
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై వివాహాల వివాదాల అంశంలో గోయల్ సిఫార్సుల అమలుతో పాటు ట్రిపుల్ తలాక్ క్రిమినల్ కోడ్ అమలు చేసే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయ ణ తదితరులు గురువారం ఢిల్లీలో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బండారు దత్తాత్రేయ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి లోకముద్ర మహంతి, విదేశాంగ శాఖ కార్యదర్శి మనోజ్ మహాపాత్రలను వేర్వేరుగా కలసి వినతిపత్రాన్ని అందిం చారు. ఎన్నారై వివాహాల్లో వివాదాలు తలెత్తితే వాటి పరిష్కారం క్లిష్టంగా మారుతోందని, దీంతో వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.