న్యూఢిల్లీ: భీమ్-కోరేగావ్ అల్లర్ల కేసులో వరవరరావు సహా పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధాన్ని సుప్రీంకోర్టు ఈ నెల 19 వరకు పొడిగించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని పిటిషనర్ల తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోరారు. దీనిపై దిగువ కోర్టులే నిర్ణయం తీసుకుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరహక్కుల నేతలకు గృహనిర్బంధం కేసు వరకే తాము విచారిస్తామని తెలిపింది.
ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ మణీందర్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నక్సలిజం, మావోయిజం అనేది చాలా తీవ్రమైన సమస్య అని తెలిపారు. అరెస్టయిన వ్యక్తులు అసాంఘిక కార్యాకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
Published Mon, Sep 17 2018 2:51 PM | Last Updated on Mon, Sep 17 2018 4:33 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment