సిమ్ కార్డ్, నెట్‌ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే.. | Video Streaming With Out Net And Sim Card With Direct To Mobile | Sakshi
Sakshi News home page

సిమ్ కార్డ్, నెట్‌ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే..

Published Wed, Jan 17 2024 12:27 PM | Last Updated on Wed, Jan 17 2024 3:18 PM

Video Streaming With Out Net And Sim Card With Direct To Mobile  - Sakshi

మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూడవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్(డీ2ఎం) ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్‌ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 మెగాహెర్డ్జ్‌ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు తెలిపారు.

ప్రస్తుతం బ్రాడ్‌కాస్టింగ్‌లో వీడియో ట్రాఫిక్‌ను  25 నుంచి 30 శాతం డీ2ఎంకి మార్చడం వల్ల 5జీ నెట్‌వర్క్‌లు అన్‌లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చుని అభిప్రాయపడ్డారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్‌లు జరిగాయన్నారు.

దేశంలో 69 శాతం కంటెంట్‌ను వీడియో ఫార్మాట్‌లోనే చూస్తున్నారని చెప్పారు. అయితే వీడియోలను అధికంగా వీక్షిస్తున్నపుడు మొబైల్ నెట్‌వర్క్‌ల వల్ల డేటాకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కంటెంట్‌ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. 

సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం టెక్నాలజీను టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్‌లను నేరుగా మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: చైనాను బీట్‌ చేసే భారత్‌ ప్లాన్‌ ఇదేనా!

దేశంలోని దాదాపు 28 కోట్ల కుటుంబాల్లో కేవలం 19 కోట్ల టెలివిజన్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 80 కోట్ల స్మార్ట్‌ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ డీ2ఎం సాంకేతికత అందుబాటులోకి వస్తే స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఒక బిలియన్(100 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా డేటా ట్రాన్స్‌మిషన్  ఖర్చులు తగ్గుతాయని, సమర్థమైన నెట్‌వర్క్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement