
కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ఇవి పండుగల లాంటి సమయాల్లో వీటి డోస్ మరింత పెంచుతూ పోతుంటాయి. తాజాగా రిలయన్స్ సంస్థ స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా తన కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త ప్లాన్‌ని తీసుకొచ్చింది. లాంగ్ టర్న్ ప్లాన్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
ప్లాన్‌పై ఓ లుక్కేస్తే..
రిలయన్స్ జియో స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999తో ఏడాది వ్యాలిడిటీతో ప్రీపెయిడ్ ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ప్లాన్ లో భాగంగా దాదాపు రూ.5000 వరకు విలువైన కూపన్లను జియో తన కస్టమర్ల కోసం జత చేసింది. కాలింగ్, డేటాతో పాటు, Jio నుంచి అనేక రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇందులో ప్రముఖ ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఆన్‌లైన్ షాపింగ్‌తో పాటు మరిన్నింటిపై తగ్గింపులు కూడా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ ప్లాన్‌లో ఏమున్నాయంటే.. వినియోగదారులు రోజుకు 2.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్ ప్రయోజనాలు, 365 రోజుల పాటు రోజుకు 100 SMSలను పొందుతారు. వినియోగదారులకు మొత్తం 912.5GB డేటాను పొందవచ్చు. ఈ ప్యాక్ వినియోగదారులకు 5G డేటాను కూడా అందిస్తుంది. వీటితో పాటు రూ. 249 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్విగ్గీ ఆర్డర్‌లపై రూ. 100 తగ్గింపు, అలాగే యాత్ర ద్వారా బుక్ చేసుకున్న విమానాలపై రూ. 1,500 వరకు పొదుపు పొందే అవకాశం ఉంది.
దేశీయ హోటల్ బుకింగ్‌లపై 15 శాతం తగ్గింపు (రూ. 4,000 వరకు) పొందవచ్చు. Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తుల కోసం రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆర్డర్‌లపై రూ. 200 తగ్గింపు కూడా ఉంది. నెట్‌మెడ్స్‌లో అదనపు NMS సూపర్‌క్యాష్‌తో పాటు రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఈ ఆఫర్ నిర్దిష్ట ఆడియో ఉత్పత్తులు, రిలయన్స్ డిజిటల్ నుంచి కొనుగోలు చేసిన దేశీయ ఉపకరణాలపై ఫ్లాట్ 10 శాతం తగ్గింపును అందిస్తుంది. ఇలా దాదాపు ఈ ప్యాక్‌తో రూ.6000 అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.
చదవండి: China Company: భారీ నష్టాల్లో చైనా కంపెనీ.. అదే జరిగితే 70 వేల మంది ఉద్యోగాలు పోతాయ్!