేగాయి. అందులో ఒకరు మరణించగా, అనేక మంది గాయపడ్డారు. కోట్లాది రూపాయ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఆ నాడు దళితులను రెచ్చగొడుతూ ప్రసంగించారన్న కారణంగానే వరవర రావు సహా ఐదుగురు సామాజిక కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజు ప్రజాహిత వ్యాజ్యం కారణంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని నిందితులను అరెస్ట్ చేయడానికి వీల్లేదని, వారిని గృహ నిర్బంధానికి పరిమితం చేయాల్సిందిగా ఆదేశించింది. దేశంలోని దాదాపు 250 దళిత సంఘాలను ఏకతాటిపైకి తీసుకరావాలనే లక్ష్యంతో ఎల్గార్ పరిషద్ ఏర్పాటయింది. ఆ రోజు ఎల్గార్ పరిషద్ పేరిటనే బహిరంగ సభ జరిగినప్పటికీ సభ నిర్వహణలో కీలక పాత్ర వహించినదీ ఓ మాజీ సుప్రీం కోర్టు జడ్జీ, మరో మాజీ హైకోర్టు చీఫ్ జడ్జీలు. ఈ విషయాన్ని వారే (బీజీ కోస్లే–పాటిల్, పీబీ సావంత్‌లు) స్వయంగా చెప్పడంతోపాటు సభ నిర్వహణకు అరెస్టైన సమాజిక కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు చెప్పారు. పుణె పోలీసులు భీమా కోరెగావ్ కేసులో రెండో అఫిడవిట్ దాఖలు చేయడానికి ఆరు నెలల ముందు ఫిబ్రవరి 13వ తేదీన మొదటి అఫిడవిట్‌ను దాఖలు చేశారు. అందులో హిందూ అఘాది సంస్థ నాయకుడు మిలింద్ ఎక్బోటే అల్లర్లకు ప్రధాన కారకుడని ఆరోపించారు. ‘ఎక్బోటో అల్లర్లను సృష్టించేందుకు నేరపూరిత కుట్ర పన్నారని మా దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఆయన కర పత్రాలను పంచడం ద్వారా కలసిమెలసి ఉంటున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టారు. చట్టాన్ని ఉల్లంఘించి, అల్లర్లలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమయ్యాయి’ అని ఆ అఫిడవిట్లో పోలీసులు పేర్కొన్నారు. దళితులు నమ్ముతున్న భీమా కోరెగావ్ చరిత్రను వక్రీకరిస్తూ ఎక్బోటే కరపత్రాలను పంచారని, ఆయన అనుచరులు ఫేస్బుక్ ద్వారా అల్లర్లకు ఆజ్యం పోశారని పుణె డిప్యూటీ మేయర్ సిద్ధార్ట్ ధిండే కూడా ఆరోపించారు. మొదటి అఫిడవిట్లో మిలింద్ ఎక్బోటేనే అల్లర్లకు ముఖ్య కారకుడని పోలీసులు పేర్కొన్నప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితుడవడం వల్ల ఆయన్ని అరెస్ట్ చేయడానికి వారు సాహసించలేక పోయారు. ఆర్నెళ్లలో కథ పూర్తిగా మారిపోయింది. పోలీసులు రెండో అఫిడవిట్ దాఖలు చేశారు. మొదటి అఫిడవిట్లో నిందితులు హిందూ సంస్థ నాయకులు కాగా, రెండో అఫిడవిట్లో అర్బన్ మావోయిస్టులు నిందితులుగా మారారు. పరస్పర భిన్నమైన ఈ అఫిడవిట్లపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో, పోలీసులు ఎలా సమర్థించుకుంటారో చూడాలి. -
వరవరరావుకు గృహనిర్బంధం..
న్యూఢిల్లీ: భీమా–కోరేగావ్ హింస కేసులో అరెస్టయిన ఐదుగురు మానవహక్కుల కార్యకర్తలకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. అరెస్టు చేసిన వారిని సెప్టెంబర్ 6 వరకు గృహనిర్బంధంలో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఆదేశించింది. భిన్నాభిప్రాయాన్ని వెల్లడించడం ప్రజాస్వామ్యంలో భాగమని, దీన్ని అణగదొక్కడం సరికాదని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 6కు వాయిదా వేసింది. భీమా–కోరేగావ్ హింస జరిగిన 9 నెలల తర్వాత వీరిని అరెస్టు చేయడంపై మహారాష్ట్ర పోలీసులను ప్రశ్నించింది. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు సభ్యులుగా ఉన్న ధర్మాసనం పేర్కొంది. ‘ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు సేఫ్టీ వాల్వ్ వంటిది. దీన్ని మీరు అణచాలని చూస్తే ఎప్పుడో ఓసారి అది బద్దలవుతుంది’ అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ అరెస్టులను ఖండిస్తూ.. చరిత్రకారురాలు రోమిలా థాపర్, ప్రభాత్ పట్నాయక్, దేవికా జైన్ సహా ఐదుగురు వేసిన పిటిషన్ ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కాగా, నవలఖా అరెస్టుపై ఇచ్చిన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా సరైన ఆధారాలు చూపకుండానే నవలఖాను ఎలా అరెస్టు చేశారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అటు ఎన్‌హెచ్చార్సీ కూడా ఈ అరెస్టులపై వివరణ ఇవ్వాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అరెస్టు చేసిన వారందరినీ వారి ఇళ్లకు పంపించాలని పుణే కోర్టు ఆ రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. కోర్టుకు మహా విన్నపం అరెస్టయిన ఐదుగురిని విడుదల చేయాలంటూ దాఖలయ్యే పిటిషన్లను విచారణకు అంగీకరించవద్దని మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇప్పటికే పలువురు ఈ అంశంపై వివిధ హైకోర్టులను ఆశ్రయించిన నేపథ్యంలో మహా సర్కారు ఈ అంశాన్ని లేవనెత్తింది. హైదరాబాద్ నుంచి వరవరరావు, ముంబై నుంచి అరున్ ఫెరీరా, వెర్నాన్ గంజాల్వేస్, హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి సుధా భరద్వాజ్, ఢిల్లీ నుంచి గౌతమ్ నవలఖాలను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. డిసెంబర్ 31న భీమా–కోరేగావ్ గ్రామంలో జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ సభ కారణంగానే దళితులు, అగ్రవర్ణాల మధ్య హింస ప్రజ్వరిల్లిందనే కేసులో ఈ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నవలఖా అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు.. హక్కుల కార్యకర్త నవలఖా అరెస్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేసుకు సంబంధించిన దస్తావేజులను మరాఠీలోనే ఉంచడాన్ని ప్రశ్నించింది. ‘తననెందుకు అరెస్టు చేస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటప్పుడు అరెస్టు పేపర్లను ఇంగ్లిషులోకి తర్జుమా చేసి నవలఖాకు ఎందుకు ఇవ్వలేదు?’ అని కూడా ప్రశ్నించింది. దస్తావేజులు వేరే భాషలో ఉన్నప్పటికీ మెజిస్టీరియల్ కోర్టు ట్రాన్సిట్ రిమాండ్ ఎలా జారీ చేసిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసు దస్తావేజులను వెంటనే ఇంగ్లిష్‌లోకి మార్చాలని కోర్టు ఆదేశించింది. నవలఖా అరెస్టులో న్యాయపరమైన అంశాలు, పుణే కోర్టుకు తీసుకెళ్లేందుకు అవసరమైన ట్రాన్సిట్ రిమాండ్‌ను పరిశీలిస్తామని పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా చదివిన తర్వాతే ఈ దిశగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. భీమా–కోరేగావ్ వివాదానికి సంబంధించి మిగిలిన అరెస్టులు సరైనవే అని వెల్లడైతే.. నవలఖా విషయంలోనూ స్పష్టత వస్తుందని కోర్టు పేర్కొంది. కాగా, మరాఠీలో ఉన్న పత్రాలను ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసి నవలఖా లాయర్లకు ఇస్తామని మహారాష్ట్ర పోలీసుల తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖీ కోర్టుకు తెలిపారు. ప్రజాగొంతుక నొక్కేస్తున్నారు: అంబేడ్కర్ ప్రజల గొంతుకను నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. భారతీయ రిపబ్లిక్ పార్టీ బహుజన్ మహాసంఘ్ నేత ప్రకాశ్ అంబేడ్కర్ ఆరోపించారు. వామపక్ష భావజాలమున్న నేతలను అరెస్టు చేయడం.. ప్రజల గొంతుకను నొక్కడమేనన్నారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్న ఎన్జీవోలు, రాజకీయేతర సంస్థలు లక్ష్యంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన ముంబైలో విమర్శించారు. సనాతన్ సంస్థపై దాడులు జరుగుతున్న సమయంలో కావాలనే ఎల్గార్ పరిషత్ సభ్యులపైనా దాడులు నిర్వహిస్తున్నారన్నారు. అటు శివసేన కూడా భీమా–కోరేగావ్ హింసకు అసలైన సూత్రధారులను ఇంకా అరెస్టు చేయకపోవడం దారుణమని పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాన్ని అంటగడుతూ అరెస్టులు జరిపే సంస్కృతి దేశవ్యాప్తంగా జరుగుతోందని విమర్శించింది. భారతీయ శిక్షాస్మృతి 153 (ఏ) కింద (మతం, జాతి, పుట్టిన ప్రాంతం, భాష ఆధారంగా వివిధ వర్గాల మధ్య శతృత్వాన్ని పెంచేలా వ్యాఖ్యానించడం) ఐదుగురిని పుణే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, అరెస్టులకు ముందు చట్టపరమైన అన్ని నిబంధనలు అమలుచేశామని మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దీపక్ సర్కార్ తెలిపారు. అన్ని ఆధారాలు ఉన్నందునే అరెస్టులు జరిగాయన్నారు. -
జైలు కాదు.. గృహ నిర్బంధం చాలు..
-
పౌరహక్కుల నేతల అరెస్ట్; సుప్రీం కీలక వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ : విరసం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతల అరెస్ట్‌లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. అరెస్టైన ఐదుగురు మానవ హక్కుల కార్యకర్తలందరిని సెప్టెంబరు 5 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలని ఆదేశించింది. వరవరరావు సహా మిగతా నలుగురిని తమ తమ సొంత ఇళ్లలోనే ఉండనివ్వాలని, బయటికి వెళ్లకుండా నిరోధించాలని పేర్కొంది. ఈ సందర్భంగా.. అసంతృప్తి అనేది ప్రజాస్వామ్యానికి సేఫ్టీ వాల్వ్ వంటిదని సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను సెప్టెంబరు 6కు వాయిదా వేసింది. కాగా పౌరహక్కుల నేతల అరెస్ట్‌ను ఖండిస్తూ.. ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్‌తోపాటు మరో నలుగురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఐదుగురిపై తప్పుడు చార్జిషీట్లు మోపారని.. దీనిపై స్వతంత్ర విచారణ చేపట్టాలని పిటిషన్లో పేర్కొన్నారు. వారందరిని వెంటనే విడుదల చేయాలని పిటిషన్లో కోరారు. గతేడాది డిసెంబర్ 31న పుణెకి సమీపంలోని భీమా కోరెగావ్ గ్రామంలో దళితులు, ఉన్నత వర్గమైన పీష్వాలకు మధ్య చోటుచేసుకున్న హింస కేసు దర్యాప్తులో భాగంగా పుణె పోలీసులు మంగళవారం ఉదయం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో విరసం నేత వరవరరావు, ముంబైలో హక్కుల కార్యకర్తలు వెర్నన్ గొంజాల్వెజ్, అరుణ్ ఫెరీరా, ఫరీదాబాద్‌లో ట్రేడ్ యూనియన్ కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్, ఢిల్లీలో పౌర హక్కుల కార్యకర్త గౌతం నవలఖాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
జాతీయవాద నిర్వచనానికి ముప్పు: రోమిలా థాపర్
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వివాదం నేపథ్యంలో జాతీయవాదంపై జరుగుతున్న చర్చలో జాతీయవాదానికి ఉన్న నిర్వచనాన్ని మసకబార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రముఖ చరిత్రకారులు రోమిలా థాపర్ ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గత చరిత్రపై ఆధారపడిఉండదని, అది విశ్వసించదగిన చరిత్రపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. జేఎన్‌యూలో చరిత్ర-జాతీయవాదంపై జరిగిన చర్చలో ఆమె విద్యార్థుల నుంచి ప్రసంగించారు. చరిత్ర, జాతీయవాదానికి మధ్య ఉన్న సంబంధంపై చర్చకు విశ్వవిద్యాలయాలే సరైన వేదికలని పేర్కొన్నారు. జాతీయవాదమనేది ఏ ఒక్కరి గుర్తింపుపై ఆధారపడి ఉండదని, అది అందరిపై ఆధారపడి ఉంటుందన్నారు. -
ఛాందసవాదుల తిరోగమనం!
ఎమర్జెన్సీని, 1984లో సిక్కులపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీసుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది. ‘దేశంలో మతపరమైన ఒంటెత్తు పోకడ విధానానికి సంస్కృతి గురించి ఏర్పరుచుకున్న కృత్రిమమైన వేర్పాటు ధోరణితో సంబంధముంది. ఈ సంకరమైన వంకర వైఖరికి సమాధానం యావత్తు భారతదేశం అందరి దీనన్న భావన దీప్తిమంతం కావడమే.’ భారతదేశంలో సాంస్కృతిక వేర్పాటువాదం, మతపరమైన ఒంటెత్తు పోకడల గురించి కలతపడిన విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ చెప్పిన మాట.బీజేపీ, ఆరెస్సెస్, ఎన్డీఏ హయాంలో ఇటీవలి కాలంలో దేశంలో పలు చోట్ల జరుగుతున్న పరిణామాల పట్ల సంస్కృతీ పరమైన వైవిధ్యం, భిన్న దృక్పథాలు కలిగిన శక్తులు ఆందోళన చెందుతున్నాయి. భిన్న సంస్కృతు లతో, విశ్వాసాలతో, బడుగు బలహీన వర్గాలతో, జాతీయ మైనారిటీలతో, విభిన్న భాషలతో ఇంద్రధనుస్సులా విలసిల్లే ‘ఇండియా, దటీజ్ భారత్’లో ఇవాళ ఇంతగా ప్రజలు ఆందోళనకు గురికావలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందో పాలకులు అర్థం చేసుకోవాలని రాష్ట్రపతి వరసగా ప్రకటనలు విజ్ఞా పనలు ఎందుకు చేయవలసి వచ్చింది? వెంటనే యోచించాలి ఈ అంశాన్ని కాలహరణం లేకుండా అందరూ గుర్తించాలి. దేశవ్యాప్తంగా పాలకపక్షాలు, లేదా రహస్యంగా పనిచేసే వాటి అనుబంధ సంస్థలు సమా జంలో కృత్రిమంగా అనేక రూపాలలో సృష్టిస్తున్న అలజడులనూ, సాగిస్తున్న హత్యాకాండనూ గమనిస్తున్న రచయితలు, కవులు, చరిత్రకారులు, సామా జిక శాస్త్రవేత్తలు, కళాకారులు, నటులు, చిత్రకారులు, ప్రొఫెసర్లు, ఆర్థిక వేత్తలు ఎన్నడూ లేని స్థాయిలో ఎందుకు తమ బిరుదులను త్యాగం చేయ వలసి వచ్చిందో కూడా పాలకులు గమనించాలి. 250 మందికి పైగా మేధా వులు దశలవారీగానే అయినా, పెద్ద ఎత్తున దేశ అత్యున్నత పురస్కారాలను, అకాడమీ పురస్కారాలను తిప్పి పంపడం స్వతంత్ర భారత రాజకీయ, సాంస్కృతిక చరిత్రలోనే బాధాకరమైన పరిణామం. 1919లో జలియన్ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్య్ర సమర యోధుల మీద జనరల్ డయ్యర్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినందుకు రవీంద్రనాథ్ టాగూర్ వంటి మహోన్నతులు తమకు ఉన్న బిరుదులను బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ముఖాన కొట్టవలసి వచ్చింది. స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలను బీజేపీ-ఎన్డీఏ పాలకులు హరించి వేసే క్రమంలో ఈ బిరుదులను మేధావులు ప్రభుత్వానికి నిరసనగా వాపసు చేయడం ఇదే మొదటిసారి. ఇందుకు దోహదం చేసిన పూర్వరంగం ఎలాం టిది? ప్రగతివాదులు, ఆయా రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన హేతువాదులైన రచయితలు, ప్రసిద్ధ సామాజిక కార్యకర్తలు, సామాజిక దురన్యాయాల పట్ల ధ్వజమెత్తిన చైతన్య మూర్తులు దభోల్కర్, పన్సారే (మహారాష్ట్ర), కల్బుర్గీ (కర్ణాటక)లను 2014-15 మధ్యకాలంలో బీజేపీ పాలనలో ‘గుర్తు తెలియని’ వ్యక్తులు మట్టుపెట్టారు. ఈ దుర్ఘటనలకు ప్రధానమంత్రి సహా, పలువురు మంత్రులు చెప్పవలసిన రీతిలో ఆత్మీయంగా క్షమాపణలు తెలిపి, హంతకు లను శిక్షించకపోవడం ఒక వైపు జరుగుతూ ఉండగా, మరో వైపు రకరకాల వ్యంగ్యార్థాలతో భాష్యాలు చెప్పడమో, సీబీఐ విచారణ తతంగం పేరిట కేసులు ఒక కొలిక్కి రాకుండా కాలయాపన చేయడం జరుగుతోంది. లేదా కంటితుడుపుగా ఎవరో ఒకరిని ‘బుక్’ చేయడం జరుగుతోంది. ఎక్కడైనా ఇలాంటి చర్యలు గర్హనీయమే ఇలాంటి కిరాకత చర్యలకు పాకిస్తాన్లో మలాలా వంటి వారినీ, బంగ్లాదేశ్‌లో తస్లీమా నస్రీన్ వంటి భిన్నాభిప్రాయాలు ప్రకటించేవారిని, సెక్యులర్ భావా లతో పుస్తకాలు ప్రచురించిన అరిఫీన్ దీవన్, అహ్మదూర్ రషీద్ టూతుల్ వంటి వారిని హతమార్చే ప్రయత్నం జరిగినా కూడా ఖండించవలసిందే. భావ ప్రకటనా స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని హరించడానికి పాలకులు ఎక్కడ కుట్ర పన్నినా నిరసించవలసిందే. దేశాభివృద్ధి ధ్యేయమన్న నినాదంతో ఊదరగొట్టి ఓట్లు దండుకున్న మోదీ బృందం అధికారం సాధించిన తరువాత తమ ఎజెండా రూపురేఖలను మార్చుకోవడాన్ని దేశ ప్రజలు గమనిస్తు న్నారు. చివరికి వాణిజ్య, పరిశ్రమల వ్యవహారాల మీద ప్రధాని సలహా మండలి సభ్యుడు, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సయితం ‘ఈ రోజున దేశంలోని మైనారిటీలలో భయాందోళనలు నెలకొన్నాయ’ని ప్రకటించవలసిరావడం గమనించాలి. ఈ విపరిణామం ఎంతవరకు పోయిందంటే, మూడీస్ , స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ గుత్త మదింపు సంస్థలు ఆరెస్సెస్, బీజేపీ పాలకులను తీవ్ర పదజాలంతో హెచ్చ రించవలసి వచ్చింది. ఇప్పుడు దేశంలో జాతీయ మైనారిటీలలో అభద్రతా భావం పెరిగిపోతోంది. భారతీయ జనతా పార్టీలోని వ్యక్తుల నుంచి, సభ్యుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలను వింటున్నాం. ఈ పరిస్థితులలో తన పార్టీ సభ్యులను అదుపు చేయనైనా చేసుకోవాలి, లేదా అటు దేశంలోనూ ఇటు ప్రపంచ వ్యాపితంగానూ పరువు ప్రతిష్టలను కోల్పోవలసి వస్తుంద’ని ‘మూడీస్’ రేటింగ్ సంస్థ హెచ్చరించింది! ఈ హెచ్చరిక (అక్టోబర్ 30) రెండు రోజులకే బీజేపీ మాతృసంస్థలలో ఒకటైన ఆర్ఎస్ఎస్ ‘అఖిల భారతీయ కార్యకారిణి మండల్’ రాంచీ సమావేశంలో ప్రసిద్ధ కర్ణాటక రచయిత కల్బుర్గి హత్య పట్ల ఇన్ని రోజుల తరవాత సంతాపం ప్రకటించటం ఒక వింత! అంత కన్నా పెద్ద జోకు - తనకన్నా ‘ఛాందసవర్గం’ వేరే ఎవరో ఉన్నట్టుగా ఒకే తానులోని పీలికలుగా ‘స్టాండ్ బై’గా పెంచుతూ వచ్చిన చిల్లర మల్లర గ్రూపు లుగా ఉంటూ ‘హిందూత్వ’ పేరిట, ‘వైదిక సంస్కృతి’ పేరిట చెలామణి కావ డానికి ప్రయత్నిస్తున్న సంస్థల్ని ‘ఛాందస వర్గీయులు’గా పేర్కొనడం విశేషం. కొందరు వేదాల్ని గురించి, సంస్కృతం గురించి, పురాణ కాలపు సంస్కృతి గురించి తరచుగా ప్రస్తావనలు చేస్తున్నారు. నిజానికి భారతీయ భావనా స్రవంతిలో, సంస్కృతిలో భౌతికవాదం, హేతువాదం కూడా అంతర్భాగంగా కొనసాగాయని మూఢమతులు గుర్తించాలి. ‘హిందూ మెటీరియలిజం’ గ్రంథంలో సుప్రసిద్ధ తాత్వికులు, సామాజిక ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ కెబీ కృష్ణ ఈ విషయాన్ని సహేతుకంగా నిరూపించారు: బుద్ధుడు వర్ణవ్యవస్థను ఖండిం చి, విగ్రహారాధనను నిరసించి, కులవ్యవస్థపై ఆధారపడే సమాజానికి విరు ద్ధంగా వృత్తులపై ఆధారపడే సమాజాన్ని పెంచిపోషించిన మహనీయుడని స్వామి వివేకానంద నివాళులర్పించాడు! బ్రాహ్మణ్యం నుంచి దూసుకు వచ్చిన మహాకవి అశ్వఘోషుడు కులవ్యవస్థపై ప్రత్యక్ష దాడికి దిగిన భౌతిక, హేతువాది. ఆ మాటకొస్తే రుగ్వేద కాలం నాటికే చైతన్యవంతమైన భారతీయ భౌతికవాదం వెలుగు చూసిందని అదే వేదంలోని ‘నాసదీయ సూక్తం’ (రుగ్వే దం: మండలం 10, సూక్తం 129) ఛాందస వర్గాలు సహా నేటి మనం కూడా మరవరాని జిజ్ఞాసను రేకెత్తించే ఒక మహాసత్యాన్ని రెండే రెండు ప్రశ్నలు సంధించడం ద్వారా ప్రకటించింది: 1. ‘భగవంతుడే ఈ సృష్టికి మూలమా?’ 2. ‘ఇదే నిజమైతే ఈ సృష్టి జరిగిన తర్వాత వచ్చిన ‘భగవంతుడి’కి ఈ సృష్టి ఎలా జరిగిందో తెలుసా?’ ఈ రెండు ప్రశ్నల ‘నాసదీయ సూక్తం’ చెప్పిన సమాధానం 2,500 సంవత్సరాల తర్వాత కూడా మందబుద్ధులకు సమాధానంగా మిగిలిపో యింది: ‘సృష్టి జరిగిన తరవాత వచ్చిన వాడు భగవంతుడు కాబట్టి అతను సృష్టికర్త కాడు, కాజాలడు’ అని తెగేసి చెప్పింది ఆసూక్తం! అంటే సృష్టి రహ స్యం జీవరసాయన క్రియ, ప్రతిక్రియల్లో ఉందన్నమాట! భగవంతుడి గురిం చిన పేరుకుపోయిన ఊహలకు, అపోహలకు రామాయణంలోని జాబాలి వృత్తాంతం తెరదించేసింది! ఉపనిషత్తుల తర్వాతి కాలానికి చెందిన భౌతిక వాద, హేతువాద దార్శనికులు - అజితకేశ, కంబాలిక, పురాణ కాశ్యప, కాత్సాయన, మబాలి గోసాల, సంజయ బెలాతపుట్ట వంటి భౌతికవాదులు వేదకాలంలోనే ఉన్నారని మరచిపోరాదు! వీరంతా నాటి ఛాందసులు సాంఘిక పురోగతికి కల్పిస్తున్న అడ్డంకులను, ప్రతిఘటనా కుడ్యాలను అధిగ మించడానికి భౌతిక, హేతువాద వర్గాలు అనుసరించిన మధ్యే మార్గమే లౌకికవాదం. అందుకే నాటి భౌతిక, హేతువాదుల్ని, ప్రగతివాదుల్ని ‘నాస్తి కులు’ అన్న అపవాదును రుద్దడానికి పునాది అంతా అప్పుడే అక్కడ పడిం దన్నమాట! ఇప్పుడూ అదే తంతు - ‘సర్వజనులూ సుఖంగా ఉండాల’న్న ఆర్యోక్తికి అర్థం మారిపోయింది? పైగా ‘హిందువులు, ముస్లింలు పోట్లా డుకొనే కంటే, దారిద్య్రంపై పోరాటం చేయండని’ పాలకులు బోధిస్తూనే, దారిద్య్ర నిర్మూలన బాధ్యతను ప్రభుత్వం చేపట్టకుండా ఆ బాధ్యత పౌర సమాజానిదేనని చెప్పి తప్పించుకో జూడటం! ఎమర్జెన్సీని, 1984లో సిక్కు లపై ఊచకోతలను ఖండించని మేధావులంతా బీజేపీపై పడుతున్నారని మరొక ఆరోపణ. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మేధావులు గొంతు విప్పారు. జైళ్లకు వెళ్లారు. సిక్కుల ఊచకోతకు కూడా నిరసన తెలిపారు. సల్మాన్ రష్దీపై ఉగ్రవాదుల ‘ఫత్వా’కు వ్యతిరేకంగా ఉద్యమించారు. కాగా ఇప్పుడు రొమిలా థాపర్ చెప్పినట్టు సెక్యులరిజంపై నోరు విప్పడానికి మొదటిసారిగా పోలీ సుల రక్షణ తీసుకోవాల్సి వస్తోంది! ఆశయాలు సంఘర్షిస్తున్న వేళ - అభ్యు దయ భారతం కోసం అభివృద్ధి భారతం కోసం ఈ వెంపర్లాట అనివార్యం! abkprasad2006@yahoo.com.in - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు