వోడాఫోన్ ఐడియాగా రీబ్రాండ్ చేయబడిన తర్వాత 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లభ్యతను విస్తరించింది. ఈ ప్లాన్ గతంలో హోమ్ క్రెడిట్ ద్వారా స్మార్ట్‌ఫోన్ బండిల్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉండేది. 2019లో వోడాఫోన్ ఐడియా... హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో పాట్నర్‌షిప్ ఒప్పందం చేసుకుంది. దీంట్లో భాగంగా కస్టమర్లు రూ.15వేల లోపు ఏదైనా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటే ఆ సంస్థ ఆర్థిక సహాయం అందిస్తుంది. ఇప్పుడు తాజాగా భారత్‌లోని అన్ని సర్కిళ్లలో ఈ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి సంబందించిన సమాచారాన్ని వోడాఫోన్ ఐడియా వెబ్‌సైట్‌లో ఉంచింది. అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ ప్లాట్‌ఫాంల ద్వారా కూడా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు.(చదవండి: ట్విట్టర్ లవర్స్ కి గుడ్ న్యూస్)
వోడాఫోన్ ఐడియా 1197 ప్రీపెయిడ్ ప్లాన్ లో భాగంగా రోజుకి 1.5జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. దీని కాలపరిమితి వచ్చేసి 180 రోజులు, అలాగే రోజుకి ఉచిత 100 ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో వోడాఫోన్ ఐడియా మూవీస్ & టీవీని కస్టమర్లు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆ వారంలో వాడకుండా మిగిలి ఉన్న డేటాను తిరిగి వారం చివరి రోజులో వాడుకోవచ్చు. రూ.1197 ప్రీపెయిడ్ ప్లాన్ ని అందరికి అందుబాటులోకి తీసుకోని రాకముందు, టెల్కో రూ.599కు 1.5 జీబీ రోజువారీ డేటాను 84 రోజులు, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వరుసగా 365 రోజుల వాలిడిటీతో అందించింది. రూ.2,595 ప్రీపెయిడ్ ప్లాన్ తో రోజుకి 2జీబీ డేటాతో పాటు ఒక సంవత్సరం వరకు ఉచితంగా ZEE5 ప్లాట్‌ఫామ్ మెంబర్‌షిప్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment