నెట్‌వర్క్ సేవల స్పెక్ట్రమ్ బ్యాండ్‌ల వేలంలో కంపెనీలు సమర్పించిన ధరావతు సొమ్ము(ఈర్నెస్ట్ మనీ డిపాజిట్లు-ఈఎండీ) 2022 కంటే సుమారు 86శాతం తక్కువగా ఉందని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి.
తాజా కథనాల ప్రకారం..5జీ స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికాం కంపెనీలు సమర్పించిన ఈఎండీ రూ.300-రూ.3,000 కోట్లుగా ఉంది. గత పదేళ్లలో అత్యల్ప ఈఎండీ నమోదవడం ఇదే తొలిసారి. 2022లో జరిగిన వేలంలో కంపెనీలు సమర్పించిన ఈఎండీల కంటే ఇది దాదాపు 79-86% తక్కువగా ఉంది.
స్పెక్ట్రమ్‌లో ఈఎండీలు బిడ్డింగ్ వ్యూహాన్ని, కొనుగోలు సామర్థ్యాన్ని సూచిస్తాయి. ఆక్షన్‌లో పాల్గొనేందుకు కావాల్సిన అర్హత పాయింట్లను ఈఎండీల ద్వారా పొందవచ్చు. ఈసారి దాదాపు రూ.97,000 కోట్ల (దాదాపు 12 బిలియన్లు డాలర్లు) విలువైన 5జీ ఎయిర్‌వేవ్‌లలో ప్రభుత్వం 21% స్పెక్ట్రమ్‌ను అమ్మే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎలాగైనా గరిష్ఠవాటాను సొంతం చేసుకోవాలని టాప్ కంపెనీలు ఈఎండీ చెల్లించి, అధిక పాయింట్లు పొందుతుంటారు. తర్వాత ఆక్షన్‌లో పాల్గొని స్పెక్ట్రమ్‌ను చేజిక్కించుకుంటారు.
రిలయన్స్ జియో 2022లో ఈఎండీలు రూ.14000 కోట్లు, ఈసారి రూ.3000 కోట్లు.
భారతీఎయిర్‌టెల్ 2022లో ఈఎండీలు రూ.5500 కోట్లు, ఈసారి రూ.1050 కోట్లు.
వొడాఫోన్ ఐడియా 2022లో ఈఎండీలు రూ.2200 కోట్లు, ఈసారి రూ.300 కోట్లు.
స్పెక్ట్రమ్ అంటే?
సెల్‌ఫోన్లు, రేడియోలు వంటి వైర్‌లెస్ సాధనాలకు సిగ్నళ్లు కావాలి. వీటి మధ్య సమాచార మార్పిడికి విద్యుదయస్కాంత తరంగాలు అవసరం. వీటినే రేడియో తరంగాలు అని కూడా అంటారు. ఇలాంటి విద్యుదయస్కాంత తరంగాల శ్రేణినే స్పెక్టమ్ అంటారు. ఒక సాధనం నుంచి ఇంకో సాధనానికి సమాచారం చేరవేతకు నిర్దిష్ట పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీలు) ఉంటాయి. రేడియోకు వేరేగా.. సెల్‌ఫోన్లకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలను కేటాయించారు. ఫ్రీక్వెన్సీని బట్టి స్పెక్ట్రమ్‌ను వివిధ బ్యాండ్‌లుగా వర్గీకరించారు.
ఇదీ చదవండి: అప్పు తీసుకుంటున్నారా..? ఒక్కక్షణం ఆలోచించండి
గతంలో 5జీ కోసం రూ.4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్జ్ స్పెక్ట్రాన్ని వేలానికి ఉంచారు. 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 3300 MHz, 26GHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ప్రస్తుతం వేలం నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment