డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో? | RJio effect? After Idea, Airtel now slashes prepaid data tariffs | Sakshi
Sakshi News home page

డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో?

Published Tue, Jul 19 2016 8:54 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

డాటా ప్యాక్ లకు  సవాల్ విసురుతున్న జియో?

డాటా ప్యాక్ లకు సవాల్ విసురుతున్న జియో?

97 రూపాయ‌ల‌కే 10జీబీ 4జీ డేటా అంటూ అటు మొబైల్ వినియోగదారులను తన వైపు తిప్పుకున్న రిలయన్స్ జియో సేవలు ..ఇటు టెలికాం దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

97 రూపాయ‌ల‌కే 10జీబీ 4జీ డేటా అంటూ అటు మొబైల్ వినియోగదారులను  తన వైపు తిప్పుకున్న రిలయన్స్   జియో  సేవలు ..ఇటు టెలికాం దిగ్గజాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.  మొబైల్‌ సంస్థలు ప్రకటిస్తున్న  ఆఫర్లు మీద ఆఫర్లు  దీనికి నిదర్శనం. ఎందుకంటే త్రీజీ   టూజీ స్పీడ్, ఫోర్ జీ ... త్రీజీ స్పీడ్  పేరుతో  స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై రేట్లు బాదేస్తున్న కంపెనీలు అకస్మాత్తుగా  ఈ చర్యకు పూనుకున్నాయి.. 

వినియోగదారులనుంచి విపరీతంగా చార్జీలు  గుంజుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ... సరికొత్త ఆఫర్ తో  జియో సిమ్ లు రంగంలోకి వచ్చాయి . డాటా పాక్ లకు సవాలు విసురుతున్న ఈ సిమ్ ల  హవా ఇప్పటికే   వీటి  ప్రారంభమైనా  కమర్షియల్ గా ఈ ఆగస్టులోనే  లాంచ్ అయ్యేందుకు రడీ అవుతోంది రిలయన్స్ జియో. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే  మొబైల్‌ సంస్థలన్నీ ఆఫర్లు మీద ఆఫర్లుమీద  ప్రకటిస్తున్నాయి.  ప్రీపెయిడ్‌ వినియోగదారులకు  2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్‌, ఐడియా ప్రకటించేశాయి. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్  67శాతం , మరో ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఐడియా సైతం 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు జూన్‌లో జీఎస్‌ఎం వినియోగదార్లు 35 లక్షల మంది జతచేరారని, వీరితో కలిపి మొత్తం కనెక్షన్ల సంఖ్య 77.69 కోట్లకు చేరినట్లు సెల్యులార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (కోయ్‌) తెలిపింది. 6 సంస్థలకు ఈ సంస్థ ప్రాతినిథ్యం వహిస్తున్న కోయ్ తాజా జాబితాను  విడుదల చేసింది. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్తగా సమకూరిన 14 లక్షల మందితో కలిసి మొత్తం కనెక్షన్ల సంఖ్య 25.57 కోట్లకు చేరినట్లు పేర్కొంది. ఐడియాకు 6.89 లక్షలు, వొడాఫోన్‌కు 7.02 లక్షలు, ఎయిర్‌సెల్‌కు 6.72 లక్షలు, టెలినార్‌కు 32,256 కనెక్షన్లు కొత్తగా జతచేరినట్టు ప్రకటించింది.

అరకొర డాటా తో  వినియోగదారుల నుంచి డబ్బులు పిండుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జీయో సిమ్ లు సంచలనంగా మారాయి.  దీనితోపాటుగా జియో నెట్ వర్క్ ఉపయోగించే సిడిఎమ్  వినియోగదారులకు  మాత్రమే పరిమితమైన  జియో సేవలు తాజాగా  శాంసంగ్  స్మార్ట్ ఫోన్లలో అందుబాటులోకి తెచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో  ఆయా కంపెనీలకు మరింత గుబులు  మొదలైంది.   మరి  దిగ్గజ కంపెనీలకు  సైతం సవాలు  విసురుతున్న  రిలయన్స్ జియో... వినియోగదారులను ఆకట్టుకుంటుందా? డాటా  కష్టాలకు చెక్ పెడుతుందా? వేచి చూడాల్సిందే...


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement