
భారత టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. టెలికాం సంస్థలకు ప్రీపెయిడ్ ప్యాక్ల విషయంలో వాలిడిటీని పెంచాలని షాకిచ్చింది. తద్వారా మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో గుడ్ న్యూస్ చెప్పినట్లయ్యింది.
గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో.. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌లను తీసుకురావాలని ఆదేశించింది.
ఈ మేరకు టెలికమ్యూనికేషన్ ఆర్డర్ 1999కి మార్పు చేస్తూ.. ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెలా ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment