ప్రపంచ దేశాల్లో 5జీ (5జనరేషన్) వైర్‌లెస్ మొబైల్ నెట్ వర్క్ ప్రారంభం కానేకాలేదు. కానీ అప్పుడే 6జీ టెక్నాలజీ గురించి చర్చ మొదలైంది. 5జీ కంటే 6జీ ఎంత వేగంతో పనిచేస్తుంది. ఎంత తక్కువ సమయంలో డేటానుషేర్ చేయొచ్చు. ఎన్ని రోజుల్లో 6జీ నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందనే' పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా 6జీ మొబైల్ టెక్నాలజీ వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్ స్పీడ్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తుందని చైనా మీడియా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. చైనా రీసెర్చర్లు సెకన్ వ్యవధిలో 206.25 డేటాను షేర్ చేసే కెపాసిటీ 6జీ టెక్నాలజీని బిల్డ్ చేసినట్లు చైనా మీడియా తన కథనంలో పేర్కొంది. అంతేకాదు 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే 5జీ కంటే 100రెట్లు ఫాస్ట్‌గా పనిచేస్తుందని వెల్లడించింది.
ఉదాహరణకు 4కే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ మొత్తం 59.5గంటలు ఉండగా..ఆ మొత్తాన్ని చిటికెలో డౌన్‌లోడ్ చేయొచ్చు. అంటే 206.25గిగా బైట్ల వేగంతో ఆ అన్నిగంటల సినిమాను కేవలం 16 సెకన్లలో డౌన్‌లోడ్ చేయొచ్చన్నమాట. కాగా, సౌత్ కొరియా మీడియా కథనాల ప్రకారం..టెలికాం సంస్థల నుంచి సేకరించిన సమాచారం మేరకు 6జీ టెక్నాలజీ 2030 కల్లా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
5జీకి కోవిడ్ దెబ్బ
ప్రపంచంలోని ఎక్కువ దేశాల్లో కోవిడ్, సప్లయి చైన్, 5జీ ఎక్విప్‌మెంట్ అధిక ధరల కారణంగా 5జీ నెట్‌వర్క్‌లు సేవలకు ప్రారంభం కాలేదు. ముఖ్యంగా మనదేశంలో 5G స్పెక్ట్రమ్ కోసం వేలం మరింత ఆలస్యం కారణంగా 5జీ సేవలు పూర్తిస్థాయిలో అందేందుకు మరింత సమయం పట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment