
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ఈ నెలలోనే 5జీ సేవలను ప్రారంభించనుంది. ఇందుకోసం టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్‌సంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించింది. ఇటీవల ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ బిడ్డింగ్‌లో ఎయిర్‌టెల్ సైతం పాల్గొన్న సంగతి తెలిసిందే. 900 మెగాహెట్జ్, 1800, 2100, 3300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్‌లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కంపెనీ దక్కించుకుంది.
స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఈ సంస్థ రూ.43,084 కోట్లు వెచ్చించింది. భారత్‌లో 5జీ విప్లవానికి నాంది పలికేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ‘ఆగస్ట్‌లో 5జీ సేవలను ప్రారంభిస్తున్నాం. నెట్‌వర్క్ ఒప్పందాలు పూర్తయ్యాయి. 5జీ పూర్తి ప్రయో జనాలను వినియోగదార్లకు అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో కలిసి పనిచేస్తాం’ అని ఎయిర్‌టెల్ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు.
చదవండి: Lic: ఇదే మొదటి సారి.. అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్‌ఐసీ!
Comments
Please login to add a commentAdd a comment