Deloitte report
-
భారత్ 7 శాతం వృద్ధి సాధిస్తుంది: డెలాయిట్ సీఈఓ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ.. భారత్ మాత్రం వృద్ధి సాధిస్తుందని డెలాయిట్ దక్షిణాసియా సీఈఓ 'రోమల్ శెట్టి' (Romal Shetty) అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం సహేతుకంగా నియంత్రణలో ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్దితో ఇది మరింత ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. వాహన విక్రయాలు మెరుగుపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ధిక వృద్ధి 7 నుంచి 7.1 శాతం పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ రాజకీయ పరిణామాలు, ఉక్రెయిన్‌లో ఏర్పడ్డ సంక్షోభం వంటివి చాలా దేశాల జీడీపీ వృద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే, ఇప్పటికే భారతదేశం మెరుగైన స్థితిలో ఉందని శెట్టి పేర్కొన్నారు.డెలాయిట్ అంచనాల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత్ వృద్ధి 6.7 శాతంగా ఉండవచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం వృద్ధి చెందింది. మోదీ 3.0 ప్రభుత్వం ఇదే వేగంతో కొనసాగాలని తాను ఆశిస్తున్నానని, ప్రభుత్వ శాఖలలో పనులు కూడా ఎప్పటికప్పుడు పూర్తవ్వాలని రోమల్ అన్నారు.ఇదీ చదవండి: పెట్టుబడులకు కేంద్రంగా భారత్: పీయూష్ గోయల్భారతదేశం ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. చమురు ధరల క్షీణత భారతదేశానికి ఒక కోణంలో మంచిది. యూఎస్ ఫెడ్ రేటు తగ్గింపు కూడా భారతదేశానికి సానుకూలంగా ఉంటుంది. తలసరి ఆదాయం ఒక నిర్దిష్ట స్థాయి కంటే పెరిగితే, ఆర్థిక వ్యవస్థ కూడా అక్కడ నుండి వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. -
Deloitte: విలువను కోరుతున్న కస్టమర్లు
న్యూఢిల్లీ: వినియోగదారుల ప్రాధాన్యతల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుందని, తాము కొనుగోలు చేసే ఉత్పత్తుల విషయంలో విలువకు ప్రాధాన్యమిస్తున్నారని డెలాయిట్ నివేదిక తెలిపింది. కన్జ్యూమర్ వ్యాపారాలన్నింటా ఇదే ధోరణి కనిపిస్తున్నట్టు వివరించింది. ఖాళీ సమయాల్లో కార్యకలాపాలపై వినియోగదారులు తమ వ్యయాలను పెంచొచ్చని, దీంతో 2024–25లో ఏవియేషన్, హోటల్ పరిశ్రమలు మంచి పనితీరు నమోదు చేసే అవకాశాలున్నట్టు డెలాయిట్ నివేదిక అంచనా వేసింది. సౌందర్య ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో వృద్ధి క్షీణించొచ్చని అంచనా వేసింది. కరోనా అనంతరం కస్టమర్లు పెద్ద మొత్తంలో విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడంతో 2024–25 సంవత్సరానికి అధిక బేస్ ఏర్పడినట్టు డెలాయిట్ ‘ఫ్యూచర్ ఆఫ్ రిటైల్’ నివేదిక వెల్లడించింది. ‘‘కొన్ని విభాగాల్లో ఆరంభస్థాయి ఉత్పత్తులతో పోల్చి చూస్తే ప్రీమియం ఉత్పత్తుల్లో వృద్ధి ఎక్కువగా ఉంది. ఎల్రక్టానిక్స్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో ఇది కనిపిస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల పరంగా తమ కస్టమర్ల ప్రాధాన్యతలను అర్థం చేసుకున్న కంపెనీలు దీన్నుంచి వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోగలవు’’ అని పేర్కొంది. చాలా విభాగాల్లో కస్టమర్లు పాతవాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధికి చోదకంగా నిలవగలదని తెలిపింది. ఈ ధోరణి నుంచి ప్రయోజనం పొందాలంటే కంపెనీలు తమను విశ్వసించే కస్టమర్లను కాపాడుకోవాలని, పనితీరు, విలువ పరంగా మెరుగైన ఉత్పత్తులతో వారికి చేరువ కావాలని సూచించింది. కస్టమర్లు, ఉత్పత్తులు, ఛానల్, అనుభవానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రిటైలర్లు 8–20 శాతం ఇంక్రిమెంటల్ వృద్ధిని సాధించొచ్చని అభిప్రాయపడింది. -
సైబర్ బీమాకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్ బీమాకు గణనీయంగా డిమాండ్ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో సైబర్ బీమా మార్కెట్ పరిమాణం 50–60 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది. ‘సైబర్ ఇన్సూరెన్స్ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్ వంటి డిజిటైజేషన్ అధికంగా ఉండే విభాగాలు సైబర్ క్రిమినల్స్‌కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది. పలువురు చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ (రిస్క్ అడ్వైజరీ) ఆనంద్ వెంకట్రామన్ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. నివేదికలోని మరిన్ని అంశాలు.. ► రాబోయే మూడేళ్లలో డిజిటల్ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్‌వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు. ► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్ ఇన్ఫ్రా బడ్జెట్లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి. ► దేశీయంగా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్ .. కఠినతరమైన సైబర్ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్ ఇన్సూరెన్స్ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి. ► సైబర్ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి. ► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్‌సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా కంపెనీలు కృషి చేయాలి. ► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి. -
టెక్ హబ్‌ల జాబితాలో ఏపీ నుంచి మూడు - అవేవో తెలుసా?
Nasscom-Deloitte Report: ఆధునిక ప్రపంచంలో భారతదేశం అభివృద్ధివైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రాలు కూడా ఇదే దిశలో పయనిస్తున్నాయి. దేశంలో 26 డెవెలప్ అవుతున్న టైర్-2 నగరాలు టెక్నాలజీ హబ్‌లుగా అభివృద్ధి చెందుతున్నాయని డెలాయిట్ ఇండియా వెల్లడించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు ఉన్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలు.. అభివృద్ధి చెందిన నగరాలతో పోలిస్తే.. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఖర్చులు 25 నుంచి 30 శాతం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ రెంటల్స్‌లో 50 శాతం ఖర్చు ఆదా అవుతుంది. మన రాష్ట్రంలో టెక్ హబ్‌లుగా అవతరిస్తున్న నగరాల్లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణం ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలోని టెక్నాలజీ రంగానికి అవసరమయ్యే నిపుణుల్లో 11 నుంచి 15 శాతం మంది ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉన్నారు. అలాగే ఇంజనీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన వారు 60 శాతం మంది చిన్న పట్టణాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: చంద్రయాన్-3 సక్సెస్.. ఇస్రో ఉద్యోగుల జీతాలు ఎంతో తెలుసా? దేశంలోని మొత్తం స్టార్టప్‌లలో 39 శాతం (7,000 కంటే ఎక్కువ) డీప్ టెక్ నుంచి బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (BPM) వరకు పరిశ్రమలు విస్తరించి ఉన్న ఈ అభివృద్ధి చెందుతున్న టైర్-2 నగరాల్లో పనిచేస్తున్నాయి. టెక్నాలజీకి సంబంధించి పెద్ద నగరాలు గతంలో ఫోకస్లో ఉన్నప్పటికీ.. కరోనా మహమ్మారి తరువాత దేశవ్యాప్తంగా చెప్పుకో తగ్గ స్థాయిలో వికేంద్రీకరణ జరిగింది. 2014 - 2018 మధ్య కాలంలో కంపెనీలు గణనీయంగా ఎదిగాయి. 2025 నాటికి ఇవి 2.2 రెట్లు వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుతం పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా చిన్న పట్టణాల్లోని సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రానున్న రోజుల్లో మనదేశంలో మరిన్ని కొత్త నగరాలు టెక్ హబ్‌లుగా మారతాయని చెప్పడానికి ఇదే నిదర్శనం. -
ఓఎన్డీసీతో ఆర్థిక సేవలు, తయారీకి దన్ను
న్యూఢిల్లీ: చిన్న రిటైలర్లకు కూడా ఈ–కామర్స్ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ప్రారంభించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో నాలుగు కీలక రంగాల వృద్ధికి ఊతం లభించగలదని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక నివేదికలో వెల్లడించింది. ఆర్థిక సేవలు, వ్యవసాయం, తయారీ, ఈ–కామర్స్ రిటైల్ వీటిలో ఉంటాయని పేర్కొంది. రుణ అవసరాల కోసం ప్రభుత్వ పథకాలు, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలపై ఎక్కువగా ఆధారపడే చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) ఆర్థిక సేవల సంస్థలు చేరువయ్యేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడగలదని వివరించింది. సాధారణంగా ఎంఎస్ఎంఈల ఆర్థిక గణాంకాల సరిగ్గా అందుబాటులో లేకపోవడం వల్ల వాటి రుణ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. అయితే, ఓఎన్డీసీ ద్వారా అవి నిర్వహించే లావాదేవీల డేటా అంతా వ్యవస్థలో డిజిటల్‌గా నిక్షిప్తం కావడం వల్ల వాటికి అనువైన ఆర్థిక సాధనాలను రూపొందించడానికి ఫైనాన్షియల్ సంస్థలకు వీలవుతుందని నివేదిక పేర్కొంది. ‘పరిస్థితికి అనుగుణంగా మారగలిగే స్వభావం, భద్రత, లాభదాయకత.. ఏకకాలంలో ఈ మూడింటి మేళవింపుతో ఓఎన్డీసీ ఎంతో విశిష్టంగా రూపొందింది. ఇది సరఫరా, డిమాండ్ మధ్య వ్యత్యాసాలను భర్తీ చేయగలదు. నవకల్పనలకు తోడ్పాటునివ్వగలదు. తద్వారా కొత్త తరం వినూత్నంగా ఆలోచించేందుకు బాటలు వేయగలదు‘ అని డెలాయిట్ దక్షిణాసియా ప్రెసిడెంట్ (కన్సలి్టంగ్) సతీష్ గోపాలయ్య తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలకు ఓఎన్డీసీ ఒక గొప్ప అవకాశం కాగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలో మరిన్ని వివరాలు.. ► కోవిడ్ మహమ్మారి అనంతరం భోగోళిక–రాజకీయ ఉద్రిక్తతల కారణంగా తయారీ రంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాణిజ్య పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, పరికరాల కొరత, కమోడిటీల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. తయారీ సంస్థలు ఈ సవాళ్లను వ్యాపార అవకాశాలుగా మల్చుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగపడవచ్చు. ఓఎన్డీసీలో లాజిస్టిక్స్ సేవలు అందించే సంస్థలు పుష్కలంగా ఉన్నందున.. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గించుకునేందుకు, మరింత సమర్ధంగా డిమాండ్‌కి అనుగుణంగా స్పందించేందుకు వీలవుతుంది. ► ఆన్లైన్ అమ్మకాలకు ప్రాధాన్యం పెరుగుతున్నందున, రిటైల్ పరిశ్రమ భాగస్వాములు (బ్రాండ్లు, రిటైలర్లు, పంపిణీదారులు, సరఫరాదారులు) తమ వ్యవస్థలో అంతర్గతంగా మిగతా వర్గాలతో కలిసి పనిచేసేందుకు, అలాగే కస్టమర్లను చేరుకునేందుకు కూడా ఓఎన్డీసీ సహాయకరంగా ఉండనుంది. ► గత కొద్ది నెలలుగా నిత్యావసరాలు, ఫుడ్ డెలివరీ, గృహాలంకరణ, ఎల్రక్టానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టయిల్, సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఫార్మా తదితర విభాగాల సంస్థలు ఓఎన్డీసీ నెట్‌వర్క్‌ను సమర్ధమంతంగా వినియోగించుకుంటున్నాయి. ► డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని తక్కువ వ్యయాలతో పరిష్కరించుకోవడానికి బ్రాండ్స్/రిటైలర్లు/ఎంఎస్ఎంఈలకు ఓఎన్డీసీ ద్వారా అవకాశం లభిస్తుంది. బ్రాండ్లు నేరుగా రిటైలర్లను చేరుకోవడానికి, పంపిణీదారులు తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోవడానికి కూడా ఇది తోడ్పడగలదు. ఇందుకోసం ఆయా సంస్థలు ఇరవై నాలుగ్గంటలూ ఆర్డర్ చేసేందుకు వెసులుబాటు, మరుసటి రోజే డెలివరీ, ఆటో ఆర్డరింగ్ వంటి సదుపాయాలను కలి్పంచవచ్చు. ► బ్రాండ్స్/రిటైలర్లు తమ సరఫరాదారుల వ్యవస్థను విస్తరించుకునేందుకు, ముడి వనరులు లేదా తయారీ ఉత్పత్తుల సేకరణ వ్యయాలను తగ్గించుకునేందుకు ఓఎన్డీసీ ఉపయోగకరంగా ఉండగలదు. ► ఇటు కొనుగోలుదారులను, అటు విక్రేతలను ఒకే వేదికపైకి తెచ్చే అవకాశం ఉన్నందున దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచేందుకు ఇది సహాయకరంగా ఉండగలదు. ప్రాచుర్యం పొందడంలో సవాళ్లు ఎదుర్కొంటున్న అగ్రిటెక్ అంకుర వ్యవస్థలకు ఈ నెట్వర్క్ ఒక వరంగా మారగలదు. కంపెనీలు, ప్రభుత్వ సంస్థల నుంచి రైతు ఉత్పత్తి సంస్థలకు (ఎఫ్‌పీవో) ముడి సరుకు, సాంకేతికత, పరికరాలు, సేవలు అందుబాటులోకి రాగలవు. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!
ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు. గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) 25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్ఆర్ హెడ్ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా. -
ఆ రంగంలో మూడేళ్లకోసారి లక్ష కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెలికం పరిశ్రమ మూడేళ్లకోసారి రూ.1,03,262 కోట్ల ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా–సీఐఐ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచే అవకాశం ఉన్న 5జీ రాక ఇందుకు కారణమని వివరించింది. ‘2023 చివరినాటికి భారత టెలికం పరిశ్రమ రూ.10,32,625 కోట్లకు చేరుతుంది. 5జీ ఎంట్రీతో మూడేళ్లకోసారి పరిశ్రమకు ఒక లక్ష కోట్లు తోడవుతాయి. 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయిన నెలరోజుల్లోనే ఒక టెలికం కంపెనీ 10 లక్షల 5జీ చందాదార్ల సంఖ్యను దాటింది. ఆర్థిక వృద్ధిని 5జీ వేగవంతం చేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. పట్టణ, గ్రామీణ జనాభాను కలుపుతుంది. ఈ సాంకేతికత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి క్లిష్టమైన రంగాలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన ఆలోచన, సాంకేతిక నైపుణ్యంతో దేశంలో ఆర్థిక వృద్ధి, స్థితిస్థాపకతను వేగవంతం చేయడానికి భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీని ఉపయోగించవచ్చు. 5జీ నెట్వర్క్కి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత భారతీయ పరిశ్రమలలో ప్రైవేట్ నెట్‌వర్క్‌ల అవసరాలు పెరుగుతాయి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
5జీ ఎఫెక్ట్.. కొత్త ఫోన్లకు సూపర్ క్రేజ్
న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్ఫోన్ల అమ్మకాలకు గ్రామీణ ప్రాంతాలు దన్నుగా నిలుస్తున్నాయి. దీనితో వచ్చే అయిదేళ్లలో స్మార్ట్ఫోన్ల యూజర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఒక అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. 2021 గణాంకాల ప్రకారం దేశీయంగా 120 కోట్ల మొబైల్ యూజర్లు ఉండగా.. వీరిలో 75 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఉన్నారు. వచ్చే అయిదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా స్మార్ట్ఫోన్లు తయారు చేసే రెండో దేశంగా నిలవనుంది. ఈ నేపథ్యంలోనే డెలాయిట్ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ 2026 నాటికి స్మార్ట్‌ఫోన్ మార్కెట్ 1 బిలియన్ (100 కోట్లు) యూజర్ల స్థాయికి చేరే అవకాశం ఉంది‘ అని 2022 గ్లోబల్ టీఎంటీ (టెక్నాలజీ, మీడియా.. వినోదం, టెలికం) అంచనాల పేరిట రూపొందించిన నివేదికలో డెలాయిట్ తెలిపింది. దీని ప్రకారం 2021–26 మధ్య కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం వార్షిక వృద్ధి రేటు పట్టణ ప్రాంతాల్లో 2.5 శాతంగా ఉండనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 6 శాతం స్థాయిలో నమోదు కానుంది. ‘ఇంటర్నెట్ వినియోగం పెరిగే కొద్దీ స్మార్ట్ఫోన్లకు కూడా డిమాండ్ పెరగవచ్చు. ఫిన్‌టెక్, ఈ–హెల్త్, ఈ–లెరి్నంగ్ మొదలైన అవసరాల రీత్యా ఈ మేరకు డిమాండ్ నెలకొనవచ్చు‘ అని నివేదిక పేర్కొంది. భారత్‌నెట్ ప్రోగ్రాం కింద 2025 నాటికల్లా అన్ని గ్రామాలకు ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలన్న ప్రభుత్వ ప్రణాళిక కూడా గ్రామీణ మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత డివైజ్‌ల డిమాండ్‌కు దోహదపడగలదని వివరించింది. కొత్త ఫోన్లకే మొగ్గు.. 2026 నాటికి పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫోన్లను కొనే వారి సంఖ్య 5 శాతానికే పరిమితం కావచ్చని 95 శాతం మంది తమ పాత ఫోన్ల స్థానంలో కొత్త స్మార్ట్ఫోన్లను కొనుక్కునేందుకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని డెలాయిట్ నివేదికలో తెలిపింది. 2021లో ఇలా తమ పాత ఫోన్ల స్థానంలో ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్లను కొనేవారు 25 శాతంగా ఉండగా.. కొత్త వాటిని ఎంచుకునే వారి సంఖ్య 75 శాతంగా నమోదైంది. ఫోన్ సగటు జీవితకాలం దాదాపు నాలుగేళ్లుగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపించనుంది. 2026లో ఆయా ప్రాంతాల్లో రీప్లేస్మెంట్లకు సంబంధించి 80 శాతం వాటా కొత్త ఫోన్లది ఉండనుండగా.. మిగతా 20 శాతం వాటా సెకండ్ హ్యాండ్ ఫోన్లది ఉండనుంది. ఇక స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య పెరిగే కొద్దీ ఫీచర్ ఫోన్ల స్థానంలో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయడం కూడా తగ్గనుంది. 2021లో ఫీచర్ ఫోన్ రీప్లేస్మెంట్ .. పట్టణ ప్రాంతాల్లో 7.2 కోట్లుగా ఉండగా 2026లో ఇది 6 కోట్లకు తగ్గనుంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే తరహాలో 7.1 కోట్ల నుంచి 6 కోట్లకు దిగి రానుంది. 5జీతో పెరగనున్న డిమాండ్ .. డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారత్‌లో స్మార్ట్ఫోన్లకు డిమాండ్ 6 శాతం మేర వార్షిక వృద్ధితో 2026 నాటికి 40 కోట్లకు చేరనుంది. 2021లో ఇది 30 కోట్లుగా ఉంది. 5జీ సర్వీసుల కారణంగా స్మార్ట్ఫోన్లకు ప్రధానంగా డిమాండ్ నెలకొనే అవకాశం ఉంది. దాదాపు 80 శాతం అమ్మకాలకు (సుమారు 31 కోట్ల యూనిట్లు) ఇదే ఊతంగా నిలవనుంది. హై–స్పీడ్ గేమింగ్, మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందించడం వంటి వివిధ రకాల అవసరాలకు ఉపయోగపడే 5జీ టెక్నాలజీ.. మిగతా మొబైల్ సాంకేతికలతో పోలిస్తే అత్యంత వేగంగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉందని డెలాయిట్ తెలిపింది. ఒక్కసారి 5జీ సర్వీసులను ఆవిష్కరిస్తే .. 2026 నాటికి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు మొత్తం మీద అదనంగా 13.5 కోట్ల స్థాయిలో ఉండవచ్చని పేర్కొంది. ‘2022–26 మధ్య కాలంలో మొత్తం స్మార్ట్ఫోన్ల అమ్మకాలు 170 కోట్లకు చేరే అవకాశం ఉంది. దీనితో ఈ మార్కెట్ 250 బిలియన్ డాలర్లకు చేరనుంది. అయిదేళ్ల వ్యవధిలో 84 కోట్ల పైచిలుకు 5జీ పరికరాలు అమ్ముడు కానున్నాయి‘ అని డెలాయిట్ వివరించింది. మరోవైపు, మీడియా విషయానికొస్తే.. కొరియన్, స్పానిష్ వంటి అంతర్జాతీయ కంటెంట్‌కు భారత్‌లో ప్రాచుర్యం పెరుగుతోందని తెలిపింది. దీంతో పలు స్ట్రీమింగ్ కంపెనీలు తమ వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తోందని పేర్కొంది. తమ కస్టమర్లను కాపాడుకునే క్రమంలో స్ట్రీమింగ్ సర్వీసుల కంపెనీలు.. రేట్ల విషయంలో పోటీపడే అవకాశం ఉంటుందని తెలిపింది. తగ్గనున్న చిప్‌ల కొరత.. సెమీకండక్టర్ చిప్‌ల కొరతతో ప్రపంచవ్యాప్తంగా తయారీ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందని డెలాయిట్ తెలిపింది. సమీప కాలంలో డిమాండ్ పెరిగే కొద్దీ సరఫరాపరమైన పరిమితులు కొనసాగవచ్చని.. 2023లో క్రమంగా పరిస్థితి మెరుగుపడవచ్చని పేర్కొంది. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా చూస్తే సెమీకండక్టర్లు, ఎల్రక్టానిక్స్ తయారీలో భారత్ ప్రాంతీయంగా పటిష్టమైన హబ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా పార్ట్నర్ పీఎన్ సుదర్శన్ తెలిపారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం .. ఇందుకు దోహదపడగలదని పేర్కొన్నారు. -
ప్రతీ ముగ్గురిలో ఒకరి ఓటు వీటికే
న్యూఢిల్లీ: భారత్‌లో రవాణా పరంగా వినియోగ ధోరణులు మారిపోతున్నట్టు డెలాయిట్ గ్లోబల్ ఆటోమోటివ్ కన్జూమర్ స్టడీ 2022 తెలిపింది. మరింత మంది ఎలక్ట్రికల్ (ఈవీ), హైబ్రిడ్ (ఒకటికంటే ఎక్కువ ఇంధనాలతో పనిచేసేవి) వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొంది. తన అధ్యయనంలో భాగంగా వాహనదారుల అభిరుచులు, ఆసక్తులు, ఇష్టాలను ఈ సంస్థ తెలుసుకుని ఒక నివేదిక విడుదల చేసింది. పర్యావరణ అనుకూల వాహనాలపై ప్రభుత్వం దృష్టి సారించడం ఇందుకు మద్దతునిస్తున్నట్టు తెలిపింది. నివేదికలోని అంశాలు.. ► భారత్‌లో 59 శాతం మంది వినియోగదారులు వాతావరణ మార్పులు, కాలుష్యం స్థాయి, డీజిల్ వాహనాలు విడుదల చేస్తున్న కర్బన ఉద్గారాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ► ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, పర్యావరణ పట్ల స్పృహ, వాహనం నడిపే విషయంలో మెరుగైన అనుభవం తదితర అంశాలు ఈవీల పట్ల ఆసక్తికి కారణాలు. ► బ్యాటరీ స్వాపింగ్ (బ్యాటరీ మార్పిడి), చార్జింగ్ సదుపాయాలపై బడ్జెట్లో దృష్టి సారించడం అన్నది పర్యావరణ అనుకూల వాహన వినియోగాని మద్దతునివ్వడమే. ►69 శాతం మంది ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) వాహనాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. ► ఈవీలను సబ్స్క్రిప్షన్ విధానంలో తీసుకునేందుకు 70 శాతం మంది ఆసక్తితో ఉన్నారు. వృద్ధి కొత్త పుంతలు ‘‘కస్టమర్ల అవసరాలు, అద్భుతమైన ఆవిష్కరణలతో భారత ఆటోమోటివ్ పరిశ్రమ కొత్త తరం వృద్ధిని చూడబోతోంది. వినియోగదారులు ప్రత్యామ్నాయ పవర్ ట్రెయిన్ ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు మా అధ్యయనంలో తెలిసింది. ఇది ఈవీ వృద్ధికి మద్దతుగా నిలుస్తుంది’’ అని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజీవ్‌సింగ్ తెలిపారు. -
వరల్డ్ టాప్–100 లగ్జరీ బ్రాండ్లు.. చోటు దక్కించుకున్న ఇండియన్ బ్రాండ్స్ ఇవే
న్యూఢిల్లీ: ప్రపంచంలో విలాసవంతమైన టాప్–100 బ్రాండ్లలో భారత్ నుంచి ఐదింటికి చోటు లభించింది. టైటాన్ మూడు స్థానాలు పైకి ఎగిసి 22వ ర్యాంకులోకి వచ్చింది. అంతేకాదు అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అగ్రగామి 20 లగ్జరీ ఉత్పత్తుల కంపెనీల్లోనూ చోటు సంపాదించుకుంది. జెమ్స్ అండ్ జ్యుయల్లరీ టాప్–100 విలాసవంత ఉత్పత్తుల్లో భారత్ నుంచి కల్యాణ్ జ్యుయలర్స్, జోయలుక్కాస్, పీసీ జ్యుయలర్స్, త్రిభువన్దాస్ భీమ్జీ జవేరీ ఉన్నాయి. ఇవన్నీ జ్యుయలరీ కంపెనీలే కావడం గమనార్హం. భారత్‌కు సంబంధించి ధోరణి గతేడాది మాదిరే ఉందని, జెమ్స్ అండ్ జ్యుయలరీ విభాగం తాజా ఎడిషన్‌లో ఆధిపత్యం ప్రదర్శించినట్టు.. ఈ నివేదికను రూపొందించిన డెలాయిట్ తెలిపింది. తొలిసారి త్రిభువన్దాస్.. టాప్ –100 లగ్జరీ ఉత్పత్తుల జాబితాలోకి త్రిభువన్దాస్ భీమ్జీ జవేరి తొలిసారిగా చోటు సంపాదించుకుంది. టాప్–10 బ్రాండ్లు యూరోప్, మధ్య ప్రాచ్యం, ఆఫ్రికా ప్రాంతం (ఈఎంఈఏ) నుంచే ఉన్నాయి. టాప్–100లో 80కు పైగా కంపెనీల విక్రయాలు 2019–20లో (2020వ సంవత్సరం) తక్కువగా ఉన్నాయని.. కరోనా ప్రబావం వీటిపై పడినట్టు డెలాయిట్ తెలిపింది. అయినప్పటికీ సగానికి పైగా కంపెనీలు లాభాలను నమోదు చేశాయని పేర్కొంది. చదవండి: ఆదిత్య బిర్లా చేతికి రీబాక్! నెక్ట్స్ ఏం జరగబోతుంది? -
వర్క్ ఫ్రం హోం: కొత్త తలనొప్పులు తప్పవా?
కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఆన్లైన్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కంపెనీ బోర్డుల్లోని స్వతంత్ర డైరెక్టర్లు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. డెలాయిట్ టచ్ తోమత్సు ఇండియా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ భాగస్వామ్యంతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ‘కార్పొరేట్ మోసాలు, దుర్వినియోగం: ఇండింపెండెంట్ డైరెక్టర్ల పాత్ర’ పేరుతో ఈ సర్వే వివరాలను డెలాయిట్ బుధవారం విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న స్వతంత్ర డైరెక్టర్లలో 63 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఆన్లైన్ మోసాలు పెరగొచ్చని చెప్పారు. ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తుండడం, నగదు ప్రవాహాల సమస్యలు మోసాలు పెరిగేందుకు కారణం కావచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లకు సంబంధించి ఎక్కువ మోసాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. మోసాలను నివారించేందుకు, గుర్తించే విషయంలో తాము ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని 75 శాతం మంది ఇండిపెండెంట్ డైరెక్టర్లు తెలిపారు. మోసాల రిస్క్‌ను నివారించే విషయంలో పటిష్టమైన కార్యాచరణను కంపెనీ బోర్డు అమలు చేస్తోందని 57 శాతం మంది చెప్పారు. వ్యాపార నిర్వహణ పరిస్థితులు శరవేగంగా మార్పునకు గురవుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ రిస్క్ నిర్వహణ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే పేర్కొంది. చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ -
కరోనా మహమ్మారిలోనూ బలంగా నిలబడ్డ పరిశ్రమలివే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలు కరోనా మహమ్మారి కాలంలోనూ తమ బలాన్ని చాటుతున్నాయని..భవిష్యత్తులో ఇవి మరింత విలువను సృష్టించే విధంగా అభివృద్ధి చెందగలవని డెలాయిట్–ఫిక్కీ నివేదిక అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు చేరువ కావాలని సూచించింది. వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, ప్యాకేజింగ్ విషయంలో స్థిరత్వం ఉండేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ నివేదిక గురువారం విడుదలైంది. ‘‘వినియోగ డిమాండ్‌ను కరోనా పూర్తిగా మార్చేసింది.సరఫరా వ్యవస్థలకు సవాళ్లు విసిరింది. కొన్నింటిని సమూలంగా మార్చేసింది. వ్యాపారాలకు ఇక నూతన సాధారణ అంశాలుగా మార్చేసింది’’అని వివరించింది. డిజిటైజేషన్‌తో కిరాణాల సామర్థ్యం పెరగనుందని.. ఎఫ్ఎంసీజీ రంగానికి వృద్ధి అవకాశాలు తీసుకొస్తుందని అంచనా వేసింది. నేరుగా వినియోగదారుణ్ణి చేరుకునే మార్గాలపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించింది. కాస్మొటిక్స్, బేబీ కేర్, వెల్నెస్ విభాగాల్లో ఈ కామర్స్ ఇకమీదట మరింత వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
చలో ఆఫీస్..! .. డెలాయిట్ సర్వేలో ఆసక్తికర అంశాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల తగ్గుదలతో అంతటా సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేశంలో దాదాపు 83 కోట్ల మంది టీకాలు (వారిలో 61 కోట్ల మంది మొదటి డోస్) తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారికి ముందటి స్థాయిలో కాకపోయినా ఆఫీసులకు వెళ్లేందుకు ఎక్కువ మందే సిద్ధమౌతున్నారు. పనిప్రదేశాలకు వెళ్లడం సురక్షితమేనని 84 శాతం మంది చెబుతున్నారు. ‘గ్లోబల్ స్టేట్ ఆఫ్ ద కన్జ్యూమర్ ట్రాకర్’పేరిట డెలాయిట్ టచ్ తోహ్మత్సు ఇండియా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌తోసహా 18 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. కరోనా భయం తగ్గిన నేపథ్యంలో విమాన ప్రయాణాలకు, విదేశీ పర్యటనలకు, ఇతర ప్రాంతాల్లోని హోటళ్లలో ఉండేందుకు సై అంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. వివిధ రంగాల ఉద్యోగులు మళ్లీ ఆఫీసులకు వెళ్లడం మొదలుకావడం, వస్తువుల కొనుగోళ్లకూ వినియోగదారులు సిద్ధం కావడం వల్ల భారత ఆర్థికరంగం కోలుకునేందుకు అవకాశముందని నిపుణులు అంటున్నారు. అన్నీ మళ్లీ సాధారణస్థితికి రావాలి దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని వ్యవస్థలు మునుపటిలా పాలుపంచుకోవాల్సిందే. అధికశాతం మంది కనీసం ఒక్క డోస్ అయినా తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నీ మళ్లీ సాధారణస్థితికి చేరుకోవాల్సిన అవసరముంది. అన్ని రంగాలు, వర్గాల వారు రోజువారీ కార్యకలాపాల్లో నిమగ్నమై ఆఫీసులకు వెళ్లడం మొదలైతే ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో ఆర్థికరంగంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అన్ని రకాల వ్యాపార, వాణిజ్యసంస్థలు, కంపెనీలు తమ ఉద్యోగులను వంద శాతం ఆఫీసులకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుని వచ్చే కొన్నేళ్లపాటు కరోనాతో సహజీవనం చేసేందుకు అందరూ సిద్ధం కావాల్సిందే. – డాక్టర్.బి. అపర్ణరెడ్డి, హెచ్ఆర్ నిపుణురాలు చదవండి: కోవిషీల్డ్ ఓకే.. సర్టీఫికెట్‌తోనే సమస్య -
ఈ ఏడాది వేతనాలు పెరగనున్నాయ్
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీల్లో ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ నివేదిక తెలిపింది. అంచనాలను మించి ఆర్థిక పునరుద్ధరణ, వ్యాపారాలు తిరిగి పుంజుకోవడం, వినియోగదార్ల విశ్వాసం ఇందుకు కారణమని వివరించింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పాలుపంచుకున్నాయి. 2020లో సగటు వేతన పెంపు 4.4 శాతముంటే, 2019లో ఇది 8.6 శాతముందని వెల్లడించింది. జీతాలు పెంచే యోచనలో ఉన్నట్టు సర్వేలో పాలుపంచుకున్న 92 శాతం కంపెనీలు తెలిపాయి. గతేడాది 60 శాతం కంపెనీలే వేతన పెంపునకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. 2021లో రెండంకెల స్థాయిలో జీతాలు పెంపునకు 20 శాతం కంపెనీలు సుముఖంగా ఉన్నాయి. గతేడాది ఇంక్రిమెంట్ ఇవ్వలేకపోయిన కొన్ని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలను పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది. -
రిలయన్స్ రిటైల్‌కు 94వ ర్యాంక్
న్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సంస్థ మరో ఘనత సాధించింది. డెలాయిట్ ప్రకటించిన గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 ఇండెక్స్‌లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 94వ స్థానంలో నిలిచింది. గతేడాది మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆదాయం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 250 సంస్థలకు డెలాయిట్ ర్యాంకులు కేటాయించిందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిత్యవసరాలు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పతుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సంస్థకు మంచి ర్యాంకు దక్కించుకుందని వెల్లడించింది. (ఈ–కిరాణాలో హోరాహోరీ) డెలాయిట్ ప్రకటించిన టాప్ 250 రిటైల్ కంపెనీల జాబితాలో అమెరికన్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మొదటి స్థానంలో నిలిచింది. భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేసి వాల్‌మార్ట్ తన మార్కెట్‌ను మరింత విస్తరించుకుంది. అమెరికన్ కంపెనీలు కాస్ట్కో, క్రోజర్ వరుసగా రెండో, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. టాప్‌టెన్‌లో ఏడు అమెరికా కంపెనీలు ఉండటం విశేషం. మొత్తం జాబితాలో అత్యధికంగా 87 యూరోప్ కంపెనీలు ఉన్నాయి. -
జోరుగానే భారత్ వృద్ధిరేటు..!
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి వేగం 2018లో ఊహించినదానికన్నా వేగంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ– డెలాయిట్ తన తాజా నివేదికలో పేర్కొంది. గ్రామీణ డిమాండ్ పునరుద్ధరణ, మౌలిక రంగంలో వ్యయాల పెంపు వంటి అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. రుణ ఇబ్బందులు పెరిగినా, అమెరికా వంటి దేశాలు రక్షణాత్మక వాణిజ్య విధానాలు అనుసరించినా భారత్ వృద్ధి వేగవంతంగానే ఉంటుందన్న అభిప్రాయాన్ని డెలాయిట్ వ్యక్తం చేసింది. క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అలాగే మార్కెట్లలో ఒడిదుడుకులు కూడా వృద్ధి పురోగతిపై ప్రభావం చూపబోవని అభిప్రాయపడింది. ‘వాయిస్ ఆఫ్ ఆసియా’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు చూస్తే... ♦ దేశీయ పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఇది వృద్ధి ఊపందుకోడానికి దోహదపడే అంశం. ♦ వృద్ధి రికవరీ బాగుంది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 7.2 శాతం వృద్ధి నమోదయ్యింది. ఇది ఐదు నెలల గరిష్టస్థాయి. వ్యవసాయం, తయారీ, నిర్మాణ రంగాలు బాగున్నాయని గణాంకాలు పేర్కొంటున్నాయి. ♦ డీమోనిటైజేషన్, జీఎస్టీ ప్రారంభ కష్టాలు వంటి అంశాలు వృద్ధిని బలహీనపరిచాయి. అయితే ఆయా సమస్యలు ప్రస్తుతం తొలగిపోతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిని సరైన దిశకు నడిపిస్తున్నాయి. ♦ భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయి. 2017 మూడవ త్రైమాసికంలో వృద్ధి బాగుంది. 2018లో కూడా4 వృద్ధి పురోగతి కొనసాగే వీలుంది. 6.8 శాతం నంచి 6.9 శాతం శ్రేణిలో వృద్ధి నమోదయ్యే వీలుంది. ♦ దేశీయంగా డిమాండ్ బాగుంది. వినియోగం పెరుగుతోంది. చిన్న తరహా పరిశ్రమలు పుంజుకుంటున్నాయి. ♦ అందరికీ ఆర్థిక సేవలను అందుబాటులోకి తీసుకురావడం, డిజిటల్ ఇండియాకు చేయూత వంటివి వృద్ధికి దోహదపడే అంశాలు. అంతర్జాతీయ వృద్ధి 3.7 శాతం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 75 శాతానికిపైగా పురోగమన దశలో ఉంది. 2017లో 3.6 శాతం వృద్ధి నమోదయితే, 2018లో ఇది 3.7 శాతానికి చేరే అవకాశం ఉంది. 2016లో ఈ రేటు 3.2 శాతం. -
రూ.25 వేల కోట్లకు బాక్సాఫీస్ వసూళ్లు
2020 నాటికి సాధ్యమన్న డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: దేశీయ చిత్ర పరిశ్రమ అంచలంచెలుగా ఎదుగుతోంది. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ స్థూల కలెక్షన్లు 2020 నాటికి 3.7 బిలియన్ డాలర్ల మార్కు (రూ.25 వేల కోట్లు)ను చేరుతుందని ‘డెలాయిట్ టౌచే తొమాసు ఇండియా’ అనే సంస్థ అంచనా వేసింది. దేశీయ చిత్ర పరిశ్రమ వృద్ధి అవకాశాలు, అడ్డంకులను ఈ సంస్థ నివేదికలో పొందుపరిచింది. ఆదాయాలు ♦ {పస్తుతం భారత చిత్ర పరిశ్రమ బాక్సాఫీస్ ఆదాయాలు 2.1 బిలియన్ డాలర్లు (రూ.14వేల కోట్లు). ఏటా 11% చక్రగతి చొప్పున వృద్ధి చెందుతూ 2020 నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుంది. ♦ భారతీయ చిత్ర పరిశ్రమ సినిమాల సంఖ్య పరంగా చూస్తే ప్రపంచంలోనే అతిపెద్దది. ఏటా 20కు పైగా భాషల్లో 1,500 నుంచి 2,000 వరకు చిత్రాలు రూపొందుతున్నాయి. ♦ సంఖ్యా పరంగా ఘనంగానే ఉన్నా పరిశ్రమ స్థూల ఆదాయాల విషయానికొస్తే విదేశాల కంటే తక్కువగానే ఉంది. అమెరికా, కెనడాలో ఏటా 700 సినిమాల వరకే నిర్మాణమవుతున్నా... బాక్సాఫీస్ ఆదాయాలు 11 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. బాలీవుడ్‌దే అగ్రస్థానం ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం ఆదాయంలో బాక్సాఫీసు కలెక్షన్లు 74 శాతంగా ఉన్నాయి. మిగతా ఆదాయం కేబుల్, శాటిలైట్, ఆన్లైన్ ప్రసార హక్కుల ద్వారా సమకూరుతోంది. ఇవి వేగంగా వృద్ధి చెందే విభాగాలని నివేదిక పేర్కొంది. ఏటా 15% చొప్పున 2020 వరకు వృద్ధి చెందుతాయని తెలిపింది. బాలీవుడ్ 43 శాతం ఆదాయ వాటాతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన 57 శాతం ప్రాంతీయ సినిమాల ద్వారా సమకూరుతోంది. వృద్ధి చోదకాలు ‘తలసరి ఆదాయం, పెరుగుతున్న మధ్యతరగతి వర్గం... టైర్ 2, టైర్ 3 పట్టణాల్లో చిత్రాలకు డిమాండ్ పెరుగుతోంది. అదే సమయంలో పరిశ్రమ సైతం స్థానిక మార్కెట్‌కే పరిమితం కాకుండా విదేశీ మార్కెట్లలోకి చొచ్చుకుపోతోంది. డిజిటైజేషన్ సామర్థ్యాలు, వీఎఫ్ఎక్స్ సాంకేతికతల వినియోగం పరిశ్రమకు వృద్ధి అవకాశాలు’ అని డెలాయిట్ తెలిపింది. సవాళ్లు: తగిన వసతులు లేమి ప్రధాన సమస్యగా ఉందని నివేదిక తెలిపింది. ‘సగటు టికెట్ ధర మన దగ్గర తక్కువగా ఉంది. క్లిష్టమైన పన్ను విధానం, వ్యయాలు పెరిగిపోవడం, నిధుల సాయం లభించకపోవడం, పైరసీ, బహుళ అంచెల పాలనా వ్యవస్థ, కఠినమైన సెన్సార్ నిబంధనలు...’ ఇవన్నీ సవాళ్లుగా నివేదిక పేర్కొంది.