సాంకేతిక విప్లవానికి తెరతీస్తూ దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు ఊహించిన దానికంటే ముందుగానే అందుబాటులోకి రానుంది. ప్రముఖ టెలికాం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌లు ఈ నెలాఖరులోగా దేశంలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 5జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ వినియోగదారులు కూడా 5జీ సేవల రాక కోసం ఎదురు చూస్తున్నారు. (హౌసింగ్ బూమ్..! రేట్లు పెరిగినా తగ్గేదెలే!)
ఇటీవల, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 5జీ సేవలను ఊహించిన దానికంటే త్వరగా ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 4జీ కంటే 5జీ స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. గతంలో 4జీ సేవలు కూడా మొదట్లో ప్రధాన నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న పట్టణాలకు సైతం విస్తరించాయి. 5జీ సేవల విషయంలోనూ ఈ ఫార్ములానే పాటించనున్నారు. (బంపర్ ఆఫర్: మొబైల్ ఫోన్ అలవెన్స్ ఏడాదికి రూ.2 లక్షలు)
ఈ నేపథ్యంలో తాజాగా దేశంలో 5జీ నెట్‌వర్క్ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చే నగరాల జాబితాలో.. హైదరాబాద్, అహ్మాదాబాద్, బెంగళూరు, చండీఘర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గుర్గావ్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణె నగరాలు ఉన్నాయి. మొదట్లో ఈ నగరాల్లో ప్రారంభించి ఆ తర్వాత చిన్న నగరాలకు సైతం సేవలను అందించనున్నారు. (నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్)
Comments
Please login to add a commentAdd a comment