BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు.
"బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్‌లో బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్‌ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.
ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.
Connecting India!
Tried @BSNLCorporate ‘s #5G enabled phone call.
📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024
Comments
Please login to add a commentAdd a comment